ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29న కొత్త-జనరేషన్ Dusterను ఆవిష్కరించనున్న Renault
రెనాల్ట్ డస్టర్ 2025 కోసం shreyash ద్వారా అక్టోబర్ 26, 2023 10:07 pm ప్రచురించబడింది
- 1.3K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 2025 నాటికి మన దేశంలో ప్రవేశిస్తుందని అంచనా
రిఫరెన్స్ కోసం రెనాల్ట్ బిగ్ؚస్టర్ చిత్రాలు ఉపయోగించబడినవి
-
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ బహుశా CMF-B ప్లాట్ఫార్మ్ పై ఆధారపడుతుంది.
-
ఇప్పటివరకు కనిపించిన రహస్య చిత్రాల ఆధారంగా నాజూకుగా కనిపించే హెడ్ؚలైట్ؚలతో బాక్సీ SUV డిజైన్ؚను కలిగి ఉంది.
-
మూడవ జనరేషన్ డస్టర్ బహుశా 3 పవర్ؚట్రెయిన్ ఎంపికలతో రావచ్చు, దీనిలో రెండు టర్బో-పెట్రోల్ మరియు ఒక హైబ్రిడ్ ఉన్నాయి.
-
భారతదేశంలో, కొత్త డస్టర్ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ SUVని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 29 తేదీన ఆవిష్కరించనున్నాను. నివేదికల ప్రకారం, రెనాల్ట్ బడ్జెట్-ఓరియెంటెడ్ బ్రాండ్, డాసియా, కొత్త జెన్ డస్టర్ؚను పోర్చుగల్ؚలో ప్రదర్శించనుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ బ్రాండ్ CMF-B ప్లాట్ఫార్మ్ పై ఆధారపడుతుంది మరియు బహుళ పవర్ؚట్రెయిన్ ఎంపికలను అందిస్తుందని అంచనా. ఈ కొత్త-జెన్ SUV గురించి ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలను నిశితంగా పరిశీలిద్దాం.
డిజైన్
ఇంతకు ముందు ఉన్న సమాచారం మరియు ఆన్ؚలైన్ؚలో కనిపించిన రహస్య చిత్రాల ఆధారంగా కొత్త డిజైన్‌లో వస్తున్న కొత్త డస్టర్ పూర్తిగా సరికొత్త గ్రిల్, LED DRLలతో నాజూకైన హెడ్ؚలైట్ సెట్అప్ మరియు భారీ ఎయిర్‌డ్యామ్ؚను కలిగి ఉంది.
ఇది కూడా పరిశీలించండి: భారతదేశంలో రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు వస్తున్న 7 వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ కార్లు
దృఢమైన వీల్ ఆర్చ్ؚలు, సైడ్ బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రెయిల్స్ దీని ధృడమైన ఆకర్షణను మరింత మెరుగుపరుస్తాయి. వెనుక భాగంలో, Y-ఆకారపు LED టెయిల్ ల్యాంపులు మరియు రేర్ బంపర్ؚలో అమర్చిన, బాగా కనిపించే స్కిడ్ ప్లేట్ؚలను కలిగి ఉండవచ్చు.
బహుళ పవర్ؚట్రెయిన్ ఎంపికలు
నివేదికల ప్రకారం, కొత్త-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 3 పవర్ؚట్రెయిన్ ఎంపికలతో రావచ్చు: అవి 110PS 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్-హైబ్రిడ్ (120-140PS) మరియు 170PSను విడుదల చేసే అత్యంత శక్తివంతమైన 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాంప్లియంట్ ఇంజన్. ఈ చివరి ఇంజన్ లాటిన్ అమెరికా మార్కెట్‌కు మాత్రమే పరిమితం కావచ్చు, ఇక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలపై మరిన్ని వివరాలు కొత్త డస్టర్ؚను విడుదల చేసిన తరువాత అందుబాటులోకి రావొచ్చు. రెనాల్ట్ ఈ SUVకి పూర్తి ఎలక్ట్రిక్ వర్షన్ؚను కూడా త్వరలోనే ప్రకటిస్తుందని అంచనా.
ఇది కూడా పరిశీలించండి: నవంబర్ 2న ఆవిష్కరించనున్న నాలుగవ-జెన్ స్కోడా సూపర్బ్, స్కెచ్ؚలలో టీజ్ చేయబడిన ఎక్స్ؚటీరియర్ డిజైన్
భారతదేశంలో విడుదల & పోటీదారులు
కొత్త-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 2025 సంవత్సరంలో భారతదేశానికి వస్తుందని అంచనా. దీని ధర రూ.10 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కావచ్చు. మార్కెట్‌లోకి విడుదల అయిన తరువాత ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful