2016 ఆటో ఎక్స్పో వద్ద ఆడి యొక్క లైనప్ లో చేరబోతున్న కొత్త ఆర్8
ఆడి ఆర్8 కోసం sumit ద్వారా జనవరి 18, 2016 11:08 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త ఆర్8 వాహనం, 2016 ఆటో ఎక్స్పో వద్ద ఆడి యొక్క లైన్ అప్ లో చేరబోతుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఫిబ్రవరి 4, 2016 నుండి ప్రారంభం అవుతున్న ఆటోమొబైల్ ప్రదర్శన వద్ద మొత్తం మూడు వాహనాలను దర్శించడానికి భావిస్తున్నారు.
ఆర్8 వాహనం మొదటి సారి 2015 జెనీవా మోటార్ షో వద్ద ప్రదర్శింపబడింది. ఈ కొత్త ఆర్8 వాహనం, మునుపటి వెర్షన్ తో పోలిస్తే లోపలి భాగంలో అనేక మార్పులను కలిగి ఉంది. ప్రధాన మార్పులు ఎక్కువగా, మునుపటి వెర్షన్ లో ఉండే ఇంటర్ఫేస్ స్క్రీన్ కు బదులుగా ఈ కొత్త ఆర్ 8 వాహనంలో ఒక డిజిటల్ 12.3 అంగుళాల ఆడి విర్త్యువల్ కాక్పిట్ వ్యవస్థ అందించబడింది. ఈ స్క్రీన్ ను, డ్రైవర్ వారి అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ భారతదేశం లో ఉండే వాహనం లో చూడవచ్చు. మునుపటి వెర్షన్ యొక్క డిజైన్ ఆధారంగా ఈ కొత్త ఆర్8 వాహనం రాబోతుంది.
ఈ కొత్త ఆర్ 8 వాహనం, ప్రస్తుతం ఉన్న మెర్సిడెస్ ఏఎం జి జిటి, పోర్సే 911 టర్బో మరియు మెక్లారెన్ 570ఎస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ కొత్త ఆర్8 వాహనం, ఆర్ 8 ఎల్ ఎం ఎస్ వాహనాలతో భాగాలను పంచుకుంది. ఈ వాహనానికి, 5.2 లీటర్ వి10 ఇంజన్ ను అందించడం జరిగింది మరియు ఇది రెండు ఇంజన్ ప్రత్యేకలతో వస్తుంది. ఈ అత్యంత శక్తివంతమైన ఇంజన్ అత్యధికంగా, 610 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 540 బి హెచ్ పి పవర్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆర్ 8 ప్లస్ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 3.2 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 330 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 7- స్పీడ్ ఎస్ ట్రోనిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం, క్వాట్రో ఏడబ్ల్యూడి వ్యవస్థ ద్వారా అన్ని చక్రాలకు పంపిణీ అవుతుంది. ఈ వాహనం, స్పోర్టియర్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఆర్8 వాహనం, 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడుతుంది.
ఇది కూడా చదవండి:
0 out of 0 found this helpful