Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టెస్టింగ్ సమయంలో మొదటిసారి కనిపించిన Nissan Magnite Facelift

నిస్సాన్ మాగ్నైట్ కోసం rohit ద్వారా మార్చి 22, 2024 04:51 pm ప్రచురించబడింది

ఫేస్‌లిఫ్ట్ మాగ్నైట్ 2024 ద్వితీయార్థంలో విడుదల కానుంది

  • నిస్సాన్ మాగ్నైట్ SUV 2020 చివరిలో భారతదేశంలో విడుదల అయింది.

  • స్పై షాట్స్ లో, ఫేస్‌లిఫ్ట్ SUV కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ తో కనిపిస్తుంది.

  • ఇందులో బంపర్, నవీకరించిన లైటింగ్ సెటప్ ఇచ్చే అవకాశం ఉంది.

  • దీని క్యాబిన్ గురించి ఇంకా వెల్లడి కాలేదు, దీనిలో కొత్త సీటు అప్హోల్స్టరీ అందించవచ్చని అంచనా.

  • కొత్త మాగ్నైట్ సన్ రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అదనపు ఫీచర్లను పొందే అవకాశం ఉంది.

  • ప్రస్తుత మోడల్ ఒకే ట్రాన్స్మిషన్లతో N/A మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలను పొందవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ SUV ఈ సంవత్సరం కొత్త ఫేస్‌లిఫ్ట్ నవీకరణను పొందబోతోంది. ఇటీవల తొలిసారిగా టెస్టింగ్ సమయంలో కవర్తో కప్పబడి కనిపించిన కొన్ని చిత్రాలు ఆన్లైన్ లో విడుదల అయ్యాయి. డిసెంబర్ 2024 నాటికి మాగ్నైట్ భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నందున ఈ నవీకరణ SUV కోసం ఆచరణాత్మక కాలవ్యవధిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

స్పై షాట్స్ లో ఏం కనిపించాయి?

ఈ కారు ఎక్కువగా కవర్లతో కప్పబడి కనిపించినప్పటికీ, దాని ఆకారం స్పష్టంగా నిస్సాన్ మాగ్నైట్ సాధారణ మోడల్ ను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఫేస్‌లిఫ్ట్ SUV యొక్క ఎక్స్టీరియర్ ప్రొఫైల్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉండనుంది. ఫొటోల్లో ఈ వాహనంలో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కనిపించాయి. ఇందులో కొత్త డిజైన్ ఫ్రంట్, నవీకరించిన లైటింగ్ సెటప్, మోడిఫైడ్ బంపర్లు అందించవచ్చని అంచనా.

ఆశించబడ్డ క్యాబిన్ మరియు ఫీచర్ నవీకరణలు

స్పై షాట్లలో ఫేస్ లిఫ్టెడ్ మాగ్నైట్ SUV యొక్క క్యాబిన్ కనపడనప్పటికీ, ఇందులో కొత్త సీటు అప్ హోల్ స్టరీ, సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో సహా సెగ్మెంట్ లోని ఇతర కార్లకు గట్టి పోటీనిచ్చే అనేక అదనపు ఫీచర్లను అందించవచ్చని మనం ఊహించవచ్చు. 8 అంగుళాల టచ్‌స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆప్షనల్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రత దృష్ట్యా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించవచ్చు. ఇందులో ఇప్పటికే 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ISOFIX చైల్డ్ సీట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: భారతదేశంలో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న 10 అత్యంత చౌకైన కార్లు ఇవే

ఇంజిన్ ఎంపికలలో ఎలాంటి మార్పులు లేవు

2024 నిస్సాన్ మాగ్నైట్ SUV యొక్క ఇంజన్-గేర్బాక్స్ ఎంపికలు మారే అవకాశం లేదు. సబ్-4m SUV ప్రస్తుతం ఈ క్రింది ఇంజన్-గేర్ బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది:

స్పెసిఫికేషన్

1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్

72 PS

100 PS

టార్క్

96 Nm

160 Nm, 152 Nm

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT, CVT

మాగ్నైట్ 2023 ద్వితీయార్ధంలో దాని నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ఎంపికను అందించారు. మరోవైపు, దాని టర్బో-పెట్రోల్ యూనిట్, 2020 చివరిలో SUVని ప్రారంభించినప్పటి నుండి CVT ఆటోమేటిక్ అందుబాటులో ఉంది.

ఆశించిన విడుదల మరియు ధర

ఫేస్‌లిఫ్ట్ నిస్సాన్ మాగ్నైట్ SUVని 2024 రెండవ త్రైమాసికంలో భారతదేశంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంచవచ్చు. మాగ్నైట్ ప్రస్తుతం రూ.6 లక్షల నుండి రూ.11.27 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ఉంది. ఇది హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ మరియు మహీంద్రా XUV300, అలాగే రాబోయే స్కోడా సబ్-4m SUVతో వంటి వాటితో పోటీపడుతుంది. ఫేస్‌లిఫ్ట్ మాగ్నైట్ మారుతి ఫ్రాంక్స్ సబ్-4ఎm క్రాసోవర్ కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

చిత్ర మూలం

మరింత చదవండి: మాగ్నైట్ AMT

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 26 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన నిస్సాన్ మాగ్నైట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర