2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడిన N 2025 విజన్ గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్
ఫిబ్రవరి 03, 2016 03:48 pm manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
#FIRST2EXPO- నేలమీద అతిపెద్ద మీడియా సిబ్బందితో, కార్దేఖో మీకు ఆటో ఎక్స్పో 2016 ని అత్యంత విస్తృతంగా చూపిస్తుంది
హ్యుందాయ్ సంస్థ కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పో లో N 2025 విజన్ గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్ ని ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ కొరియన్ వాహన తయారీసంస్థ 'N' సబ్ ప్రదర్శన బ్రాండ్ ప్రచారం లక్ష్యంతో ఆవిష్కరించబడింది మరియు అనుకున్న దానిని సక్రమంగా చేసింది. ఒక స్పోర్ట్స్ కారు లేదా ఒక కాన్సెప్ట్ కారు చూడడానికి బాగునట్ట్లుగా కనిపించినా ప్రత్యేకంగా చెప్పాలంటే అంత ఆకార్షణీయంగా ఉండదు. N 2025 అటువంటి అపవాధనలు తీసేయడమే కాకుండా మరిన్ని ప్రత్యేఖతలను కలిగి ఉంది. ఈ హ్యుందాయ్ దాని 'ఎన్' బ్రాండ్ ని భారతదేశానికి తీసుకురావడంలో ఏవైనా ప్రణాళికలు వేసుకున్నట్లు అయితే అవి ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంది.
ఈ కాన్సెప్ట్ తదుపరి తరం అధిక పనితీరు గల వాహనం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఈ కాన్సెప్ట్ లోతుగా దృష్టి సారిస్తుంది. ఇది ఒక F1 కారు మరియు ఒక స్పేస్ షిప్ మధ్య క్రాస్ గా ఉంటుంది. స్పేస్-ఏజ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, ఈ N2025 కాన్సెప్ట్ యొక్క పవర్ట్రెయిన్ 2013 లో హ్యుందాయ్ సంస్థచే తయారుచేయబడిన ప్రపంచంలో మొట్టమొదటి భారీఎత్తున ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ ఇంధన సెల్ తో అమర్చబడి ఉంటుంది. ఈ ర్యావరణ అనుకూలమైన పవర్ప్లాంట్ వ్యవస్థ 884PS శక్తిని అందించగా, దీని లో 680PS శక్తిని ద్వంద్వ ఇంధన సెల్ నిల్వల నుంచి అందించబడగా, మిగిలిన 204PS శక్తిని సూపర్ కెపాసిటర్ వ్యవస్థ అందిస్తుంది. దీనిలో మరో వినూత్న అభివృద్ది ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్నిర్మితం చెయబడి ఉంటుంది, ఇవి ఈ భవిష్యత్ సూపర్కారు నాలుగు చక్రాలు లో నిర్మించబడి ఉంటాయి. ఇది కూడా కారు సరైన ట్రాక్షన్ అందించడానికి సహాయపడుతుంది. గమనిస్తే, హ్యుందాయ్ ఆటో ఎక్స్పో వద్ద అతిపెద్ద పెవిలియన్ గా ఉంటుంది మరియు ఈ కాన్సెప్ట్ షో యొక్క ముఖ్యాంశంగా పరిగణించబడుతుంది.