మారుతి S-ప్రెస్సో vs రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-AMT: రియల్-వరల్డ్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్ పోలిక
ఈ రెండు పెట్రోల్-AMT SUV లాంటి కార్లలో ఏది వాస్తవ ప్రపంచంలో మెరుగ్గా పనిచేస్తుంది?
మారుతి ఇటీవల S-ప్రెస్సోను ప్రారంభించింది మరియు ఈ విభాగంలో దాని అతిపెద్ద ప్రత్యర్థి రెనాల్ట్ క్విడ్. విషయాలు తాజాగా ఉంచడానికి, రెనాల్ట్ క్విడ్ కు ఫేస్ లిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈ రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లు వాస్తవ ప్రపంచంలో SUV లుగా ఎలా పనిచేస్తాయి? మేము కనుగొన్నాము.
మా పరీక్షా విధానంలో మేము కనుగొన్న ఫలితాల్లోకి ప్రవేశించడానికి ముందు, మేము పరీక్షించిన రెండు కార్ల ఇంజిన్ స్పెక్స్‌ను పరిశీలిద్దాం.
మారుతి S-ప్రెస్సో |
రెనాల్ట్ క్విడ్ |
|
డిస్ప్లేస్మెంట్ |
1.0-లీటర్ |
1.0-లీటర్ |
పవర్ |
68PS |
68PS |
టార్క్ |
90Nm |
91Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ AMT |
5-స్పీడ్ AMT |
క్లెయిమ్ చేసిన FE |
21.7kmpl |
22.50kmpl |
ఎమిషన్ టైప్ |
BS6 |
BS4 |
ఎస్-ప్రెస్సో మరియు క్విడ్ యొక్క ఇంజిన్ స్పెక్స్‌ను పరిశీలిస్తే, ఈ రెండు కార్లు సంఖ్యల విషయానికి వస్తే ఒక స్థాయిలో ఉన్నాయని స్పష్టమవుతుంది. కానీ ఈ సంఖ్యలు రోజువారీ డ్రైవిబిలిటీకి ఎంత బాగా అనువదిస్తాయి?
పనితీరు పోలిక
ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్ పరీక్షలు:
0-100kmph |
20-80kmph (కిక్‌డౌన్) |
|
మారుతి ఎస్-ప్రెస్సో |
15.10 సెకెన్స్ |
9.55 సెకెన్స్ |
రెనాల్ట్ క్విడ్ |
19.05 సెకెన్స్ |
10.29 సెకెన్స్ |
0 నుండి 100 కిలోమీటర్ల వేగం గురించి మాట్లడుకుంటే, ఎస్-ప్రెస్సో క్విడ్ కంటే ముందంజలో ఉంది. ఇది దాదాపు 4 సెకన్ల వేగంతో ట్రిపుల్ అంకెల మార్కును చేరుకుంటుంది. రోల్-ఆన్ ఆక్సిలరేషన్ గురించి మాట్లాడేటప్పుడు, ఆ గ్యాప్ కొంచెం తక్కువగా ఉంది. 20-80కి.మీ వేగం లో గనుక వాటి ఆక్సిలేరషన్ పరిసీలిస్తే వాటి వ్యత్యాసం సెకను కన్నా తక్కువ, మరియు రోజువారీ డ్రైవింగ్‌లో ఇది అనుభవించబడదు.
ఇది కూడా చదవండి: రెనాల్ట్ క్విడ్ వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?
బ్రేకింగ్ డిస్టన్స్
100-0kmph |
80-0kmph |
|
మారుతి ఎస్-ప్రెస్సో |
46.85m |
27.13m |
రెనాల్ట్ క్విడ్ |
42.75m |
26.66m |
క్విడ్ 100 కిలోమీటర్ల లేదా 80 కిలోమీటర్ల నుండి స్టాప్‌లోకి రావడానికి చాలా వేగంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో స్టాప్‌లోకి రావడంలో ఉన్న వ్యత్యాసం, క్విడ్ యొక్క బ్రేక్‌లు ఎస్-ప్రెస్సో కంటే మెరుగ్గా ఉన్నాయని సూచించడానికి సరిపోతుంది. అయితే 80 కిలోమీటర్ల వేగంతో స్టాప్‌లోకి వస్తే, రెండింటి మధ్య తేడా అతి తక్కువగా పరిగణించబడుతుంది.
ఫ్యుయల్ ఎఫిషియన్సీ పోలిక
క్లెయిం చేసినది (ARAI) |
హైవే (పరీక్షించినది) |
సిటీ (పరీక్షించినది) |
|
మారుతి ఎస్-ప్రెస్సో |
21.7kmpl |
21.73kmpl |
19.96kmpl |
రెనాల్ట్ క్విడ్ |
22.50kmpl |
21.15kmpl |
17.09kmpl |
ఎస్-ప్రెస్సో కోసం మారుతి క్లెయిం చేసినదానితో పోలిస్తే, క్విడ్ కోసం రెనాల్ట్ కొంచెం ఎక్కువ ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని పేర్కొంది. అయితే, వాస్తవ ప్రపంచంలో, రెనాల్ట్ క్విడ్ కంటే ఎస్-ప్రెస్సో ఫ్యుయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. హైవే మీద రెండింటి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ, కానీ సిటీ లో, దాదాపు 3 కిలోమీటర్ల తేడా ఉంది.
మీ వినియోగాన్ని బట్టి రెండింటిలో రెండింటి నుండి మీరు ఆశించే ఫ్యుయల్ ఎఫిషియన్సీ గుర్తించడానికి క్రింది పట్టికను చూడండి.
హైవే లో 50%, 50% సిటీ లో |
25% హైవే లో, 75% సిటీ లో |
75% హైవే లో, 25% సిటీ లో |
|
మారుతి ఎస్-ప్రెస్సో |
20.81kmpl |
20.37kmpl |
21.26kmpl |
రెనాల్ట్ క్విడ్ |
18.9kmpl |
17.95kmpl |
19.96kmpl |
ఇది కూడా చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?
తీర్పు
స్ట్రైట్ గా వెళితే గనుక, ఎస్-ప్రెస్సో క్విడ్ ని ఓడిస్తుంది. అయితే, ఆ వేగం నుండి ఆగిపోయేటప్పుడు, క్విడ్ బాగుంటుంది. ఫ్యుయల్ ఎఫిషియన్సీ పోలికలో, క్విడ్ మరోసారి రెండవ స్థానంలో ఉంది.
మొత్తంమీద, మీ రోజువారీ వాడకంలో ఎక్కువ సిటీ డ్రైవింగ్ ఉంటే మీరు త్వరగా తీయవలసి వస్తే ఎస్-ప్రెస్సో కొనాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. అయినప్పటికీ, మీరు హైవే పై ఎక్కువ డ్రైవ్ చేస్తే, క్విడ్ యొక్క ఫ్యుయల్ ఎఫిషియన్సీ ఎస్-ప్రెస్సోతో సమానంగా ఉన్నందున మేము సిఫార్సు చేస్తున్నాము మరియు ఇది మారుతి హ్యాచ్‌బ్యాక్ కంటే చాలా వేగంగా ఆగిపోతుంది.
మరింత చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో ఆన్ రోడ్ ప్రైజ్