తదుపరి తరం ఇన్నోవాను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్న టయోటా

టయోటా ఇనోవా కోసం saad ద్వారా జనవరి 13, 2016 05:18 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అన్ని కొత్త టయోట ఇన్నోవా వాహనాలు, ఇటీవల ఇండోనేషియన్ మార్కెట్ లో అంతర్జాతీయంగా రంగప్రవేశం చేశాయి. ఈ రెండవ తరం ఇన్నోవా వాహనం, హుడ్ క్రింది భాగంలో ఒక కొత్త ఇంజన్ ఎంపిక తో పాటు సరి కొత్త వెలుపలి అలాగే అంతర్గత భాగాలతో వస్తుంది. భారతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న వెర్షన్ పాత అంశాల్తో ఉంటుంది మరియు ప్రజలు కొత్త మోడల్ కోసం ఆత్రంగా వేచి చూస్తున్నారు. అదే సమయంలో, ఈ సంస్థ ఒక కొత్త 2016 ఇన్నోవా ఎంపివి వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించడానికి సిద్దంగా ఉంది. ఈ వాహనం, ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రారంభమౌతుంది అని అంచనాతో ఉన్నారు. 

ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, స్పోర్ట్స్ డ్యూయల్ స్లాట్ క్రోం గ్రిల్ తో పాటు ఎల్ ఈ డి ప్రొజక్టార్ టైప్ హెడ్ ల్యాంప్లు మరియు బారీఎ షట్కోణ ఆకృతి లో ఉండే ఎయిర్ డాం వంటి అంశాలను అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందు ప్రొఫైల్ ను చూసినట్లైతే, మునుపటి వాహనానికి విరుద్దంగా చాలా దూకుడుగా మరియు చాలా ఆకర్షణీయం గా కనబడుతుంది. ఇతర నవీకరణల విషయానికి వస్తే, ఈ వాహనానికి 16- 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు వెనుక భాగంలో బుమేరాంగ్ ఆకారపు టైల్ లైట్లు అందించబడతాయి.

2016 టయోటా ఇన్నోవా అంతర్గత భాగం విషయానికి వస్తే, మునుపటి వెర్షన్ కంటే ఎక్కువగా ప్రీమియం అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తుంది. క్యాబిన్ లోపలి భాగంలో ఉండే డాష్బోర్డ్ చెక్క తో ఫినిషింగ్ చేయబడి ఉంటుంది మరియు దీనిపై, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే స్మార్ట్ ఫోన్, మిరాకాస్ట్, డి ఎల్ ఎన్ ఏ, హెచ్ డి ఎం ఐ కనెక్టవిటీ, ఎయిర్ గెస్టర్ మరియు వెబ్ బ్రౌజర్ వంటి అంశాలను కలిగిన ఒక అధునాతన 8 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ అందించబడుతుంది. ఇతర సౌకర్య అంశాల విషయానికి వస్తే, ఆటోమేటిక్ పవర్ విండోలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ప్రకాశవంతమైన ల్యాంప్లు వంటి అంశాలు అందించబడతాయి.

ఈ టయోటా ఇన్నోవా బోనెట్ క్రింది భాగం విషయానికి వస్తే, ఒక కొత్త 2.4 లీటర్ 2జిడి ఎఫ్ టివి నాలుగు సిలండర్ల ఇన్ లైన్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 149 పి ఎస్ పవర్ ను అదే విధంగా 342 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, వేరియంట్ రకాన్ని బట్టి 5- స్పీడ్ మాన్యువల్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంటుంది.

జపనీస్ కార్ల తయారీదారుడు నుండి వచ్చిన వాహనాలలో టయోటా ఇన్నోవా అనునది ఎక్కువగా అమ్ముడుపోయే వాహనం అని చెప్పవచ్చు మరియు ఈ కొత్త వెర్షన్ యొక్క ప్రయోగం భారతీయ కారు మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. రాబోయే కొత్త ఇన్నోవా వాహనం యొక్క ధర సుమారు రూ 13 నుండి 16 లక్షల మధ్యలో ఉండవచ్చునని అంచనా.

ఇది కూడా చదవండి:
టొయోటా ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీదారిగా నిలచింది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టయోటా ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience