Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి ఫ్రాంక్స్ vs టాటా నెక్సాన్: పోల్చదగిన 16 చిత్రాలు

టాటా నెక్సన్ 2020-2023 కోసం ansh ద్వారా జనవరి 20, 2023 05:27 pm ప్రచురించబడింది

డిజైన్ పరంగా కొత్త మారుతి క్రాస్ ఓవర్, టాటా SUVతో ఎలా పోటీ పడుతుంది?

ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి తన లైన్ؚఅప్ؚకు రెండు కొత్త SUVలను జోడించింది: అవి ఐదు-డోర్‌ల జీమ్నీ, ఫ్రాంక్స్. ఫ్రాంక్స్ విషయానికి వస్తే, ఈ వాహనం నాలుగు మీటర్‌ల కంటే కొంత తక్కువగా ఉండే క్రాస్ ఓవర్ SUV, దీని స్టైలింగ్ బాలెనో మరియు గ్రాండ్ విటారా కలయికతో కూపే ఆకారంలో కనిపించే SUVల ఉంటుంది. కూపే-స్టైల్ వంటి వాలుగా ఉండే రూఫ్ కలిగిన మరొక సబ్-ఫోర్-మీటర్ SUV విభాగంలో ప్రముఖమైనది-టాటా నెక్సాన్. తన ముఖ్యమైన ప్రత్యర్ధితో పోలిస్తే ఫ్రాంక్స్ ఎలా కనిపిస్తుందో చూద్దాం.

ముందు భాగం

ఫ్రాంక్స్ ముందు భాగం గ్రాండ్ విటారాను పోలి ఉంటుంది. దీనికి మారుతి లోగో ఉన్న క్రోమ్ పట్టీ గల భారీ గ్రిల్ ఉంది. అంచులలో, బంపర్ దిగువన అమర్చిన పెద్ద హెడ్ ల్యాంపులతో నాజూకైనా DRLలను మీరు చూడవచ్చు. నెక్సాన్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ మధ్యలో చిన్న గ్రిల్ؚ, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు బంపర్ؚలో ఫాగ్ ల్యాంపుల కోసం కప్పివేయబడిన పెద్ద హౌసింగ్ؚతో మరింత సాధారణంగా కనిపిస్తుంది. ఫ్రాంక్స్ؚతో పోలిస్తే దీనికి మరింత ధృఢంగా కనిపించే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ؚను కలిగి ఉంది.

పక్క వైపు

ఈ రెండు వాహనాలను పోలిస్తే, పక్క వైపు నుండి నెక్సాన్, ఫ్రాంక్సీ కంటే 56mm ఎత్తుగా ఉంటుంది. ఫ్రాంక్స్ బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌పై ఆధారపడటమే దీనికి కారణం. రెండిటికీ ప్రత్యేకమైన కూపే స్టైలింగ్ కలిగి ఉంది, కానీ నెక్సాన్ స్పష్టంగా SUVలా కనిపిస్తుంది. ధృడమైన లుక్ కోసం షోల్డర్ లైన్ పొడవునా ప్రముఖంగా కనిపించే క్రీజ్ؚను కలిగి ఉంది, రూఫ్ؚలైన్ؚలో మరింత వంపుగా ఉంది. ఫ్రాంక్స్ విషయానికి వస్తే, పై భాగంలో వెనుక-వైపు స్పాయిలర్ؚతో కలిసిపోయే వంపుతో స్మూత్-ఫ్లోయింగ్ సైడ్ؚను కలిగి ఉంది.

రెండు SUVలు, 16-అంగుళాల అలాయ్ వీల్స్‌తో వస్తాయి. కానీ ఫ్రాంక్స్ మరింత ఏరో డైనమిక్ లుక్ؚను కలిగి ఉంటుంది.

వెనుక భాగం

కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ؚ, కేవలం ఒక అమర్చబడిన భాగంలా కాకుండా మెరిసే పట్టీతో (టాప్ వేరియంట్ؚలో) ఫ్రాంక్స్ వెనుక భాగం చాలా ప్రీమియంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. మరొక వైపు, నెక్సాన్ తెల్లని పట్టీ- టెయిల్ ల్యాంపులను అలాగే టాటా లోగోను జతచేస్తుంది.

నెక్సాన్‌ టెయిల్ ల్యాంప్ؚ లోపలి భాగం “Y” అకారపు ఎలిమెంట్లను కలిగి ఉంటుంది. ఫ్రాంక్స్ؚలో, ముందు భాగంలో ఉన్న LED DRLల విధంగానే, దాని వెనుక భాగంలో రెండు వైపుల మూడు వేరు వేరు LEDలు ఉన్నాయి.

క్యాబిన్

ఫ్రాంక్స్ క్యాబిన్ అదనపు డిజైన్ అంశాలతో నవీకరించిన బాలెనో క్యాబిన్ؚ వర్షన్ؚలా ఉంటుంది. దీని సెంట్రల్ కన్సోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోؚటైన్మెంట్ సిస్టమ్ నుండి గేర్ సెలక్టర్ వరకు బాలెనోను పోలి ఉంటుంది. నెక్సాన్ విషయానికి వస్తే, దాని వక్ర ఆకారపు ఎక్స్ؚటీరియర్‌ల కాకుండా దాన్ని డ్యాష్‌బోర్డు సమతలంగా ఉంటుంది. దీని ఏడు-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ؚస్క్రీన్ ఫ్లోటింగ్ ఐల్యాండ్ డిజైన్‌ను క్యాబిన్ సైజ్ؚతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ ప్రతి వేరియెంట్‌లోؚ ఏ అంశాలను కలిగి ఉందో ఇక్కడ ఇవ్వబడ్డాయి

రెండు SUVలు డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌లతో వస్తాయి, నెక్సాన్ ప్రత్యేక ఎడిషన్ؚలు బహుళ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ షేడ్‌లతో వస్తాయి. ఫ్రాంక్స్ కేవలం నలుపు మరియు బుర్గుండి డ్యూయల్-టోన్ ఫినిష్ؚతో అందుబాటులో ఉంది, ఇది గ్రాండ్ విటారా SUV ద్వారా ప్రేరణ పొందింది.

ఇతర తేడాలు

ఇప్పుడు మనం రెండు మోడళ్ళ మధ్య ఫీచర్-ఆధారిత డిజైన్ తేడాలను చూద్దాం. మొదటిది, నెక్సాన్ؚలో వెనుక సీట్ ఆర్మ్ؚరెస్ట్‌తో వస్తుంది, ఇది ఫ్రాంక్స్ؚలో ఉండదు.

మరొక ప్రధాన తేడా ఏమిటంటే, నెక్సాన్ؚలో సన్ؚరూఫ్ ఉంటుంది, ఇది బాలెనో-ఆధారిత SUVలో ఉండదు.

చివరిగా, ఫ్రాంక్స్ ఫ్యాబ్రిక్ సీట్లను కలిగి ఉంటుంది, అగ్ర శ్రేణి ప్రత్యేక ఎడిషన్ వేరియెంట్‌లలో ముందు సీట్‌లు వెంటిలేషన్ ఫంక్షన్ؚతో నెక్సాన్ లెదర్ అపోలెస్ట్రీని అందిస్తుంది.

సంబంధించినవి: మారుతి ఫ్రాంక్స్ బ్రెజ్జాల మధ్య తేడాలను పరిశీలించండి

ఫ్రాంక్స్ؚతో, మారుతి ఒక కొత్త కూపే-స్టైల్ సబ్ కాంపాక్ట్ؚను అందిస్తోంది అనేది సుస్పష్టం. SUV-కూపేగా ఉద్దేశించబడి, భిన్నమైన డిజైన్ విధానాన్ని కలిగి ఉన్న టాటా నెక్సాన్ కంటే ఫ్రాంక్స్ చాలా భిన్నంగా ఉంటుంది.

ఫ్రాంక్స్, నెక్సాన్ؚల చిత్రాలను మీరు చూశారు కాబట్టి, స్టైలింగ్ؚ పరంగా మీరు దేనికి ప్రాధాన్యతను ఇస్తారు? క్రింద కామెంట్లలో మాకు తెలియచేయండి.

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 60 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా నెక్సన్ 2020-2023

Read Full News

explore మరిన్ని on టాటా నెక్సన్ 2020-2023

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర