భారతదేశం లో మొదలవుతున్న వైఆర్ఎ అనగా బాలెనో ఉత్పత్తి

మారుతి వైఆరే కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 10, 2015 01:37 pm ప్రచురించబడింది

పండుగ సీజన్లో ఈ వాహనం ప్రారంభం అవుతుందనే అంచనా ప్రకారం ,మారుతి భారతదేశంలో వారి మనేసర్ ప్లాంటు లో వైఆర్ఎ అనగా బాలెనో ఉత్పత్తి మొదలుపెట్టింది. తయారీసంస్థ రాబోయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఈ హాచ్బాక్ ను ప్రదర్శించనున్నది. నివేదికలు ప్రకారం, ఆరంభ ఉత్పత్తి యూరోపియన్ మార్కెట్ కోసం జరిగిందని త్వరలో భారతదేశం కోసం ఉత్పత్తిని ప్రారంభిస్తారని తెలిసింది. 

ఈ కారు పెట్రోల్ వేరియంట్స్ కొరకు కొత్త 1 లీటర్ బూస్టర్ జెట్(టర్బో-పెట్రోల్) లేదా పెట్రోల్ వేరియంట్లలో 1.2 కె-సిరీస్ ఇంజిన్ మరియు ఒక కొత్త 1.5 లీటర్ డీజిల్ లేదా ఎస్ హెచ్విఎస్ తో 90bhp మరియు 200Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3 లీటర్ డిడిఐఎస్ ఇంజిన్ తో అమర్చబడి ఉండవచ్చు. ఈ డిడిఐఎస్ ఇంజిన్ ప్రస్తుతం సియాజ్ డీజిల్ వేరియంట్లలో ఉంది. కారు అంతర్జాతీయ వెర్షన్ 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, కానీ వాహన తయారీదారుడు కారు యొక్క బంపర్స్ లో సబ్ 4 మీటర్ హాచ్బాక్ లా కనిపించే విధంగా ట్వీక్స్ అందించాలని భావిస్తున్నారు. మారుతీ సంస్థ వైఆర్ఎ ని ప్రస్తుతం ఎస్ క్రాస్ ని విక్రయిస్తున్న మారుతి ప్రీమియం లైన్ నెక్సా షోరూం నుండి విక్రయించవచ్చు. ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్, ఎలైట్ ఐ 20, ఫోక్స్వ్యాగన్ పోలో మరియు భారతదేశం లో హోండా జాజ్ వంటి వాటితో పోటీగా ఉంటుంది. 

ఈ చిత్రాలు ఉత్పత్తి లైన్ కార్మికులు హాచ్బాక్ మొదటి యూనిట్ సంబరాలకు ప్రదర్శనగా ఉంది. ఈ కారు భారతదేశంలో వైఆర్ఎ గానే పిలబడ్తున్నది. దీనిబట్టి ఇప్పటికీ బాలెనో పేరు భారతదేశం వినియోగదారులకు అంతగా ఖ్యాతి చెందినట్టుగా కనిపించడం లేదు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience