Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

లీకైన చిత్రాలలో మొదటిసారిగా కనిపించిన హ్యుందాయ్ ఎక్స్టర్ డ్యాష్‌బోర్డ్‌

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం shreyash ద్వారా జూన్ 14, 2023 04:44 pm ప్రచురించబడింది

ఇది గ్రాండ్ i10 నియోస్ మరియు వెన్యూ వంటి ఇతర హ్యుందాయ్ మోడల్‌ల మిశ్రమ ఫీచర్‌లను కలిగి ఉంది

  • హ్యుందాయ్ ఎక్స్టర్ జూలై 10న విడుదల కానుంది, బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

  • ఈ విభాగంలోనే మొదటి సారిగా డ్యూయల్ డ్యాష్ క్యామ్ సెటప్ మరియు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్‌లను పొందుతుంది.

  • లీక్ అయిన ఇంటీరియర్ చిత్రాల ఆధారంగా, ఇది డిజిటలైజ్డ్ డ్రైవర్ డిస్‌ప్లే (వెన్యూలో చూసినట్లుగా) మరియు టచ్‌స్క్రీన్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది.

  • ఐదు విస్తృత వేరియంట్‌లలో అందించబడుతుంది: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్.

  • ఇది 1.2-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంది, పెట్రోల్ మరియు CNG రెండు ఎంపికలలో అందించబడుతుంది.

  • హ్యుందాయ్ ఎక్స్టర్ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా.

హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఈ మైక్రో SUV స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌లకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం, ఇంటర్నెట్‌లో లీక్ అయిన చిత్రాల ద్వారా దీని ఇంటీరియర్‌ లుక్‌ను మొదటిసారిగా చూడగలిగాము మరియు మరికొన్ని ఫీచర్‌లను గమనించగలిగాము. వీటి వివరాలు క్రింద అందించబడ్డాయి.

గ్రాండ్ i10 నియోస్ నుండి ప్రేరణ పొందిన డ్యాష్బోర్డ్

ఎక్స్టర్ ఇంటీరియర్, ముఖ్యంగా దీని లేఅవుట్‌ గ్రాండ్ i10 నియోస్‌ను తలపిస్తుంది. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్నట్లుగానే, ఎక్స్టర్‌లో కూడా ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ డిజైన్‌ను కలిగి ఉంది మరియు డిస్‌ప్లే క్రింద సెంట్రల్ AC వెంట్‌లను కలిగి ఉంది. లీక్ అయిన చిత్రాల నుండి, టచ్‌స్క్రీన్ పరిమాణాన్ని గుర్తించడం సాధ్యపడలేదు, కానీ గ్రాండ్ i10 నియోస్‌లో అందించబడిన 8-అంగుళాల సెటప్ మాత్రం ఇందులో లేదు, ఇది ఖచ్చితంగా i20లో కనిపించే 10.25-అంగుళాల యూనిట్ కంటే చిన్నది.

వెన్యూ మరియు వెర్నా వంటి ఇతర హ్యుందాయ్ కార్‌లలో ఉన్న డిజిటలైజ్డ్ డ్రైవర్ డిస్‌ప్లేను ఎక్స్టర్‌లో కూడా అందిస్తున్నట్లు కారు తయారీదారు ధృవీకరించారు. చిత్రాల ఆధారంగా, ఎక్స్టర్‌లో ఆటో AC మరియు క్రూయిజ్ కంట్రోల్‌ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.

మనకు ఇప్పటికే తెలిసిన మరిన్ని ఫీచర్‌లు

హ్యుందాయ్ ఎక్స్టర్‌ పొందిన ఫీచర్‌లను ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. ఈ మైక్రో SUV డ్యూయల్ డ్యాష్ క్యామ్ సెటప్ మరియు వాయిస్ అసిస్టెడ్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. అలాగే, భద్రతా పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్ మరియు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు మొత్తం ఐదు సీట్‌లకు రిమైండర్‌లు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్టర్‌ను ఐదు విస్తృత వేరియంట్‌లలో అందిస్తుంది: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. వేరియంట్‌ల వివరాలు మోడల్ విడుదలకు ముందు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ప్రొపల్షన్ విధులు

ఎక్స్టర్‌ కేవలం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ పెట్రోల్ AMT‌తో జతచేయబడుతుంది. విడుదల తరువాత మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికతో CNG ఎంపికను కూడా పొందుతుంది.

ఇవి కూడా చదవండిః మొదటిసారి కెమెరాకు చిక్కిన నవీకరించబడిన హ్యుందాయ్ i20 N లైన్

అంచనా ధర మరియు పోటీదారులు

హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ.6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. విడుదల అయిన తర్వాత, ఇది టాటా పంచ్, సిట్రోయెన్ C3, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు మారుతి ఫ్రాంక్స్‌లతో పోటీపడనుంది.

చిత్ర మూలం

Share via

Write your Comment on Hyundai ఎక్స్టర్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర