నిస్సాన్ కిక్స్ వేరియంట్ల వివరణ: XL, XV, XV ప్రీమియం, XV ప్రీమియం ఆప్షన్

నిస్సాన్ కిక్స్ కోసం dhruv attri ద్వారా మార్చి 07, 2019 11:41 am ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Nissan Kicks Variants Explained: XL, XV, XV Premium, XV Premium Option

నిస్సాన్ కిక్స్ చివరరికి భారతదేశంలో రూ.9.55 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించబడినది. ఇది XL,XV,XV ప్రీమియం మరియు XV ప్రీమియం ఆప్షన్ అను నాలుగు వేరియంట్లతో అందించబడుతున్నది. అయితే కిక్స్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందించబడుతుంది. అయితే పెట్రోల్ మోటార్ ప్రవేశ స్థాయి XL మరియు XV వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. అయితే ఏ వేరియంట్ మరియు ఇంజన్ కాంబినేషన్ మీ బడ్జెట్ కి సరిపోతాయో కనుక్కుందాం.

వాటి గురించి మనం తెలుసుకొనే ముందు ఇది ఏ రంగులలో అందించబడుతుందో ఇక్కడ చూడండి.

  • పెరల్ వైట్
  • బ్లేడ్ సిల్వర్
  • బ్రాంజ్ గ్రే
  • అంబర్ ఆరెంజ్
  • డీప్ బ్లూ పెరల్
  • నైట్ షేడ్
  • కయేన్ రెడ్
  • ఆరెంజ్ రూఫ్ తో పెరల్ వైట్ (XV ప్రీమియం ఆప్షన్)
  • బ్లాక్ రూఫ్ తో పెరల్ వైట్ (XV ప్రీమియం ఎంపిక)
  • ఆరెంజ్ రూఫ్ తో బ్రాంజ్ గ్రే (XV ప్రీమియం ఆప్షన్)
  • కయేన్ రెడ్ & బ్లాక్ రూఫ్ (XV ప్రీమియం ఆప్షన్)

 India-spec Nissan Kicks: First Drive Review

ప్రాధమిక భద్రత కిట్

  • డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
  • EBD తో ABS
  • మాన్యువల్ డే / నైట్ IRVM
  • ముందు మరియు వెనుక అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్
  • స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్స్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ అన్లాక్
  • వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు డిఫాగర్
  • సెంట్రల్ లాకింగ్
  • ప్రీటినేషనర్లు, లోడ్ పరిమితులు మరియు రిమైండర్లతో ముందు సీటుబెల్ట్స్

నిస్సాన్ కిక్స్ XL: అన్ని బేస్ లక్షణాలను కలిగి ఉంటుంది; ఎవరైతే తగిన బడ్జెట్ కి కాంపాక్ట్ SUV కోసం చూస్తున్నారో వారికి మంచి ఎంపిక  

ఎక్స్-షోరూమ్ ఇండియా         పెట్రోల్                    డీజిల్

ధర                                     రూ.9.55 లక్షలు         రూ.10.85 లక్షలు

బయట భాగాలు: బాడీ కలర్డ్ బంపర్స్ మరియు అవుటర్ డోర్ హ్యాండిల్స్, హాలోజెన్ హెడ్ల్యాంప్స్, LED టెయిల్ లైట్లు మరియు కవర్స్ తో 16 ఇంచ్ స్టీల్ వీల్స్.

లోపల భాగాలు: క్రోం తో లోపల డోర్ హ్యాండిల్స్ , ఆల్ బ్లాక్ ఇంటీరియర్ లేఅవుట్, డ్యుయల్ సన్ విజర్స్ తో ఫాబ్రిక్ సీట్లు,అంతేకాకుండా ముందు ప్రయాణీకుల కోసం వానిటీ మిర్రర్.  

సౌకర్యాలు: బ్లింకర్స్ తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM, డ్రైవర్ సైడ్ ఆటో అప్ / డౌన్ తో మొత్తం నాలుగు పవర్ విండోస్, రిమోట్ కీ, 6-వే మాన్యువల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కూలెడ్ గ్లోవ్ బాక్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, ఆటో AC, రేర్ AC వెంట్ మరియు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్.

ఆడియో: 2-DIN ఆడియో సిస్టమ్ (MP3, AUX, USB మరియు బ్లూటూత్), ముందు మరియు వెనుక స్పీకర్లు మరియు నిస్సాన్ కనెక్ట్ టెలిమాటిక్స్ సపోర్ట్.

ఇది కొనుగోలు చేసేందుకు సరైనదా??

నిస్సన్ కిక్స్ యొక్క ఈ బేస్ వేరియంట్ మనం ఈ ఆధునిక రోజుల్లో ఎటువంటి కాంపాక్ట్ SUV కావాలనుకుంటామో, దానికి ఉండాల్సిన అన్ని బేసిక్ లక్షణాలను కలిగి ఉంది. మీ దగ్గర డబ్బులు పరిమితంగా ఉండి అయినప్పటికీ మీకు నిస్సాన్ కిక్స్ ఏ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఈ వేరియంట్ సరైనది. ఒకవేళ మీరు దీనిని కొనుక్కొని ఎక్కువగా ఉపయోగించనట్లయితే, కొన్ని రోజులు ఆగి తరువత వేరియంట్ కొనుక్కోడం మంచిది. ఎందుకంటే దీనిలో సెంటర్ ఆర్మ్రెస్ట్   లేదు. ఈ లక్షణం తరువాత వేరియంట్ నుండి అందించబడుతుంది.

India-spec Nissan Kicks: First Drive Review

నిస్సాన్ కిక్స్ XV:ఉపయోగకరమైన అదనపు ఫీచర్లను పొందవచ్చు, కానీ XL వేరియంట్ కంటే ఖర్చు చాలా ఎక్కువ

ఎక్స్-షోరూమ్ ఇండియా                    పెట్రోల్                                      డీజిల్

ధర                                                 రూ.10.95 లక్షలు          రూ.12.49 లక్షలు

గత వేరియంట్ పై ప్రీమియం                    రూ.1.40 లక్షలు     రూ.1.64 లక్షలు

బయటభాగాలు: 17 ఇంచ్ మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్,ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్,రూఫ్ రైల్స్.  

సౌకర్యాలు: రియర్ వైపర్, సింగిల్ స్టిచ్ తో ఫాబ్రిక్ సీట్లు, కప్ హోల్డర్స్ తో వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్, ఫ్రంట్ సీటుకి బ్యాక్ పోకెట్, డీజిల్ వెర్షన్ ECO మోడ్ ను పొందుతుంది.

భద్రత: రియర్ పార్కింగ్ కెమెరా, డీజిల్ వేరియంట్స్ కోసం VDC (వెహికెల్ డైనమిక్ కంట్రోల్).

ఇన్ఫోటైన్మెంట్: ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,వాయిస్ రికగ్నైజేషన్, బ్లూటూత్, USB మరియు AUX- ఇన్ కనెక్టివిటీతో 8 ఇంచ్ టచ్స్క్రీన్ యూనిట్. అలాగే స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ ని పొందుతుంది.

ఇది కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా??

ఇది ప్రీమియం రూ.1.4 లక్షలు నుండి రూ.1.64 లక్షలు వరకూ ఖరీదు బాగా ఎక్కువ మరియు అన్ని లక్షణాలను కలిగి ఉంది. కానీ అంత డబ్బుకి న్యాయం అయితే చేయదు. అయితే ఇది అధనంగా మార్కెట్ లో కూడా లేనటువంటి అన్ని ఉపయోగకర లక్షణాలను కలిగి ఉంది. బేస్ వేరియంట్ కంటే డబ్బులు పెంచుకుంటూ ఈ వేరియంట్ తీసుకున్నా సరే వాడుతున్న కొలదీ ఈ లక్షణాలను మీరు మెచ్చుకుంటారు.

అయినా బేస్ వేరియంట్ కూడా అవసరమైన లక్షణాలను కలిగి ఉంది. మా ఉద్దేశం ప్రకారం మీరు బేస్ వేరియంట్ తీసుకొని తరువాత లక్షణాలను కావలనుకుంటే అధనంగా మార్కెట్ లో పొందవచ్చు. దీని వలన డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

India-spec Nissan Kicks: First Drive Review

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియం: అదనపు లక్షణాలు అధిక వ్యయంతో ఉన్నప్పటికీ, కారుకి కొత్తదనం జోడించాయి

ఎక్స్-షోరూమ్ ఇండియా                  పెట్రోల్                                                    డీజిల్

 

ధర                                               అందుబాటులో లేదు                                 రూ.13.65 లక్షలు

గత వేరియంట్ పై ప్రీమియం                                                                           రూ.1.16 లక్షలు

బయటభాగాలు: LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVM లు.  

ఇంటీరియర్స్: లెదర్ వ్రాపెడ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్.

సౌకర్యాలు: ఎంట్రీ కోసం కీ కార్డ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్.

ఆడియో: రెండు అదనపు ట్వీటర్లు.

భద్రత: హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్.

ఇది కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా??

ఈ వేరియంట్ ప్రీమియం రూ.1.16 లక్షలు ముందు దాని కంటే ఎక్కువ మరియు కొన్ని కొత్త లక్షణాలను కలిగి ఉంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ పక్కన పెడితే ఈ వేరియంట్ లో మిగతా అధనపు లక్షణాలకు అంత డబ్బులు చాలా ఎక్కువ. అయితే మీరు ఈ వేరియంట్ కొరకు కొంచెం డబ్బులు పెట్టాలనుకున్నా సరే, మేము మాత్రం మీరు XL వేరియంట్ నే తీసుకొని డబ్బు ఆదా చేసుకోమని సూచిస్తాము.

India-spec Nissan Kicks: First Drive Review

నిస్సాన్ కిక్స్ XV ప్రీమియమ్ ఆప్షన్: సురక్షితమైనది మరియు విలాసవంతమైనదని అనిపిస్తుంది, కానీ ఇది మరో ఖరీదైన నవీకరణ

ఎక్స్-షోరూమ్ ఇండియా                    పెట్రోల్                                                    డీజిల్

ధర                                                   అందుబాటులో లేదు                              రూ 14.65 లక్షలు

గత వేరియంట్ పై ప్రీమియం                                                                               రూ .1 లక్ష

బయటభాగాలు: కార్నరింగ్ ఫంక్షన్ తో ఫ్రంట్ తో ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ , డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ (ఆప్షన్).

లోపల భాగాలు: నలుపు మరియు బ్రవున్ డాష్బోర్డ్ లేఅవుట్, లెథర్ తో చుట్టిన సీట్లు, స్టీరింగ్ వీల్ మరియు డబుల్ స్టిచ్ తో ఫ్రంట్ ఆర్మ్రెస్ట్.

సౌకర్యాలు: ఫాలో-హోమ్-ఫంక్షన్ తో ఆటో హెడ్ లాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మరియు అర్రెస్ట్ స్టోరేజ్ లైట్.

భద్రత: బర్డ్ ఐ వ్యూ తో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు డైనమిక్ గైడ్ లైన్స్, ఫ్రంట్ సైడ్ ఎయిర్బాగ్స్ మరియు రేర్ ఫాగ్ ల్యాంప్స్.

ఇది కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా??

ఈ టాప్ వేరియంట్, XV ప్రీమియం ఆప్షన్ యొక్క నవీకరణ ఖరీదు పాత XV ప్రీమియం వేరియంట్ కంటే ఎక్కువ. కానీ దీనిలో విభాగంలో మొదటి 360-డిగ్రీ రేర్ పార్కింగ్ కెమరా వంటి అధనపు లక్షణాలు ఉన్నాయి. దీనిలో అధనపు ఎయిర్‌బ్యాగ్స్ మిమ్మల్ని సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అయితే, అరౌండ్ వ్యూ మోనిటర్ ఈ SUV ని ఇబ్బందికర ప్రదేశాలలో పార్క్ చేసేటపుడు ఉపయోగపడుతుంది.

మీరు పాత వేరియంట్ కంటే ఈ XV ప్రీమియం ఆప్షన్ కి డబ్బులు ఎక్కువ చెల్లించినా సరే ఇది మీ డబ్బుకు న్యాయం చేస్తుంది. అయితే దీనిలో మరిన్ని లక్షణాలు(ఉదాహరణకు సన్రూఫ్,వెంటిలేటెడ్ సీట్లు) ఇదే డబ్బులుకు ఉన్నా సరే లేదంటే దీని ఖరీదు ఒక రూ.40,000 తక్కువ ఉన్నా మేము దీనిని నిస్సందేహంగా కొనుగోలుదారులకు సూచించేవాళ్ళం. ప్రస్తుతానికి, నిస్సాన్ కిక్స్ యొక్క టాప్ వేరియంట్ కొనుగోలు చేయడం అది అందించే ప్రీమియం అనుభూతికి చాలా ఖరీదు ఎక్కువ.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన నిస్సాన్ కిక్స్

1 వ్యాఖ్య
1
S
sneh ranjan
Jan 5, 2020, 9:43:32 PM

Thanks for the useful advice which is very useful. One can go for XL as it stands for value for money.

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience