" నిస్సాన్ GT -R ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శన దిశగా ముందుకు వస్తోంది"
modified on జనవరి 18, 2016 06:47 pm by nabeel కోసం నిస్సాన్ జిటిఆర్
- 8 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిస్సాన్ జిటి ఆర్, ప్రతి నిజమైన డ్రైవింగ్ ఉత్సాహికుల కోసం ఒక కలగా ఉంది మరియు అన్ని ఇతర స్పోర్ట్స్ కార్ల తయారీదారులు కోసం ఒక పీడకల గా ఉంది. ఈ వాహనం యొక్క త్వరణాన్ని గనుక గమనించినట్లైతే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి ఇతర వాహనాల కంటే తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. నిజానికి ఈ వాహనం, 2008 లో ప్రారంబించబడిన తరువాత, ఈ జిటి ఆర్ వాహనం, త్వరణం మరియు కార్నరింగ్ లలో ఒక బెంచ్ మార్క్ ను సృష్టించింది. ఈ ప్రత్యేకమైన వేగవంతమైన కారు, ఆఖరి రేసు లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 వద్ద డొమినిక్ టొరెట్టో యొక్క డాడ్జ్ చాలెంజర్ ఎస్ ఆర్ టి వాహనానికి పోటీ గా నిలచింది. గతంలో 2015 వ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం, భారతదెశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సాదించడానికి మరియు అల్లకల్లోలం సృష్టించడానికి ఈ సంవత్సరం భారతదేశంలో ప్రవేశించనుంది. ఈ నిస్సన్ సంస్థ, రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో జిటి ఆర్ వాహనాన్ని ప్రదర్శించనుంది మరియు ఈ వాహనం, ఆడి యొక్క కొత్త ఆర్8 వాహనానికి పోటీ గా నిలబడుతుంది. ఆడి వాహనానికి మరియు పోర్సే 911 వాహనానికి పోటీ ను ఇవ్వడం కోసం ఈ వాహనాన్ని, సుమారు రూ 2 కోట్ల వద్ద ప్రవేశపెట్టనున్నారు. ఈ కారు ను, 3 ఎఫ్ -పదాలుగా సంగ్రహం చేయవచ్చు; అవి ఫైర్, ఫారం మరియు ఫినిస్సీ
ఫైర్:
నిస్సన్ వెబ్సైట్ ఈ విధంగా చెప్పబడింది. ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న నాలుగు అత్యంత ముఖ్యమైన వాటిలో ఇది ఒక చేతితో అబ్వృద్ది చేసిన జి టి ఆర్ యొక్క ఇంజన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిని తకుమి అని కూడా పిలుస్తారు మరియు ఇది, క్లిష్టమైన పని, అంకితభావంతో సంవత్సరాలుగా తన నైపుణ్యాలను సమర్ధవంతం చేసిన ఒక ప్రత్యేకమైన దానిని వర్ణించడానికి వాడే ఒక జపనీస్ పదం". ఈ తకుమి చే తయారు చేయబడిన ఇంజన్, అయిన 3.8 లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజన్ అత్యధికంగా 6400 ఆర్ పి ఎం వద్ద 554 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 3200 నుండి 5800 ఆర్ పి ఎం మధ్యలో 632 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 6- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క నాలుగు చక్రాలకు పంపిణీ అవుతుంది. దీనితో పాటు పవర్ గ్రౌండ్ ను చేరడానికి ఈ ఇంజన్ కు, ఎల్ ఎస్ డి (లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్) ఇన్స్టాల్ చేయబడింది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణాన్ని గనుక గమనించినట్లైతే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 2 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 315.4 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఫారమ్
ప్రెసిషన్ నిర్మించబడింది: వాహనాల భాగాలను కలిపే సమయంలో బాడీ ప్యానళ్ళను మరియు భాగాలను పట్టి ఉంచడంలో జిగ్స్ ను ఉపయోగిస్తారు. అనుభవం నిపుణుల చే కంపనం పరీక్ష, లేజర్ కొలతలు, మరియు సమగ్ర పరీక్షలు దీర్ఘకాల కార్యాచరణను నిర్ధారించడానికి నిర్వహిస్తారు మరియు అసెంబ్లీ సమయంలో కచ్చితత్వంతో అలాగే సున్నితమైన అత్యధిక స్థాయిలు నిర్వహించడానికి విడి భాగాలను శ్రద్ద గా కలుపుతారు. "కేవలం 0.26 యొక్క ఒక డ్రాగ్ గుణకం తో, జిటి ఆర్ వాహనం భూమిపై అత్యంత వాయుగతపరంగా సానుకూల స్పోర్ట్స్ కారు లలో ఒకటిగా నిలచింది. ఈ వాహనం, పెద్ద ముందు భాగంతో పాటుగా నలుపు గ్రిల్ తో అలాగే జిటి ఆర్ సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం తో ఈ జపనీస్ వాహన శరీర నిర్మాణం ఒక నవీన లుక్ ను ఇస్తుంది. నలుపు ఏ పిల్లార్ స్లోపింగ్ రూఫ్ లైన్ కు విలీనం చేయబడి ఉంటుంది దీని వలన వెనుక భాగంలో ఉండే బూట్ కు ఒక మంచి లుక్ అందించబడుతుంది. వెనుక భాగానికి స్పోర్టీ లుక్ ను జోడించినట్లైతే, అధిక వేగాల వద్ద ట్రాక్షన్ ను నిర్వహించడానికి డౌన్ ఫోర్స్ అవసరం అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క వెనుక భాగానికి నాలుగు రౌండ్ ఆకారపు టైల్ ల్యాంప్లు అందించబడతాయి మరియు దీని క్రింది భాగంలో క్రోం పూతను కలిగిన నాలుగు ఎగ్జాస్ట్ పైపులు విలీనం చేయబడి ఉంటాయి.
ఫినిస్సీ
ఈ జిటి ఆర్ వాహనం యొక్క అంతర్గత భాగాలను చూసినట్లైతే, స్పోర్టీ లుక్ ను మరింత పెంచడం కోసం గేర్ లెవెర్ ప్రక్కన భాగంలో పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అందించబడుతుంది. క్యాబిన్ లోపలి భాగంలో, ఏసి మరియు సంగీతం అలాగే యాంత్రిక ఆనందాల కోసం పెద్ద డిస్ప్లే వంటివి డాష్బోర్డ్ కు ఒక నవీన లుక్ ను అందిస్తాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అనేక అనలాగ్ మరియు డిజిటల్ క్లస్టర్ లతో డ్రైవర్ కు ఆకర్షణీయమైన మరియు పురాతనమైన రెండిటి కలయికలను అందిస్తుంది. డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం క్యాబిన్ లో ఉండే స్టీరింగ్ వీల్ పై, అనేక నియంత్రణా స్విచ్చులు అందంగా పొందుపరచబడి ఉంటాయి. డాష్బోర్డ్ స్క్రీన్ లు, సమాచారం ప్రదర్శన ను ప్రదర్శిస్తాయి. ఇది ల్యాప్ సమయాలు పర్యవేక్షించడం అయినప్పటికీ, మూలల, త్వరణం మరియు జి-ఫోర్స్ డేటా ప్రదర్శించే ఒక సహజమైన వ్యవస్థ అని చెప్పవచ్చు.
2016 ఆటో ఎక్స్పో వద్ద మరిన్ని విషయాలు
- తదుపరి తరం ఇన్నోవాను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్న టయోటా
- విటారా బ్రెజ్జా ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతున్న మారుతి సుజుకి
- 2016 ఆటో ఎక్స్పో వద్ద ఆడి యొక్క లైనప్ లో చేరబోతున్న కొత్త ఆర్8
- Renew Nissan GT-R Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful