మారుతి స్విఫ్ట్ 2018: కొత్తది Vs పాతది - ప్రధాన వ్యత్యాసాలు
మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం khan mohd. ద్వారా మార్చి 28, 2019 05:48 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ ని రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించింది. ఇక్కడ పూర్తి వివరాలను చదవి తెలుసుకోండి. ప్రారంభించబడిన రెండు రోజులు లోపే ఈ హ్యాచ్బ్యాక్ బుకింగ్లు ఇప్పటికే 40,000 మార్కులను అధిగమించాయి.2018 మారుతి సుజుకి స్విఫ్ట్, అవుట్గోయింగ్ మోడల్ తో పోల్చితే, ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది, విశాలమైనది మరియు ధనికంగా కనిపిస్తుంది. అవుట్గోయింగ్ మోడల్ తో పోలిస్తే ఏమి మార్చబడిందో చూద్దాం.
ధరలు
పెట్రోల్ (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ)
పాత స్విఫ్ట్ |
కొత్త స్విఫ్ట్ (మాన్యువల్) |
రూ. 4.80 లక్షలు LXI (ఆప్షనల్) |
రూ. 4.99 లక్షలు LXI (+ 19K) |
రూ. 5.73 లక్షలు VXI (ఆప్షనల్) |
రూ. 5.87 లక్షలు VXI (+ 14K) |
రూ. 6.37 లక్షలు ZXI |
రూ. 6.49 లక్షలు ZXI (+ 12K) |
రూ. 7.29 లక్షలు ZXI + (క్రొత్తది) |
పెట్రోల్ AMT (కొత్త స్విఫ్ట్ లో అందుబాటులో ఉంది)
. VXI AGS: రూ. 6.34 లక్షలు (VXI MT పై + 47K)
. ZXI AGS: రూ. 6.96 లక్షలు (VXI MT పై + 47K)
డీజిల్ (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ)
పాత స్విఫ్ట్ |
కొత్త స్విఫ్ట్ (మాన్యువల్) |
రూ. 6.20 లక్షలు LDI (ఆప్షనల్) |
రూ. 5.99 లక్షలు LDI (-21K) |
రూ. 6.60 లక్షలు VDI (ఆప్షనల్) |
రూ. 6.87 లక్షలు VDI (+27K) |
రూ. 7.47 లక్షలు ZDI |
రూ. 7.49 లక్షలు ZDI (+2K) |
రూ. 8.29 లక్షలు ZDI+ (కొత్తది) |
డీజిల్ AMT (కొత్త స్విఫ్ట్ లో అందుబాటులో ఉంది)
. VDI AGS: రూ 7.34 లక్షలు (VDI MT పై + 47K)
. ZDI AGS: రూ. 7.96 లక్షలు (ZDI MT కి పైగా + 47K)
డిజైన్
ఈ కొత్త స్విఫ్ట్ 10 సంవత్సరాల నుండి ఉన్న పాత స్విఫ్ట్ యొక్క స్పోర్టీ లుక్ ని మరింత ఎత్తుకి తీసుకెళ్ళింది. దీని ముఖ భాగం బాగా పరిణతి చెందినట్టుగా కనిపిస్తుంది.ముందుగా, మొదలుపెట్టాలంటే దాని యొక్క హెడ్‌ల్యాంప్స్ తో మొదలు పెట్టవచ్చు,పాత దానిలో మల్టీ రెఫ్లెక్టర్ యూనిట్స్ కి బదులుగా ఇది ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు LED డే టైం రన్నింగ్ లైట్స్ కలిగి ఉండే సరికొత్తగా డిజైన్ చేయబడిన హెడ్ల్యాంప్ యూనిట్ కలిగి ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ పాత స్విఫ్ట్ లో కొంచెం ఎడమగా ఉండేవి, కానీ ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ లో అవి హెడ్‌ల్యాంప్ యూనిట్ గ్రిల్ కి దగ్గరగా పుష్ చేయడం జరిగింది. ఫాగ్ ల్యాంప్ అనేది ఆలానే గుండ్రంగా ఉంటూ క్రోం గార్నిష్ లేదు. కొత్త స్విఫ్ట్ కి పాత స్విఫ్ట్ లో లా గా హనీ కోంబ్ మెష్ ఉండదు, అది వర్టికల్ స్లాట్స్ తో పెద్ద హెక్సాగొనల్ గ్రిల్ తో మార్చబడింది.
ప్రక్క భాగం వైపు, వెనకాతల డోర్ యొక్క హ్యాండిల్ C- పిల్లర్ వైపు అమర్చబడింది (చేవ్రొలెట్ బీట్ లాంటిది). అంతేకాక, ఇది కొత్త ఖచ్చితమైన కట్ డ్యుయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ని పొందుతుంది.
స్విఫ్ట్ యొక్క వెనకాతల భాగానికి వస్తే బాగా కట్ చేయబడినట్టుగా ఉంటుంది. ఇది పునఃరూపకల్పన చేసిన టెయిల్ ల్యాంప్ యూనిట్ లో LED లను కలిగి ఉంటుంది, విస్తృత బూట్ స్పేస్ ని మరియు కొత్త బంపర్ ను కూడా కలిగి ఉంటుంది.
కొలతలు
కొలతలు |
పాత మారుతి స్విఫ్ట్ |
మారుతి స్విఫ్ట్ 2018 |
తేడా |
పొడవు |
3850mm |
3840mm |
-10mm |
వెడల్పు |
1695mm |
1735mm |
+ 40mm |
ఎత్తు |
1530mm |
1530mm |
మారలేదు |
వీల్బేస్ |
2430mm |
2450mm |
+ 20mm |
గ్రౌండ్ క్లియరెన్స్ |
170mm |
163mm |
-7mm |
బూట్ స్పేస్ |
210 లీటర్లు |
268 లీటర్లు |
+58 లీటర్లు |
కొత్త స్విఫ్ట్ 40mm వెడల్పు మరియు ఒక 20mm ఎక్కువ వీల్ బేస్ కలిగి ఉంది, దీనివలన క్యాబిన్ లోపల విశాలంగా ఉంది. డిజైర్ వలే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 7mm తగ్గించబడినా, ఇది కారు క్రింద బాగానికి ఏదైనా తగులుతుందేమో అని అంత ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. బూట్ స్పేస్ కొద్దిగా 268 లీటర్ల వరకు పెంచబడింది మరియు లోడింగ్ లిప్ కూడా క్రిందనే ఉండడం వలన లగేజ్ ని సులభంగా పెట్టుకోవచ్చు.
కొత్త స్విఫ్ట్ మిడ్నైట్ బ్లూ, సాలిడ్ ఫైర్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్ మరియు మాగ్మా గ్రే, మరియు కొత్త ప్రైం లూసెంట్ ఆరంజ్ షేడ్ అనే ఆరు రంగులలో అందించబడుతుంది.
లోపల భాగాలు :
ముందు చెప్పినట్లుగా, కొత్త స్విఫ్ట్ యొక్క పెరిగిన కొలతలు కారణంగా విశాలమైన క్యాబిన్ అందించబడింది. మారుతి సంస్థ ముందు వెర్షన్ లో ఉన్న వెనకాతల లెగ్‌రూం యొక్క సమస్యను ఇందులో కుదిర్చినట్టు చెప్తుంది, అదే విధంగా ఈ కొత్త స్విఫ్ట్ లో వెనుక ప్యాసింజర్స్ కు షోల్డర్ రూం మరియు నీ రూం కూడా పెంచినట్టు చెప్తుంది. కొత్త డ్యూయల్-టోన్ డాష్బోర్డ్ లేఅవుట్ క్యాబిన్ యొక్క ప్రీమియం లుక్ ని పెంచినట్టు కనిపిస్తుంది. సెంటర్ లో ఎయిర్ కాన్ వెంట్స్ ఇప్పుడు గుండ్రంగా ఉంటూ మరియు A.C నియంత్రణలు కూడా కొత్త రోటరీ డయల్స్ ని పొందుతాయి. ఈ ప్లేన్ జేన్ ఇన్స్టృమెంటల్ క్లస్టర్ మార్చేసి రేస్ కారు లో ఉన్న విధంగా అమర్చడం జరిగింది. ఆశ్చర్యకరంగా, గ్లోవ్ బాక్స్ మీద ఓపెన్ స్టొరేజ్ స్పేస్ కొత్త స్విఫ్ట్ లో మిస్ అయ్యింది.
లక్షణాలు
డిజైర్ లో లాగా కొత్త స్విఫ్ట్ ఫ్లాట్-బోటం లెథర్ వ్రాపెడ్ స్టీరింగ్ వీల్,ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ సిష్టం వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇది మిర్రర్ లింక్ కనెక్టివిటీ తో పాటూ ఆపిల్ కార్ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో రెండిటికీ సపోర్ట్ చేసే సుజుకి యొక్క 7-ఇంచ్ స్మార్ట్ ఇంఫోటైన్మెంట్ సిష్టం ని పొందుతుంది. ఈ వ్యవస్థ బిల్ట్-ఇన్ నావిగేషన్ ను USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో అందిస్తుంది. కొత్త స్విఫ్ట్ రియర్-వ్యూ కెమెరా కోసం డిస్ప్లే చేసే విధంగా ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ తో వెనుక పార్కింగ్ సెన్సార్లను కూడా పొందుతుంది.
దాని ఇటీవలి కార్లలో ముఖ్యమైన భద్రతా లక్షణాలను ప్రామాణీకరించే మంచి పనిని కొనసాగిస్తూ, మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ యొక్క అన్ని వేరియంట్స్ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, EBD తో ABS మరియు బ్రేక్ అసిస్ట్, ప్రీ టెన్ష్నర్స్ తో ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మరియు ఫోర్స్ లిమిటెర్, ISOFIX యాంకర్రెస్, సీబీ బెల్ట్ రిమైండర్ మరియు ఇంజిన్ ఇమ్మొబలైజర్ వంటి లక్షణాలను అందిస్తుంది.
ఇంజన్స్
2018 స్విఫ్ట్ ముందు దాని నుండి 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ లను కొనసాగిస్తుంది. డీజిల్ ఇంజన్ 75Ps పవర్ ను మరియు 190Nm టార్క్ ను అభివృద్ధి చేస్తుండగా పెట్రోల్ మోటార్ 83Ps పవర్ ను 113Nm టార్క్ ను అందిస్తుంది. దాని మునుపటి మాదిరిగా కాకుండా, కొత్త స్విఫ్ట్ 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ను రెండు ఇంజిన్లు తో పొందింది. అయితే, ప్రారంభంలో ఆటోమేటిక్ V మరియు Z వేరియంట్లలో అందించబడుతుంది. అదే ఇంజన్లలో కొనసాగుతున్న ప్రస్తుత స్విఫ్ట్ తేలికైన నిర్మాణం కలిగి ఉండి పెట్రోలు లో 22 Kmpl మైలేజ్ ని మరియు డీజిల్ లో 28.4Kmpl మైలేజ్ ని అందిస్తుంది.
కొత్త స్విఫ్ట్ కారు డిజైర్ మరియు బలేనో వలే తేలికైన హార్ట్సెక్ వేదికపై ఆధారపడింది. ఇది స్విఫ్ట్ లో గణనీయమైన 85 కిలోల బరువు తగ్గింపు సాధించడానికి సహాయం పడుతుంది. స్విఫ్ట్ ఎల్లప్పుడూ ఒక బాగా పనితీరు చూపించే కారుగానే పిలువబడుతుంది, కానీ ఇప్పుడు తేలికపాటి బరువు ఉండడం వలన మరింత మంచి పనితీరుని అందిస్తుంది.
ఆటో ఎక్స్పో 2018 సమయంలో కొత్త స్విఫ్ట్ లో మరిన్ని నవీకరణలు తెలుసుకోవడం కోసం కార్దేఖో వీక్షిస్తూ ఉండండి.
Recommended: Auto Expo 2018: Maruti Suzuki’s Expected Lineup