Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

యూరోప్ؚలో కనిపించిన కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ డస్టర్ 2025 కోసం shreyash ద్వారా ఏప్రిల్ 03, 2023 12:09 pm ప్రచురించబడింది

మునుపటి దానితో పోలిస్తే కొత్త డస్టర్ గణనీయంగా భారీ కొలతలతో వస్తుందని రహస్యంగా తీసిన ఫోటోలు తెలుపుతున్నాయి.

  • కొత్త డస్టర్ రెనాల్ట్-నిస్సాన్ కొత్త CMF-B ఆర్ఖిటెక్చర్‌పై ఆధారపడుతుంది.

  • కొత్త ప్లాట్‌ఫారం ICE మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు రెండిటికీ మద్దతు ఇస్తుంది.

  • దీని డిజైన్ డాసియా బిగ్ؚస్టర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది.

  • భారతదేశంలో ఇది 2025లో విడుదల అవుతుందని, అలాగే నిస్సాన్ తోటి వాహనం కూడా వస్తుందని అంచనా.

తదుపరి-జనరేషన్ డస్టర్ అభివృద్ధిలో ఉంది మరియు 2024లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది అని అంచనా, కానీ దానికి ముందే యూరోప్ؚలో పరీక్షలు నిర్వహిస్తుండగా కెమెరాకు చిక్కింది. యూరోప్ؚలో విడుదలైన రెండవ-జనరేషన్ మోడల్ భారతదేశంలో విడుదల కానప్పటికీ, మొదటి-జనరేషన్ డస్టర్ؚను 2022 ప్రారంభంలో నిలిపివేయబడింది. అయితే, రాబోయే గ్లోబల్ మోడల్ؚతో డస్టర్ తిరిగి భారతదేశానికి వస్తుందని అంచనా.

సరికొత్త డిజైన్, భారీ కొలతలు

పూర్తిగా కప్పబడి ఉన్న టెస్ట్ వాహనం రహస్యంగా చిక్కిన ఫోటోల ఆధారంగా, కొత్త జనరేషన్ రెనాల్ట్ SUV డిజైన్ డాసియా బిగ్ؚస్టర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణను పొందినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ SUV రూపం మరింత నాజూకుగా, స్టైలిష్ؚగా కనిపిస్తుంది. SUV ముందు భాగంలో డ్యూయల్ స్ట్రిప్ LED DRLలు ఉన్నాయి మరియు కప్పిన బంపర్ؚలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన పెద్ద ఎయిర్ డ్యామ్ ఉంది.

ఇది కూడా చదవండి: తన సొంత రెనాల్ట్ ట్రైబర్ వెర్షన్ؚను పరిచయం చేస్తున్న నిస్సాన్

పక్క వైపు నుండి చూసినప్పుడు, చతురస్రాకార వీల్ వంపులు మరియు ఉబ్బెత్తుగా లేని ఫెండర్‌లతో SUV రూపం స్ట్రీమ్ؚలైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ రహస్య చిత్రాలలో SUV వెనుక డిజైన్ؚలో హచ్ؚబ్యాక్ ఆకారం కనిపిస్తుంది, పొడవైన రూఫ్ؚలైన్ మరియు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ؚతో ఇది చక్కని నిష్పత్తిలో ఉంది. ప్రస్తుత రెండవ-జనరేషన్ డస్టర్ 4.34 మీటర్‌ల పొడవు ఉంటుంది, దీని తరువాత రాబోయే, పరీక్షించబడిన వాహనం పెద్దదిగా ఉండవచ్చు.

కొత్త ప్లాట్ఫార్మ్

ICE మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚలు రెండిటికీ మద్దతు ఇచ్చే రెండవ జనరేషన్ యూరో-స్పెక్ వాహనంؚలాగే, మూడవ-జనరేషన్ డస్టర్ రెనాల్ట్-నిస్సాన్ కొత్త CMF-B ఆర్చిటెక్చర్‌పై ఆధారపడింది, డాసియా బ్రాండ్ నుంచి వస్తున్న కొత్త డస్టర్ ఖచ్చితంగా స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికను పొందుతుండవచ్చు మరియు దీన్నీ రెనాల్ట్-బ్యాడ్జెడ్ వెర్షన్ؚలో కూడా అందించవచ్చు. ఈ ప్లాట్ఫార్మ్ CMF-BEV ఆర్కిటెక్చర్ؚతో దగ్గరగా ఉంటుంది, కాబట్టి ఈ SUV భవిష్యత్తులో ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ؚను పొందవచ్చు.

దీన్ని కూడా చదవండి: భారతదేశంలో 4 SUVలను, 2 EVలను పరిచయం చేయనున్న నిస్సాన్ రెనాల్ట్

భారతదేశంలో విడుదల అంచనా తేదీ

రెనాల్ట్-నిస్సాన్ ఆటోమోటివ్ గ్రూప్, భారతదేశంలో, 2025 ప్రారంభం నుంచి విడుదల కాబోత్తున్న తమ కొత్త ఉత్పత్తుల ప్రణాళికను పంచుకుంది, ఇందులో నాలుగు SUVలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఖచ్చితంగా కొత్త జనరేషన్ డస్టర్ అవుతుంది, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ జంటలాగా, దీనితో పాటు నిస్సాన్-బాడ్జెడ్ తోటి వాహనం కూడా దీనితో వస్తుంది. విడుదలైన తరువాత ఇది మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, వోక్స్వాగన్ టైగూన్ మరియు స్కోడా కుషాక్ؚలతో పోటీ పడుతుంది.

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 35 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన రెనాల్ట్ డస్టర్ 2025

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర