స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్ ని రూ. 5.28 లక్షలు వద్ద ప్రారంభించిన మారుతి సంస్థ
మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం manish ద్వారా అక్టోబర్ 08, 2015 05:34 pm సవరించబడింది
- 13 Views
- 15 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
పండుగ సీజన్లలో కొత్త కార్లు మరియు ప్రత్యేఖ ఎడిషన్లు ప్రారంభమవుతున్నాయంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మారుతి చివరిగా లిమిటెడ్ గ్లోరీ ఎడిషన్ స్విఫ్ట్ ప్రారంభంతో క్లబ్ లో చేరింది. యాంత్రికంగా, 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంది.
ఎప్పుడైతే ప్రారంభించబడినదో, స్వివ్ట్ వాహనం మినీ కూపర్ తో పోల్చబడినది మరియు ఇప్పుడు రాబోయే స్వివ్ట్ గ్లోరీ ఎడిషన్ రేసింగ్ చారలతో ఎరుపు మరియు తెలుపు రంగు పథకంతో మినీ కూపర్ కి దగ్గరగా అనిపిస్తుంది. ప్రత్యేక ఎడిషన్ రేర్ స్పాయిలర్ అదనంగా కలిగి ఉంది. దీనిలో సి-పిల్లర్స్ నలుపు రంగులో రూపొందించబడి డిజైన్ ని రెట్టింపు చేస్తుంది. ఇంకా ఎరుపు రంగు రూఫ్, ఎరుపు డికేల్స్, సైడ్ స్కర్ట్స్ మరియు వింగ్ మిర్రర్స్ ని కలిగి ఉంది. కారు ఒక "ఫర్ ద ప్లేయర్స్", " ఫర్ హు కీప్ ద బాల్ రోలింగ్" అను ట్యాగ్ లైన్ ని కూడా కలిగి ఉంది.
కారు యొక్క అంతర్భాగాలు బ్లూటూత్ కనెక్టివిటీతో సంగీత వ్యవస్థ, వెనుక వ్యూ కెమెరా తో పాటూ రివర్స్ పార్కింగ్, డ్యూయల్ టోన్ ఎరుపు & నలుపు సీటు అపోలిస్ట్రీ, స్టీరింగ్ వీల్ & గేర్ కవర్ మరియు కొత్త ఫ్లోర్ మ్యాట్స్ వంటి లక్షణాలని కలిగి ఉన్నాయి. గ్లోరీ ఎడిషన్ విడిఐ మరియు విఎక్స్ఐ వేరియంట్లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. విడిఐ గ్లోరీ ఎడిషన్ బ్రేక్ అసిస్ట్ మరియు ఇబిడి తో ఎబిఎస్ ని కూడా కలిగి ఉంది. స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్ అలాయ్ చక్రాలను లేదా ఎయిర్బ్యాగ్స్ ని కలిగి లేదని నిర్ధారించబడినది.
మారుతి సుజుకి స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్ వివరాలు:
. వేరియంట్స్: విఎక్స్ఐ; విడిఐ
. ధర: రూ. 5.28 lakshalu (విఎక్స్ఐ); రూ. 6.19 లక్షలు ( విడిఐ )
. ఇంజిన్: 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్; 1.3 లీటర్ malTeejeT డీజిల్
. శక్తి: 83.11bhp@6000rpm (విఎక్స్ఐ); 73.94bhp@4000rpm (విఎక్స్ఐ)
. టార్క్: 115Nm @ 4000rpm (విఎక్స్ఐ); 190Nm @ 2000rpm (విఎక్స్ఐ)
. మైలేజ్: 20.4kmpl (పెట్రోల్); 25.2kmpl (డీజిల్)