8.41 లక్షల ధరతో ప్రారంభంకానున్న మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్లు!
మారుతి ఫ్రాంక్స్ కోసం ansh ద్వారా జూలై 13, 2023 10:58 pm ప్రచురించబడింది
- 1.1K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గ్రీనర్ పవర్ ట్రైన్తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దక్కించుకున్న బేస్ స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్లు.
మారుతి శ్రేణిలో తాజాగా చేరిన మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023 లో మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కూపే-SUV బాలెనోో హ్యాచ్బాక్ ఆధారంగా ఉంటుంది మరియు దీన్ని రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కారు తయారీదారు ఇదే శ్రేణిలో CNG పవర్ ట్రైన్ ను జతపరుస్తూ దీనిని CNG ఎంపిక గల పదిహేనవ మారుతి మోడల్ గా అందించారు.
ఫ్రాంక్స్ CNG ధర
వేరియంట్ |
పెట్రోల్- మాన్యువల్ |
CNG – మాన్యువల్ |
వ్యత్యాసం |
సిగ్మా |
7.46 లక్షలు |
8.41 లక్షలు |
రూ. 95,000 |
డెల్టా |
8.32 లక్షలు |
9.27 లక్షలు |
రూ. 95,000 |
మిగితా మారుతి యొక్క CNG శ్రేణిలోని వాహనాల మాదిరిగానే CNG పవర్ట్రైన్ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కే పరిమితమయ్యింది. ఫ్రాంక్స్ లో బేస్ స్పెక్ సిగ్మా మరియు దాని ఎగువున ఉన్న బేస్ డెల్టా వేరియంట్స్ పై గ్రీనర్ ఇంధన ఎంపిక అందించటం జరిగింది. అయితే దీనిపైన ప్రీమియం మాత్రం సంబంధిత వేరియంట్ల ప్రీమియంతో పోలిస్తే ఒక లక్ష తక్కువగా ఉంటుంది.
పవర్ ట్రైన్ వివరాలు
CNG ఎంపిక 77.5 PS మరియు 98.5 Nm దగ్గర ఉత్పత్తులు కలిగి 1.2 లీటర్ల సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజిన్తో లభిస్తుంది. CNG వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే జతకూడి ఉంటాయి. కాగా, ఫ్రాంక్స్ CNG కి 28.51 Km /Kg వరకు ఇంధన సామర్ధ్యం ఉన్నట్టు మారుతి చెప్తోంది. అలాగే ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్ లో ఉన్నప్పుడు 90 PS మరియు 113 Nm వరకు ఉత్పత్తి చేస్తుంది. అలాగే సాధారణ వేరియంట్స్ తో దీనికి 5-స్పీడ్ AMT ఎంపిక కూడా లభిస్తుంది.
ఫ్రాంక్స్ లో 100 PS మరియు 148 Nm వరకు ఉత్పత్తి చేసే ఒక లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపిక కూడా ఉంటుంది. ఈ భాగం 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది.
ఫీచర్లు మరియు భద్రత
ఈ రెండు CNG వేరియంట్స్, ఏడు ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వైర్లెస్ ఆండ్రోయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో పాటు లభిస్తుంది. అలాగే కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్త్లెమేట్ కంట్రోల్, విద్యుత్ సహకారంతో మడవగల ORVMలు (ఎలెక్ట్రికల్లీ ఫోల్డబుల్ orvmలు), రెండేసి ముందర ఎయిర్ బాగ్లు (డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ (ESP), ప్రయాణీకులందరికి 3-పాయింట్ సీట్ బెల్ట్లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ లభిస్తాయి.
ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఎగుమతి చేయబడే భారతీయ వాహనాల జాబితాలో చేరిన మారుతి ఫ్రాంక్స్
ఈ క్రాస్ ఓవర్ SUV యొక్క ఉన్నత వేరియంట్లకు తొమ్మిది ఇంచుల టచ్స్క్రీన్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ నియంత్రణ, ఎత్తు సర్దుబాటుకు వీలుగా ఉండే డ్రైవరు సీటు, వెనక ac వెంట్లు, దాదాపు ఆరు ఎయిర్ బాగ్లు, ఒక హెడ్స్అప్ డిస్ప్లే మరియు 360 డిగ్రీల కెమెరా లభిస్తాయి.
ధరలు మరియు పోటీదారులు:
ఫ్రాంక్స్ ఎక్స్ షోరూం ధరలు 7.46 లక్షల నుండి 13.13 లక్షల వరకు పలుకుతున్నాయి. మీరు కావాలనుకుంటే ఫ్రాంక్స్ ని 23,248 రూపాయల సబ్స్క్రిప్షన్ రుసుమును చెల్లించి కూడా పొందవచ్చు. ఈ క్రాస్ ఓవర్ SUV టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300 మరియు హ్యుందాయ్ ఎక్స్టర్ లకి గట్టి పోటీదారు.
ఇక్కడ మరింత చదవండి: ఫ్రాంక్స్ AMT
0 out of 0 found this helpful