మారుతి ఫ్రాంక్స్ & బ్రెజ్జాల మధ్య తేడాలను పరిశీలిద్దాం
మారుతి బ్రెజ్జా కోసం ansh ద్వారా జనవరి 19, 2023 11:21 am ప్ర చురించబడింది
- 55 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కారు తయారీదారుడి నుండి ఈ కొత్త SUV, బ్రెజ్జాకు స్టైలిస్ట్ ప్రత్యామ్నాయం కావచ్చు
మారుతి తన లైన్ؚఅప్ؚకు మరొక ‘SUV’ ఫ్రాంక్స్ؚను జోడించింది. దీని డిజైన్ ఎలిమెంట్‌లు బాలెనో మరియు గ్రాండ్ విటారా కలయికగా ఉంటు, ఒక సబ్ ؚకంపోస్ట్ క్రాస్ؚఓవర్ؚగా మన ముందుకు వస్తుంది.
బాలెనో మరియు బ్రెజ్జాల మధ్య వేరియంట్ అంటే ఆధునిక డిజైన్ కలిగి ఉండి, భారతీయ రోడ్లకు సరిపోయే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటు, సాంప్రదాయ SUVలాగా కనిపించని ఒక వాహనం కోసం చూస్తున్న వారికి ఫ్రాంక్స్ సరైనది.
ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ & బాలెనోలను సారూప్యంగా అయినా భిన్నమైనవిగా చేసేవి ఇవే.
ఫ్రాంక్స్, బాలెనోల మధ్య తేడాల గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం, ఇప్పుడు, మారుతి సబ్-ఫోర్-మీటర్ ఆఫరింగ్ బ్రెజ్జా కంటే ఇది భిన్నంగా ఎలా ఉంటుందో చూద్దాం:
కూపే vs బాక్సీ డిజైన్
బ్రెజ్జా చాలా వరకు బాక్స్-ఆకారపు SUV అయితే, ఫ్రాంక్స్ కొంత ఎత్తుగా ఉండే కూపే డిజైన్‌తో వస్తుంది. ముందు నుంచి చూస్తే బ్రెజ్జా ప్రీమియంగా ఉంటుంది కానీ ప్లెయిన్ؚగా కనిపిస్తుంది, ఫ్రాంక్స్ ముందు భాగం మరింత ఖరీదైన గ్రాండ్ విటారాను అనుసరించినట్లు కనిపిస్తుంది.
బ్రెజ్జా సైడ్ ప్రొఫైల్ దాని మునపటి మోడల్ؚలాగే ఉంటుంది, డిజైన్ మరింత అభివృద్ధి చెందినట్లుగా దాదాపుగా నిటారైన అంచులతో ఉంది. మరొక వైపు ఫ్రాంక్స్, స్పోర్టీ స్లాంటింగ్ రూఫ్ లైన్ؚతో సహా, తన స్టైలింగ్ؚను బాలెనో నుండి తీసుకుంది.
రెండు SUVల రేర్ ప్రొఫైల్ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కూడా బ్రెజ్జా తన బాక్సీ ఆకారాన్ని తీసుకువచ్చింది. ఫ్రాంక్స్, బాలెనో నుండి ప్రేరణ పొందిన రేర్ ప్రొఫైల్ؚను కలిగి ఉంది. మధ్యలో ‘బ్రెజ్జా’ లెటరింగ్ؚతో నాజూకైన LED టెయిల్ ల్యాంప్స్ కలిగి ఉంది. ఫ్రాంక్స్, దానికి ప్రత్యేకమైన లుక్ؚను ఇచ్చే కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ؚలను కలిగి ఉంది.
సైజు భిన్నత్వం
కొలతలు |
బ్రెజ్జా |
ఫ్రాంక్స్ |
పొడవు |
3995mm |
3995mm |
వెడల్పు |
1790mm |
1765mm |
ఎత్తు |
1685mm |
1550mm |
వీల్ؚబేస్ |
2500mm |
2520mm |
రెండు వాహనాలు నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటాయి, కానీ బ్రెజ్జా వెడల్పు, పొడవు కొంత వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం చిన్నదే కానీ గమనించగలిగినది. రెండిటి మధ్య ఉన్న తేడాను, వాటి ఎత్తును బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఫ్రాంక్స్ స్పోర్టియర్ ఆకారంలో ఉంటుంది, కానీ అది కూడా కొద్దిగా పొడవైన వీల్ؚబేస్ؚను కలిగి ఉంది.
అంతర్గతంగా భిన్నమైన స్టైల్స్
రెండు కార్ల ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫ్రాంక్స్ మరియు బ్రెజ్జా రెండిటి అప్రోచ్ؚలు భిన్నంగా ఉన్నాయి. బ్రెజ్జాؚ డ్యూయల్ –టోన్ (నలుపు మరియు బ్రౌన్) ఇంటీరియర్ థీమ్ؚతో వస్తుంది, ఫ్రాంక్స్ నలుపు, బర్గండీ ఇంటీరియర్ ఫినిష్ؚతో వస్తుంది. స్టీరింగ్, ఇన్ఫోؚؚటైన్మెంట్ డిస్ప్లే రెండిటిలో ఒకేలా ఉంది, కానీ మొత్తం మీద క్యాబిన్ థీమ్ భిన్నంగా ఉంది. బ్రెజ్జా డ్యాష్‌బోర్డ్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది, అయితే ఫ్రాంక్స్ కర్వ్ అకారపు డిజైన్ؚను కలిగి ఉంది.
వాటికి పవర్ؚని ఇచ్చేవి ఏవి
స్పెసిఫికేషన్లు |
బ్రెజ్జా |
ఫ్రాంక్స్ |
|
ఇంజన్ |
1.5 లీటర్ పెట్రోల్ |
1.0 లీటర్ టర్బో పెట్రోల్ |
1.2 లీటర్ పెట్రోల్ |
ట్రాన్స్ మిషన్ |
ఐదు-స్పీడ్ MT/ఆరు స్పీడ్ల ఏటి |
ఐదు-స్పీడ్ MT/ఆరు-స్పీడ్ల AT |
ఐదు-స్పీడ్ MT/ఐదు-స్పీడ్ AMT |
పవర్ |
103PS |
100PS |
90PS |
టార్క్ |
137Nm |
148Nm |
113Nm |
బ్రెజ్జాؚ 1.5 లీటర్ గల పెద్ద పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది, ఫ్రాంక్స్ؚలో దానికి బదులుగా అవే అవుట్ؚపుట్ؚతో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. రెండు ఇంజన్ؚలు ఒకే ట్రాన్స్ మిషన్ ఎంపికలను కలిగి ఉన్నాయి: ఐదు-స్పీడ్ల మాన్యువల్ మరియు ఆరు-స్పీడ్ల ఆటోమాటిక్. కానీ ఫ్రాంక్స్ؚలో, బాలెనోలో ఉండే ఐదు-స్పీడ్ల మాన్యువల్ మరియు AMT ఎంపికలతో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.
ఫీచర్-ప్యాకెడ్
బ్రెజ్జా మరియు ఫ్రాంక్స్ؚలలో ఎక్కువ సారూప్యత బహుశా ఇక్కడే ఉంది. వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిక్ కార్ؚప్లేతో తొమ్మిది-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ARKAMYS సౌండ్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ చార్జర్ మరియు హెడ్స్-అప్ డిస్ప్లే రెండిటిలో ఉంది. బ్రెజ్జాలో సన్ؚరూఫ్ మరియు ఆంబియెంట్ లైటింగ్ ఉన్నాయి, ఇవి ఫ్రాంక్స్ؚలో లేవు.
భద్రత విషయానికి వస్తే, రెండిటిలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ఉన్నాయి, ఇవి బ్రెజ్జాలో టాప్ (వేరియంట్స్‌కు) పరిమితం అయితే, ఫ్రాంక్స్ؚలో ఇవి స్టాండర్డ్ؚగా ఉన్నాయి. ABS మరియు EBD వంటి ఇతర, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), వెనుక పార్కింగ్ సెన్సర్లు మరియు 360-డిగ్రీల కెమెరా రెండిటిలోని సాధారణ భద్రత ఫీచర్లు.
ధర ఏం చెబుతోంది
*
ధర |
|
బ్రెజ్జా |
రూ 7.99 లక్షల నుండి 13.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) |
ఫ్రాంక్స్ |
రూ 8 లక్షల నుండి (అంచనా వేస్తున్న ఎక్స్-షోరూమ్ ధర) |
ఫ్రాంక్స్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు, అది రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు అని మేము ఆశిస్తున్నాము. ధరల విషయంలో ఇది బ్రెజ్జాకు సమాంతరంగానే నిలుస్తుంది, కానీ దాని టాప్ వేరియంట్ బ్రెజ్జా టాప్ వేరియంట్స్ కంటే మరింత చవకగా ఉండవచ్చు.
మరింత ఆటో ఎక్స్ పో 2023 కంటెంట్ కోసం ఇక్కడ చూడండి
ఫ్రాంక్స్ؚను NEXA వారు అందిస్తున్నారు, బ్రెజ్జా ఎరెనా ఉత్పత్తి. ఇది కొనుగోలుదారులకు క్రాస్ ఓవర్ SUV రూపంలో ఒక కొత్త ఎంపికను అందిస్తుంది, ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ బాలెనో బ్రెజ్జా సబ్-కాంపాక్ట్ SUVల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేస్తుంది. క్రింది కామెంట్ సెక్షన్ؚలో మీరు ఫ్రాంక్స్ గురించి ఏమి అనుకుంటున్నారో మాకు తెలియజేయండి.
ఇక్కడ మరింత చదవండి: బ్రెజ్జా ఆన్-రోడ్ ధర
0 out of 0 found this helpful