సియాజ్ ఎస్ హెచ్ విసి (స్మార్ట్ హైబ్రిడ్ వెహికెల్) ని రూ. 8.23 లక్షల ధర వద్ద ప్రారంభించనున్న మారుతీ సుజికీ
మారుతి సుజికీ సియాజ్ మిడ్ సైజ్ సెడాన్ యొక్క మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ని రూ. 8.23 లక్షల ప్రారంభ ధర వద్ద ప్రారంభించారు. ఎస్ హెచ్ విసి (స్మార్ట్ హైబ్రిడ్ వెహికెల్) గా నామకరణం చేయబడి సరికొత్త రూపంతో సియాజ్ దేశంలో 28.09 Kmpl అసాధారణ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.
డిల్లీ: ఈ కొత్త సియాజ్ ఎస్ హెచ్ విసి అతి ఖరీదైన టయోటా ప్రియాస్ మరియు క్యామ్రీ వంటి సరైన హైబ్రిడ్ కాదు. నిజానికి, దీనిలో ఒక ప్రాధమిక లక్షణం అయిన మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఇప్పటికే మహీంద్రా స్కార్పియోలో చూసాము. సాధారణంగా, మారుతి సుజుకి సంస్థ సియాజ్ లో స్టార్ట్ - స్టాప్ మెకానిజం ని వ్యవస్థాపించింది. ఈ మెకానిజం ఇంజిన్ ఆగిపోయినపుడు ఇంధన వినియోగం కూడా ఆగిపో యేలా చేస్తుంది.
స్టార్ట్ - స్టాప్ తో పాటుగా ఈ సెడాన్ డిసలరేషన్ ఎనర్జీ రీజెనరేషన్ ఫంక్షన్ ని కూడా కలిగి ఉంది. ఈ టెక్నాలజీ వాహనం డిసలరేషన్ జరిగినపుడు శక్తి వ్యర్ధం కాకుండా దానిని విద్యుత్ వ్యవస్థకి తిరిగి పంపించి వాహనం యొక్క యాంత్రిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. అయితే, ఈ టెక్నాలజీ కారు డిసలరేషన్ అయినపుడు మాత్రమే పనిచేస్తుంది. కానీ 30 Kmph కి పైగా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది.
ఈ సియాజ్ ఎస్ హెచ్ విసి ఫియాట్ నుంచి హైబ్రిడ్ ప్రతిరూపం కాని అదే 1.3 లీటర్ ఎంజెడి యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. ఇది 4000rpm వద్ద 89bhp శక్తిని మరియు 1750rpm వద్ద 200Nm టార్క్ ని అందిస్తుంది.
ధరలు :