Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌లో మొదటి వివరణాత్మక రూపాన్ని అందిస్తున్న కొత్త కియా సెల్టోస్ అఫీషియల్ టీజర్

కియా సెల్తోస్ కోసం ansh ద్వారా జూన్ 30, 2023 12:47 pm ప్రచురించబడింది

సరికొత్త ఫీచర్లు అలాగే మరిన్ని సాంకేతికతలతో ఫేస్‌లిఫ్టెడ్ SUV జూలై 4న విడుదల కానుంది.

ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ వచ్చే నెల ప్రారంభంలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది మరియు కాంపాక్ట్ SUV యొక్క అనేక స్పై షాట్‌ల తర్వాత, కారు తయారీ సంస్థ ఎట్టకేలకు దాని మొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది, ఇది దాని క్యాబిన్‌ కు సంబందించిన వివరణను మనకు అందిస్తుంది. 2023 సెల్టోస్ ప్రస్తుతానికి సంబంధించి బహుళ అప్‌డేట్‌లను పొందుతుంది మరియు టీజర్‌లో గుర్తించినవి ఇక్కడ ఇవ్వబడ్డాయి:

క్యాబిన్ యొక్క ఉత్తమ సంగ్రహావలోకనం

టీజర్, ORVM యొక్క వివరణతో ప్రారంభమవుతుంది అలాగే దాని ముందు ప్రొఫైల్ యొక్క సిల్హౌట్ మరియు సొగసైన కొత్త LED DRLలను పొందవచ్చు. అయితే మనం ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్‌ యొక్క టీజర్‌ను చూస్తున్నప్పుడు అతి ముఖ్యంగా లోపలి భాగాన్ని చూపిస్తుంది. నవీకరించబడిన కాంపాక్ట్ SUV, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లే సెటప్‌ను పొందుతుంది. స్టీరింగ్ వీల్ మునిపటి వలె అదే విధంగా కనిపిస్తుంది కానీ కొత్త సెంట్రల్ AC వెంట్స్ క్రింద ఉన్న డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ కూడా నవీకరించబడింది.

టీజర్ యొక్క చివరి షాట్ కాంపాక్ట్ SUV యొక్క కొత్త LED టెయిల్ ల్యాంప్‌లను చూపిస్తుంది.

మనకు ఇప్పటికే తెలిసినవి

ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి లక్షణాలను పొందుతుంది, ఇవి బహుళ స్పై షాట్‌ల ద్వారా నిర్ధారించబడ్డాయి. ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అవుట్‌గోయింగ్ మోడల్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

పవర్ట్రైన్

కొత్త కియా సెల్టోస్ మునుపటి ఇంజన్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రస్తుత వెర్షన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (115PS/144Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (115PS/250Nm) 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది.

ఇది కూడా చదవండి: ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లో వచ్చిన సమస్య కారణంగా కేరెన్స్ వాహనాల కోసం తిరిగి కాల్ చేస్తున్న కియా

ఇంతకుముందు నిలిపివేయబడిన 1.4-లీటర్ యూనిట్‌కు బదులుగా కార్‌ సంస్థ ఈ వాహనానికి1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని కూడా జోడించే అవకాశం ఉంది. కియా కేరెన్స్‌లో కనిపించే ఈ ఇంజన్, 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో జత చేయబడి, 160PS మరియు 253Nm పవర్ ని ఉత్పత్తి చేస్తుంది.

ధర మరియు ప్రత్యర్థులు

కియా, ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్‌ను జూలై 4న విడుదల చేస్తుంది మరియు దీని ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని మేము భావిస్తున్నాము. ప్రారంభించిన తర్వాత, ఇది హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు MG ఆస్టర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.

మరింత చదవండి: సెల్టోస్ డీజిల్

Share via

Write your Comment on Kia సెల్తోస్

H
harish ratad
Jul 1, 2023, 8:06:24 AM

Nice kia saltos

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర