• English
    • Login / Register

    మసెరాటి భారతదేశం లో 2 వ డీలర్ ను తెరుస్తుంది; మూడో దానికోసం ప్రణాళికా వేస్తుంది

    నవంబర్ 24, 2015 02:11 pm sumit ద్వారా ప్రచురించబడింది

    • 15 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: 

    మసెరాటీ  జూబ్లియంట్ ఆటో వర్కర్స్ ప్రెవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో  దక్షిణ భారతదేశం లో బెంగళూరులోని  దాని మొదటి డీలర్షిప్ ప్రారంభించబోతున్నారు. ఒక డీలర్షిప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఢిల్లీ లో ప్రారంభమయ్యింది, దాని తరువాత భారతదేశం లో ఇది రెండవది. దక్షిణ నగరం వద్ద ప్రారంభించబడిన ఈ మార్కెట్ చెన్నై మరియు హైదరాబాద్ వంటి నగరాలలో కొనుగోలుదారులను చేరుకొనే అవకాశం ఉంది.

    కొత్తగా ప్రారంభించబడిన షోరూమ్ భారతదేశంలో గ్రాన్ టురిస్మో స్పోర్ట్స్ కూపే మరియు గ్రాన్ కాబ్రియో, గిభిలీ డీజిల్ సెడాన్, క్వాట్రో పోర్టే డీజిల్ మరియు GTS సెడాన్ వంటి అన్ని మసెరటి కార్లు అమ్మకం చేస్తుంది. MG రోడ్డు పైన ఉన్న ఈ కొత్త డీలర్‌షిప్ ఆరు వాహనాలు పట్టేటటువంటి ఫ్లోర్ స్పేస్ ని కలిగి ఉంది. అంతేకాకుండా,  సందర్శకుల లాంజీ, మెర్కండైజింగ్ విభాగం మరియు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు కాంఫిగరైజ్ చేసుకోవడానికి కాంఫిగరేటర్ ఏరియా వంటివి కలిగి ఉంది.  

    ఈ సందర్భంగా తన ఆనందం వ్యక్తం చేస్తూ భారతదేశం కార్యకలాపాల అధిపతి బోజన్ జాన్ కులోవస్కీ మాత్లాడుతూ " మసెరాటీ వాహనం 100 సంవత్సరాల పారంపర్య విశిష్టతలో భాగంగా ప్రత్యేకంగా మరియు నవీకరణలతో ఉన్న మసెరాటీ వాహనాన్ని తీసుకురావడం జరిగింది. బెంగుళూరు మార్కెట్  లగ్జరీ కార్లకు ఎక్కువ ప్రాముఖ్యత పొందిది. అందువలన మసెరాటి వారు ఆ మార్కెట్ కి అనుగుణమైన అన్ని సౌకర్యాలతోటి ఈ కారు శ్రేణి ని ప్రవేశపెట్టారు." అని వివరించారు.  

    మసెరాటి భారతదేశంలో  ముంబై లో ఈ నెలాఖరుకల్లా వారి మూడవ డీలర్షిప్ ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తుంది.

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience