తమ అరెనా మోడల్‌ల కొత్త బ్లాక్ ఎడిషన్‌లను పరిచయం చేసిన మారుతి
మారుతి ఆల్టో కె కోసం shreyash ద్వారా మార్ చి 21, 2023 05:46 pm ప్రచురించబడింది
- 49 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆల్టో 800 మరియు ఈకోలను మినహాయించి, మిగిలిన అరెనా కార్‌ల ధరలో ఎటువంటి మార్పు లేకుండా బ్లాక్ ఎడిషన్‌లో అందిస్తున్నారు.
-
అరెనా కార్‌లు ఇప్పుడు నెక్సా లైనప్ విధంగానే, ప్రత్యకమైన పర్ల్ మిడ్ؚనైట్ బ్లాక్ ఎక్స్ؚటీరియర్ రంగులో అందుబాటులో వచ్చాయి.
-
రంగును మినహాయించి, లుక్ లేదా మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు.
-
బ్రెజ్జా ZXi మరియు ZXi+ వేరియెంట్‌లు ఈ ప్రత్యేక నలుపు రంగు ఎంపికలో అందుబాటులో ఉన్నాయి.
-
ఇతర అరెనా కార్‌ల బ్లాక్ ఎడిషన్ వేరియెంట్‌ల గురించి ఈ కారు తయారీదారు ప్రస్తుతానికి పేర్కొనలేదు.
-
మారుతి బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ ధర దాని మోనోటోన్ వేరియెంట్‌లకు సమానంగానే ఉంది.
మారుతి తన నలభైవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా, ఈ ఏడాది ప్రారంభంలో ఐదు నెక్సా మోడల్‌లను బ్లాక్ ఎడిషన్‌లలో పరిచయం చేసింది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రత్యేక మాట్ ఎడిషన్‌లను చూపించినప్పటికి, ఆల్టో 800 మరియు ఈకోను మినహహించి, కంపెనీ ఇప్పుడు ఎంట్రీ-లెవెల్‌లో అరెనా శ్రేణిలో పీల్ మిడ్‌నైట్ బ్లాక్ షేడ్‌ను పరిచయం చేసింది.
ఇది కూడా చదవండి: రూ.9.14 లక్షల ధరతో విడుదలైన మారుతి బ్రెజ్జా CNG
బ్రెజ్జాను మినహాయించి, ఈ కొత్త రంగులో అందుబాటులోకి రానున్న ఇతర అరెనా కార్‌ల నిర్దిష్ట వేరియెంట్‌ల గురించి కంపెనీ పేర్కొనలేదు. ప్రస్తుతానికి, బ్రెజ్జా హై-స్పెక్ ZXi, ZXi+ వేరియెంట్‌లను కొత్త నలుపు రంగులో అందిస్తున్నారు. దీని ఆధారంగా, ఇతర మోడల్‌ల టాప్-వేరియెంట్‌లు కూడా ఈ ప్రత్యేక ఎడిషన్ؚలో అందుబాటులోకి వస్తాయి అని ఆశించవచ్చు. రిఫరెన్స్ కోసం, బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ ధర వివరాలు ఇక్కడ అందించబడింది:
వేరియెంట్ |
ధర |
ZXi |
రూ. 10.95 లక్షలు |
ZXi CNG MT |
రూ. 11.90 లక్షలు |
ZXi+ |
రూ. 12.38 లక్షలు |
ZXi AT |
రూ. 12.45 లక్షలు |
ZXi+ AT |
రూ. 13.88 లక్షలు |
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
లుక్ లేదా మెకానికల్ పరంగా మార్పులు లేవు
నెక్సా కార్‌ల బ్లాక్ ఎడిషన్‌లలో చూసినట్లుగానే, అరెనా మోడల్‌లకు కూడా రంగును మినహాయించి లుక్ మరియు అదనపు ఫీచర్‌ల జోడింపు పరంగా ఎటువంటి మార్పులు లేవు. అంతేకాకుండా, వీటిని మెకానికల్ؚ పరంగా కూడా మార్చలేదు, అదే ఇంజన్ మరియు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో అందిస్తున్నారు.
కానీ, టాటా వాహనాల ప్రత్యేక డార్క్ ఎడిషన్‌ల విషయంలో, ఇవి పూర్తి-నలుపు అలాయ్ వీల్స్ మరియు ఇంటీరియర్‌లు వంటి మరిన్ని మార్పులతో అందుబాటులోకి వచ్చాయి.
ఇది కూడా చూడండి: విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚ వద్ద చేరుకున్న మారుతి జీమ్నీ
ధరలో మార్పు లేదు
బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ ధర, దాని మోనోటోన్ వేరియెంట్‌ల ధరకు సమానంగానే ఉంది, మారుతి ఈ కార్‌లలో మరే ఇతర మార్పులు చేయనందున ఇతర అరెనా కార్‌లు కూడా వాటి సంబంధిత మోనోటోన్ వేరియెంట్‌ల ధరతో సమానంగా ఉంటాయని ఆశించవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: ఆల్టో K10 ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful