మారుతి భారతదేశంలో బలమైన హైబ్రిడ్లు మరియు EV ల లాగా స్విఫ్ట్ హైబ్రిడ్ ని ప్రారంభించనుంది
published on ఫిబ్రవరి 07, 2020 12:43 pm by saransh
- 26 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కార్ల తయారీసంస్థ ఇప్పటికే తన ‘మిషన్ గ్రీన్ మిలియన్’లో భాగంగా దేశంలో మైల్డ్-హైబ్రిడ్ మరియు CNG కార్లను అందిస్తోంది.
ఫ్యూటురో-e కాన్సెప్ట్ ని unveiling ఆవిష్కరించినప్పుడు, మారుతి భారతదేశం కోసం తన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. కార్ల తయారీసంస్థ దేశంలో బలమైన హైబ్రిడ్లు మరియు EV లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. మారుతి ఇప్పటికే తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మైల్డ్-హైబ్రిడ్ మరియు CNG వాహనాలను కలిగి ఉంది.
బలమైన హైబ్రిడ్ల గురించి మాట్లాడుకుంటే, మారుతి ఆటో ఎక్స్‌పో 2020 లో స్విఫ్ట్ హైబ్రిడ్‌ను ప్రదర్శించింది. స్విఫ్ట్ హైబ్రిడ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారు (MGU: మోటారు జనరేటర్ యూనిట్) కలయికతో 5-స్పీడ్ AMT తో పాడిల్ షిఫ్టర్లతో జతచేయబడుతుంది.
స్విఫ్ట్ హైబ్రిడ్‌లో ఉపయోగించే 1.2-లీటర్ (K 12 C) పెట్రోల్ ఇంజన్ 91Ps / 118Nm ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో, స్విఫ్ట్ పెట్రోల్ కు K12B ఇంజిన్ లభిస్తుంది, ఇది 1197CC యూనిట్, ఇది 83Ps / 113Nm ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుకోవాలి,ఎందుకంటే ఈ ఇన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ స్విఫ్ట్ 32 కిలోమీటర్ల (జపనీస్-సైకిల్) ఫ్యుయల్ ఎకానమీ ను కలిగి ఉంది, ఇది ప్రామాణిక స్విఫ్ట్ పెట్రోల్ యొక్క 21.21 కిలోమీటర్ల కంటే 10 కిలోమీటర్లు ఎక్కువ. ఇది డీజిల్ స్విఫ్ట్ కంటే 4 కిలోమీటర్ల ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది, ఇది BS6 యుగంలో అందుబాటులో ఉండదు.
మారుతి ఇప్పటికే పైన పేర్కొన్న K12C పెట్రోల్ ఇంజిన్ ను 90Ps / 113Nm తయారుచేసే బాలెనోలో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థతో అందిస్తుంది. మేము రెండింటినీ పోల్చి చూస్తే స్విఫ్ట్ హైబ్రిడ్, బాలెనో కంటే 1Ps / 5Nm ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, ఇది అధిక ఫ్యుయల్ ఎకానమీ ని కలిగి ఉంది. బాలెనో హైబ్రిడ్ ఫ్యుయల్ ఎకానమీ23.87 కిలోమీటర్లు, ఇది స్విఫ్ట్ హైబ్రిడ్ కంటే 8.13 కిలోమీటర్లు తక్కువ.
మారుతి కి భారతదేశంలో స్విఫ్ట్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవు, అయితే ఇది దాని భవిష్యత్ ప్రణాళికలో భాగంగా మనకి ఒక అంచనా ఇస్తుంది. మారుతి 2021 నాటికి భారతదేశంలో బలమైన హైబ్రిడ్‌ను ప్రారంభించటానికి ప్రయత్నిస్తుంది, గుజరాత్ లో బ్యాటరీ ఉత్పత్తి సౌకర్యం వచ్చే ఏడాది ప్రారంభమైన తర్వాత. బలమైన హైబ్రిడ్ల చేరిక మారుతి తన పోర్ట్‌ఫోలియో నుండి డీజిల్ ఇంజన్లు తొలగించడం వల్ల ఏర్పడిన గ్యాప్ ని పూరించడానికి సహాయపడుతుంది అని చెప్పవచ్చు.
EV ల విషయానికొస్తే, మారుతి తన మొదటి EV ప్రారంభ తేదీని ఇంకా ధృవీకరించలేదు. ఇది మహీంద్రా e-KUV100 వంటి ఎంట్రీ లెవల్ సబ్ -4m EV గా ఉంటుందని మరియు టాటా నెక్సాన్ EV కంటే కొంచెం పెద్దగా ఉంటుందని భావిస్తున్నాము. కార్ల తయారీసంస్థ ప్రస్తుతం దేశంలో వాగన్ఆర్ ఆధారంగా ఉన్న ఒక ప్రోటోటైప్ EV ని టెస్ట్ చేస్తుంది. మారుతి యొక్క మొట్టమొదటి EV కనీసం 200 కిలోమీటర్ల రేంజ్ ని అందించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఆటో ఎక్స్‌పో 2020 లో మహీంద్రా e-KUV 100 లాంచ్ అయ్యింది
- Health Insurance Policy - Buy Online & Save Big! - (InsuranceDekho.com)
- Two Wheeler Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful