అక్టోబర్ 2019 లో కియా సెల్టోస్ అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV గా నిలిచింది
కియా సెల్తోస్ 2019-2023 కోసం rohit ద్వారా నవంబర్ 12, 2019 04:38 pm ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సెల్టోస్ మినహా మిగతా కాంపాక్ట్ SUV లు అక్టోబర్ లో 10K అమ్మకాల సంఖ్యను దాటలేకపోయాయి
- సెల్టోస్ 12,000 యూనిట్ల అమ్మకాలతో ఈ విభాగంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
- హ్యుందాయ్ 7,000 యూనిట్లకు పైగా అమ్మకాలు చేయడంతో క్రెటా రెండవ స్థానంలో నిలిచింది.
- 313 యూనిట్లు విక్రయించడంతో నిస్సాన్ కిక్స్ రెండవ స్థానంలో నిలిచింది
- రెనాల్ట్ క్యాప్టూర్ 0.81 శాతం మార్కెట్ షేర్ ని కోరుతుంది.
- మొత్తంమీద, ఈ విభాగం దాదాపు 38 శాతం వృద్ధిని సాధించింది.
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ అత్యంత ఆర్ధిక మాంద్యం లో ఉండగా తయారీదారులు తమ అమ్మకాల గణాంకాలను పెంచడానికి ఒక వెలుగు లాగా దీపావళి వచ్చింది. కియా ఆగస్టు లో దేశంలోకి ప్రవేశించింది మరియు కాంపాక్ట్ SUV విభాగంలో ఒక తుఫాను లాగా తన మొదటి సమర్పణ సెల్టోస్ తో దూసుకొని వచ్చింది. కాంపాక్ట్ SUV లు 2019 అక్టోబర్ నెలలో ఎలా పనితీరుని అందించాయో ఇక్కడ చూద్దాము:
అక్టోబర్ 2019 |
సెప్టెంబర్ 2019 |
MoM గ్రోత్ |
మార్కెట్ షేర్ ప్రస్తుతం (%) |
మార్కెట్ షేర్ (%గత సంవత్సరం) |
YoY మార్కెట్ షేర్ (%) |
ఏవరేజ్ సేల్స్ (6 నెలలు) |
|
హ్యుందాయ్ క్రెటా |
7269 |
6641 |
9.45 |
26.66 |
56.72 |
-30.06 |
7850 |
మారుతి సుజుకి ఎస్-క్రాస్ |
1356 |
1040 |
30.38 |
4.97 |
16.08 |
-11.11 |
1232 |
రెనాల్ట్ డస్టర్ |
622 |
544 |
14.33 |
2.28 |
3.63 |
-1.35 |
793 |
రెనాల్ట్ కాప్టూర్ |
222 |
18 |
1133.33 |
0.81 |
1.24 |
-0.43 |
63 |
కియా సెల్టోస్ |
12854 |
7754 |
65.77 |
47.14 |
0 |
45.9 |
47.14 |
నిస్సాన్ కిక్స్ |
313 |
204 |
53.43 |
1.14 |
0 |
1.14 |
169 |
మహీంద్రా స్కార్పియో |
4628 |
3600 |
28.55 |
16.97 |
22.31 |
-5.34 |
3301 |
మొత్తం |
27264 |
19801 |
37.69 |
99.97 |
ముఖ్యమైనవి
- కియా సెల్టోస్ కాంపాక్ట్ SUV విభాగాన్ని వరుసగా రెండోసారి శాసించింది. గత నెలతో పోల్చితే దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 5,000 యూనిట్ల SUV లని అమ్మకాలు చేయగలిగింది. స్పష్టంగా, సెల్టోస్ 47 శాతం మార్కెట్ షేర్ తో ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది.
- కియా తోబుట్టువు, హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది నెలవారీ (MoM) గణాంకాల పరంగా అతి తక్కువ గ్రోత్ ని సాధించింది. ఏదేమైనా, క్రెటా యొక్క సంవత్సర-సంవత్సరం (YOY) మార్కెట్ షేర్ చాలా దెబ్బతింది మరియు 2018 లో 56 శాతం నుండి ఈ సంవత్సరం దాదాపు 27 శాతానికి పడిపోయింది.
- స్కార్పియో ఈ విభాగంలో మహీంద్రా యొక్క ఏకైక సమర్పణ. భారతీయ కార్ల తయారీదారు స్కార్పియో యొక్క 4,600 యూనిట్లను అమ్మకాలు చేసినప్పటికీ, దాని మార్కెట్ షేర్ ఐదు శాతానికి పైగా తగ్గింది. SUV ఇప్పుడు దాదాపు 17 శాతం మార్కెట్ షేర్ ను కలిగి ఉంది.
- మారుతి యొక్క కాంపాక్ట్ క్రాస్ఓవర్, S-క్రాస్, అక్టోబర్ నెలలో 1,356 యూనిట్ల అమ్మకాలతో ఊపందుకుంది. మునుపటి నెలతో పోలిస్తే అమ్మకాల గణాంకాలలో ఖచ్చితమైన మెరుగుదల ఉంది మరియు ఎస్-క్రాస్ ’MoM గణాంకాలు 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి.
- కాంపాక్ట్ SUV విభాగంలో రెండు మోడళ్లను అందించే ఏకైక బ్రాండ్ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్. కాప్టూర్ యొక్క MoM గణాంకాలు అత్యధికంగా 1,100 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అయినప్పటికీ, దాని మార్కెట్ వాటా 0.81 శాతంగా ఉంది, ఇది దేశంలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV గా నిలిచింది. మరోవైపు, రెనాల్ట్ అక్టోబర్ నెలలో డస్టర్ యొక్క 600 యూనిట్లకు పైగా అమ్మకాలు చేయగలిగింది.
- పండుగ నెలలో 313 యూనిట్లు మాత్రమే రవాణా చేయడంతో నిస్సాన్ కిక్స్ రెండవ స్థానంలో నిలిచింది. అయితే, దాని MoM గణాంకాలు 53 శాతానికి పైగా పెరిగాయి.
మరింత చదవండి: కియా సెల్టోస్ ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful