48.2కి.మీ/లీ ఇంధన సామర్థ్యం గల స్విఫ్ట్ రేంజ్ ఎక్స్ టెండర్ ని ప్రారంభించనున్న మారుతి సుజుకి

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం sourabh ద్వారా జూన్ 20, 2015 06:47 pm ప్రచురించబడింది

జైపూర్: మారుతి సుజుకి దాని స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ లేదా స్విఫ్ట్ డిజైర్, కాంపాక్ట్ సెడాన్ యొక్క హైబ్రిడ్ వెర్షన్ ప్రారంభించటానికి ఎదురుచూస్తున్నది. మీడియా నివేదికల ప్రకారం, స్విఫ్ట్ రేంజ్ విస్తరిణి, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ఈ సంవత్సరం విడుదల కానున్నది. హాచ్బాక్ భారతదేశం లో ఇంటర్నేషనల్ గ్రీన్ మొబిలిటీ ఎక్స్పో వద్ద ప్రదర్శించారు మరియు ఇటీవల జూన్ 5, 2015 న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు పాల్గొనడం జరిగింది. 

హుడ్ కింద, స్విఫ్ట్ రేంజ్ ఎక్స్టెండర్ , 658సిసి పెట్రోల్ ఇంజన్ శక్తితో ఒక విద్యుత్ మోటార్ కి జత చేయబడి ఉంటుంది. ఇది 5కిలో వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ శక్తితో పనిచేస్తుంది. ఇంజిన్ మరియు విద్యుత్ మోటారు కలిసి 73 పి ఎస్ శక్తి ని 48.2కె ఎంపిఎల్ ఇంధన సామర్ధ్యంతో అందిస్తుంది. ఈ హాచ్ యొక్క లక్ట్రిక్ పరిధి 25.5కె ఎం ఎస్ గా నమోదు అయ్యింది. అలానే దీని బ్యాటరీ చార్గింగ్ అయ్యేందుకుగానూ 200 వోల్ట్ విద్యుత్శక్తి అవసరం అవుతుంది మరియు దీని పూర్తి చార్గింగ్ కొరకు 90 నిముషాల సమయం పడుతుంది. 

గత కొన్ని సంవత్సరాల నుండి ఇది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఇది మూడు వ్యవస్థల - హైబ్రిడ్ లచే నడపబడుతుంది. అవి సిరీస్ హైబ్రిడ్, సమాంతర హైబ్రిడ్, మరియు ఎలక్ట్రిక్ హైబ్రిడ్. సిరీస్ హైబ్రిడ్ లో విద్యుత్ మోటారును చార్జ్ చేయడానికి ఇంజిన్ ను ఉపయోగిస్తారు. సమాంతర మోడల్ లో రెండు చక్రాలను మలుపు తిప్పడానికి ఇంజిన్ మరియు విద్యుత్ మోటారు ను ఉపయోగిస్తారు. మరియు ఎలక్ట్రిక్ లో విద్యుత్ శక్తి మాత్రమే ఉపయోగిస్తారు.

"ప్రభుత్వం ఫేమ్ పథకం ప్రారంభించింది, ఈ పథకం క్రింద హైబ్రిడ్ మరియు ఇ-వాహనాలు కొనుగోలు ఖర్చు ఫీజులతో సహా ఇది అందిస్తుంది. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ వేరియంట్స్ ఉన్న వాహనాలను ప్రారంభించమని మేము ఆటో మొబైల్ దిగ్గజాలను అడిగాము, తద్వారా వినియోగదారులు మరిన్ని ఎంపికలు పొందడానికి వీలుగా ఉంటుందని భావించాము. ఈ పథకం మార్కెట్ లో అందుబాటులో ఉండే ఒకటి లేదా రెండు కార్లతో ఒంటరిగా విజయం సాధించడం కుదరదు. కాబట్టీ మహీంద్రా, మారుతి, టాటా సహా కంపెనీలు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రానిక్ వాహనాలు ఈ సంవత్సరం వారి వాహనాలు కొన్ని ప్రారంభిస్తామని మాకు హామీ చేశారు. " అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి స్విఫ్ట్ 2014-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience