రాబోయే తరం యొక్క ఫియట్ లీనియా కారుని తెరదించారు.
ఫియట్ లీనియా కోసం అభిజీత్ ద్వారా మే 25, 2015 03:32 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఇటాలియన్ కారు దిగ్గజం అయిన ఫియట్ లీనియా సి-సెగ్మెంట్ సెడాన్ ను విజయవంతంగా తెరదించారు. దీనిలో మొదటి చిత్రం కారు యొక్క వెనుక బాగాన్ని చూపించసాగారు. అయితే వెనుక బాగం లో ఉన్న టైల్ లైట్ డిజైన్ ను చూపించారు. అంతేకాకుండా, ఫియట్ రాబోయే కారు యొక్క నామకరణం ఇంకా చేయవలసి ఉంది. కాని ఈ ఫియాట్ రాబోయే కారుకి లీనియా బ్యాడ్జ్ అని పేట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తయారీదారుడు, టర్కీలో ఇస్తాంబుల్ మోటార్ షో లో ఈ యొక్క కారుని మే 21 వ తేది నుండి 31 వరకు ప్రదర్శిస్తారు. మరియు దీనితో పాటుగా 2016 వ సంవత్సరం లో భారతీయ ఆటో ఎక్స్పో లో కూడా ప్రదర్శించబోతున్నారు.
తెరదించిన చిత్రం గురించి మాట్లాడటానికి వస్తే, కారు వెనుక నుండి మరియు అది ప్రస్తుతం విడుదల చేయబోయే తాజా కారు యొక్క డిజైన్ బాగాలను వర్ణిస్తుంది. దీని యొక్క టైల్ లైట్ 'C' ఆకారంలో ఉంటుంది. ఈ Cఆకారంలో ఉన్న టైల్ లైట్ లను మనం ఆస్టన్ మార్టిన్ కార్లలో చూడవచ్చు. దీనితో పాటుగా ఒక ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్, మరియు ప్రోమినెంట్ షోల్డర్ క్రీజ్ మెర్జింగ్ ను, కూడా ఈ టైల్ లైట్ పై బాగంలో చూడవచ్చు. తదుపరి తరం లీనియా 1.5 MJD ఇంజెన్ తో వస్తుంది. ఈ ఇంజెన్ ఎక్కువ సామర్ధ్యాన్ని, అధిక శక్తి స్థాయిలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఫియాట్ నుండి రాబోయే అన్ని కార్లు "విలాసవంతమైన ఇటాలియన్ డిజైన్" ను కలిగి ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు. మరియు ఫియట్, "అద్భుతమైన అంతర్గత సౌకర్యాన్ని మరియు భార సామర్ధ్యం" కలిగి ఉండే మోడల్లను అందించబోతున్నారు.