Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నవంబర్ 2023 నుండి పెరగనున్న MG Hector, Hector Plus ధరలు

ఎంజి హెక్టర్ కోసం shreyash ద్వారా అక్టోబర్ 30, 2023 02:11 pm ప్రచురించబడింది

ఈ కారు తయారీదారు అక్టోబర్ 2023కు ముందు ఈ రెండు SUVల ధరలను రూ.1.37 లక్షల వరకు తగ్గించారు

  • MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ ప్రస్తుత తగ్గింపు ధరలు అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

  • పండుగ సీజన్ ప్రోత్సాహకాలలో భాగంగా వీటి ధరలు తగ్గించారు.

  • నవంబర్ 1 నుండి ఈ రెండు SUVలు అసలు ధరలకు విక్రయించనున్నారు.

  • ప్రస్తుతం, MG హెక్టార్ ధర రూ.14.73 లక్షల నుండి రూ.21.73 లక్షల వరకు ఉంది.

  • MG హెక్టార్ ప్లస్ ధర రూ.17.50 మరియు రూ.22.43 లక్షల పరిధిలో ఉంటుంది.

సెప్టెంబర్ 2023 చివరిలో MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ ధరలను రూ.1.37 లక్షల వరకు తగ్గించిన తరువాత, ప్రస్తుతం ఈ కారు తయారీదారు నవంబర్ 1 నుండి ఈ SUVల ధరలను పెంచాలని భావిస్తోంది. నివేదికల ప్రకారం, పండుగ సీజన్‌కు ముందు ఈ బ్రాండ్ 100వ వార్షిక దినోత్సవ వేడుకలలో భాగంగా తగ్గింపు ధరలను పరిచయం చేసింది.

ధరల పెంపు వివరాలు ఇంకా వెల్లడించలేదు

ఈ SUVల ధరల పెరుగుదల ఏ మేరకు ఉంటుందో MG అధికారికంగా ప్రకటించలేదు, MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ వాటి అసలు ధరలకు లభించవచ్చు, లేదా అదనంగా కొంత మెరకు పెరగవచ్చు. ఈ SUVల డీజిల్ వేరియెంట్ؚల ధరలలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా, ఎందుకంటే వీటి ధరలు మరింతగా తగ్గించారు.

అందిస్తున్న సాధారణ ఫీచర్‌లు

MG హెక్టార్ (5-సీటర్ SUV) మరియు MG హెక్టార్ ప్లస్ (3-వరుసల SUV) రెండు మోడల్‌లు 14-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 7-అంగుళాల ఫుల్లీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనరోమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు పవర్డ్ టెయిల్ గేట్ؚతో వస్తాయి.

ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు లేన్ؚకీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫంక్షనాలిటీలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: MG హెక్టర్‌తో పోలిస్తే టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ ఎంత మెరుగ్గా ఉందో ఇక్కడ చూడండి

అందిస్తున్న పవర్ؚట్రెయిన్ؚలు

హెక్టార్ మరియు హెక్టార్ ప్లస్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తాయి, ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (143PS/250Nm) మరియు 2-లీటర్ డీజిల్ యూనిట్ (170PS/350Nm) ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లు రెండూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో అందిస్తున్నారు, అయితే మొదటిడి ఐచ్ఛిక CVT ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ؚతో కూడా వస్తుంది.

దీనిని కూడా చూడండి: కొత్త-జనరేషన్ డస్టర్‌ను నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న రేనాల్ట్

ప్రస్తుత ధర పరిధి పోటీదారులు

అక్టోబర్ 2023లో మిగిలిన రోజులు MG హెక్టార్ ధరల పరిధి రూ.14.73 లక్షల నుండి రూ.21.73 లక్షల వరకు ఉంటుంది, MG హెక్టార్ ప్లస్ ధర రూ. 17.50 లక్షల నుండి రూ.22.43 లక్షల మధ్య ఉంటుంది. మహీంద్రా SUV700 5-సీటర్ వేరియెంట్ అయిన టాటా హ్యారియర్ మరియు కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా టాప్ వేరియెంట్ؚలతో హెక్టార్ పోటీ పడుతుంది, హెక్టార్ ప్లస్, టాటా సఫారీ, మహీంద్ర XUV700 7-సీటర్ వేరియెంట్ؚలు మరియు హ్యుందాయ్ ఆల్కజార్ؚతో పోటీ పడుతుంది.

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి: MG హెక్టార్ ఆన్ؚరోడ్ ధర

Share via

Write your Comment on M g హెక్టర్

explore similar కార్లు

ఎంజి హెక్టర్

Rs.14 - 22.89 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్13.79 kmpl
డీజిల్13.79 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర