• English
    • Login / Register

    మారుతి సియాజ్ 2018: వేరియంట్ల వివరణ

    మార్చి 15, 2019 04:46 pm raunak ద్వారా ప్రచురించబడింది

    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మారుతి సుజుకి సియాజ్ యొక్క మిడ్-లైఫ్ నవీకరణ ఇక్కడ ఉంది మరియు దాని ప్రత్యర్థి హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాతో పోటీని పునరుద్ధరించడానికి ఇది సిద్ధంగా ఉంది. నవీకరించిన సియాజ్ దాని అన్ని వేరియంట్లలో ముందు కంటే ఎక్కువ లక్షణాలను అధికంగా కలిగి ఉంది. అయితే 2018 సియాజ్ లో ఏ వేరియంట్ కొనుగోలు చేసేందుకు బాగుంటుంది??కనుక్కుందాం.  

    Maruti Ciaz 2018  Maruti Ciaz 2018

    రంగు ఎంపికలు

    • నెక్సా బ్లూ
    • మాగ్మా గ్రే (కొత్త రంగు)
    • పెరల్ మిడ్నైట్ బ్లాక్
    • పెరల్ సంగ్రియా రెడ్
    • పెరల్ డిగ్నిటి బ్రౌన్
    • పెరల్ స్నో వైట్
    • ప్రీమియం సిల్వర్ (కొత్త రంగు)

    ప్రామాణిక భద్రతా లక్షణాలు

    • ప్రిటెన్షనర్లు మరియు ఫోర్స్ లిమిటర్స్ తో డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు సీట్ల బెల్టులు
    • EBD తో ABS
    • ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్
    • వెనుక పార్కింగ్ సెన్సార్లు
    • వెనుక డిఫాగర్
    • సీట్బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుడు) (కొత్తది)  
    • ఓవర్ స్పీడింగ్ అలర్ట్ సిష్టం (కొత్తది)

    మారుతి సుజుకి సియాజ్ సిగ్మా - చాలా ప్రాథమిక లక్షణాలను పొందుతుంది. బడ్జెట్ పై పెద్ద మరియు ఇంధన సామర్ధ్యం కలిగిన కాంపాక్ట్ సెడాన్ కావాలనుకునే వారికి ఈ వేరియంట్

     

    ఎక్స్-షోరూమ్, ఇండియా

    పెట్రోల్ సిగ్మా

    డీజిల్ సిగ్మా

    ధర

    రూ. 8.19 లక్షలు

    రూ. 9.19 లక్షలు

    లైట్లు: హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ (ప్రొజెక్టర్లు: లో బీం; మల్టీ రిఫ్లెక్టర్స్: హై భీం) ఉన్నాయి. రెగ్యులర్ ఇన్‌కెన్‌డిసెంట్  టెయిల్ లాంప్స్.

    ఆడియో: బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్, CD ప్లేబ్యాక్ మరియు USB కనెక్టివిటీతో 2-డిన్ ఆడియో సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ 6-స్పీకర్ సిస్టమ్ (4-స్పీకర్లు + 2 ట్వీటర్స్) తో జత చేయబడింది.

     కంఫర్ట్: ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వెలుపల రీరీవ్యూ మిర్రర్స్ (ORVMs), డ్రైవర్-సైడ్ ఆటో అప్ / డౌన్ తో పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, 4.2-ఇంచ్ కలర్ డ్రైవర్ ఇంఫో TFT డిస్ప్లే (పెట్రోల్ కోసం మాత్రమే), వెనుక A.C వెంట్లతో ఉన్న మాన్యువల్ A.C మరియు ముందర మరియు రేర్ ఆర్మ్రెస్ట్ లు.

    టైర్స్: స్టీల్ రిమ్స్ మరియు వీల్ క్యాప్ తో  185/65 క్రాస్ సెక్షన్ 15-ఇంచ్ వీల్స్

    కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?

    బేస్ వేరియంట్ అయిన సియాజ్ సిగ్మా వేరియంట్  అన్ని అవసరమైన లక్షణాలను కలిగి ఉంది. అయితే, ఈ వేరియంట్ కు అధనంగా ఉన్న హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును మేము ప్రశంసిస్తున్నాము.

    ప్రీ-ఫేస్లిఫ్ట్ సియాజ్ ధరలతో పోలిస్తే, 2018 సియాజ్ పెట్రోల్ సిగ్మా వేరియంట్ సుమారు రూ.36,000 అధికంగా ధరను కలిగి ఉంది. మరోవైపు డీజిల్ సియాజ్ సిగ్మా ధర (సుమారు రూ.30,000) కి పడిపోయింది. SHVS టెక్ ఐడిల్ స్టార్ట్-స్టాప్, బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తి మరియు టార్క్ సహాయాన్ని కలిగి ఉంటుంది, దీనికి గానూ  కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సియాజ్ ప్రస్తుతం ఈ విభాగంలో మరింత ఇంధన-సమర్థవంతమైన పెట్రోల్ సెడాన్.

    మీరు ఈ బడ్జెట్ లో ఉండి డెల్టా వేరియంట్ ఖరీదైనది అని మీకు అనిపిస్తే, సియాజ్ సిగ్మా వేరియంట్ ను ఎంచుకోవచ్చు.

    మారుతి సుజుకి సియాజ్ డెల్టా - సియాజ్ సిగ్మా వేరియంట్ తో పోలిస్తే మరింత ఆధునిక ప్యాకేజీని కోరుకునే వారికి ఈ వేరియంట్

    ఎక్స్-షోరూమ్, ఇండియా

    పెట్రోల్ డెల్టా

    డీజిల్ డెల్టా

    ధర

    రూ.8.80 లక్షలు / రూ. 9.80 లక్షలు

    రూ.9.80 లక్షలు

    సిగ్మా పై ప్రీమియం ధర

    61K

    61K

    బేస్ సిగ్మా వేరియంట్ పైన, డెల్టా వేరియంట్ కలిగి ఉండే లక్షణాలు:

    లైట్స్: ఫ్రంట్ హాలోజెన్ ఫాగ్ ల్యాంప్స్

    సౌకర్యాలు: క్రూజ్ నియంత్రణ, ఆటో క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు  

    టైర్: సిగ్మా వలే అదే 185/65 క్రాస్ సెక్షన్ 15-ఇంచ్ టైర్ పైన ప్రయాణాలు, కాని అల్లాయ్ వీల్స్ తో వస్తుంది.

    భద్రతా లక్షణాలు: పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రత్యేకంగా హిల్-హోల్డ్ తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ను అందిస్తుంది.

    కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?

    సిగ్మా వేరియంట్ తో పోలిస్తే ఈ వేరియంట్ రూ.60,000 ఎక్కువ ధరను కలిగి ఉంది. అయితే, డెల్టా వేరియంట్ మరీ ఎక్కువ ధరను కాకుండా  తటస్థంగా ఉంటుంది. డెల్టా వేరియంట్ ప్రాధమిక సిగ్మా వేరియంట్ మీద లక్షణాల పరంగా మరియు అందం పరంగా ప్రీమియం సరాసరిని పెంచుతుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి లక్షణాలను అందిస్తుంది, ఇవి అధనంగా మార్కెట్లో అందుబాటులో లేవు.

    ఇది కొనుగోలుదారులకు ఆటోమెటిక్ ఆప్షన్ తో అందించబడుతుంది మరియు ఈ ఆప్షన్ ప్రాధమికంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం తో ఉన్న పెట్రోల్ తో వస్తుంది. సియాజ్ యొక్క వేరియంట్ లైనప్ లో డెల్టా వేరియంట్  అత్యంత విలువైనది.  

    మారుతి సుజుకి సియాజ్ జెటా - దాని వెనుక సీట్ కోసం ప్రత్యేకంగా సియాజ్ ను కొనుగోలు చేసుకోవాలి అనుకొనే వారికి మరియు  ఆల్ఫాలో అదనపు లక్షణాలు అవసరం లేదు అనుకొనేవారికి ఈ వేరియంట్. లేకపోతే చాలా ఖరీదైనది.

    ఎక్స్-షోరూమ్, ఇండియా

    పెట్రోల్ జీటా

    డీజిల్ జీటా

    ధర

    రూ .9.57 లక్షలు / 10.57

    రూ. 10.57 లక్షలు

    సిగ్మా పై  ప్రీమియం ధర

    77K / 77K

    77K

    మిడ్-స్పెక్ డెల్టా వేరియంట్ మీద, జీటా వేరియంట్ కలిగి ఉన్న లక్షణాలు

    లైట్స్:  డే టైం రన్నింగ్ LED తో ఆటోమేటిక్ LED హెడ్ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్, LED ఎలిమెంట్స్ తో టెయిల్ ల్యాంప్స్

    సౌకర్యాలు: పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ తో పాసివ్ కీలేస్ ఎంట్రీ, వెనుక పార్కింగ్ కెమెరా డిస్ప్లే తో ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, రేర్ విండ్ స్క్రీన్ సన్షేడ్, ఫ్రంట్ ఫుట్‌వెల్ ల్యాంప్స్ మరియు రేర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లు.

    కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?

    మారుతి సుజుకి సంస్థ జీటా వేరియంట్ కు రూ.77,000 రూపాయలు అధనంగా వసూలు చేస్తోంది మరియు ఇది ప్యాకేజీకి కొంత ప్రీమియంను జత చేసింది. సియాజ్ జెటా వేరియంట్ డ్రైవర్ కోసం మాత్రమే అధనంగా కాకుండా  వెనుక ప్రయాణీకుల కోసం కూడా ఉంది. ఉదాహరణకు, ముందర లైటింగ్ మొత్తం LED ఉంటుంది. ఈ LED లైటింగ్ ప్రీమియం లుక్ ఉండడం మాత్రమే కాకుండా,  హాలోజన్లు పోలిస్తే మంచి ప్రకాశం అందిస్తుంది. దీనిలో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యొక్క లభ్యత లేకపోవడం మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. అది ఒక్కటి పక్కన పెడితే ఈ ధర వద్ద ఈ వేరియంట్ చాలా విలువైనది.

    మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా - ఎవరైతే సియాజ్ ను అన్ని లక్షణాలతో కావాలనుకుంటున్నారో వారికోసం ఈ వేరియంట్

    ఎక్స్-షోరూమ్, ఇండియా

    పెట్రోల్ ఆల్ఫా

    డీజిల్ ఆల్ఫా

    ధర

    రూ. 9.97 లక్షలు / 10.97

    రూ.10.97 లక్షలు

    సిగ్మా పై ప్రీమియం ధర

    40K / 40K

    40K

    జీటా వేరియంట్ మీద ఆల్ఫా వేరియంట్ కలిగి ఉన్న లక్షణాలు:

    ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్:  ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటూ మిర్రర్ లింక్ సపోర్ట్ తో ఉన్న 7-ఇంచ్ వాయిస్ ఎనేబుల్డ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టమ్ కూడా బిల్ట్-ఇన్ నావిగేషన్ తో వస్తుంది.

    సౌకర్యాలు: లెదర్ అప్హోస్టరీ, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్  

     టైర్లు: మెషిన్ ఫినిష్డ్ డ్యుయల్ టోన్ అలాయ్స్ మీద పెద్ద 195/55 క్రాస్ సెక్షన్ 16-ఇంచ్ టైర్లు.

    Maruti Ciaz 2018

    కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?

    ఆల్ఫా వేరియంట్ లక్షణాల పరంగా, స్టైలిష్ అంశాల పరంగా ప్రజల మన్నన తప్పకుండా పొందుతుంది. ఆల్ఫా వేరియంట్ యొక్క ప్రధానాంశం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కార్ ప్లే ఎనబుల్డ్ టచ్స్క్రీన్ వ్యవస్థ మరియు లెథర్ అప్హోల్స్టరీను కలిగి ఉండడం. ఈ టాప్ వేరియంట్ అయిన ఆల్ఫా లో ఉన్న లక్షణాలకు జెటా వేరియంట్ కంటే ఈ వేరియంట్ కలిగి ఉన్న అధిక ధరను అంగీకరించవచ్చు. ఈ విభాగంలో సియాజ్ ఆల్ఫా అత్యంత సరసమైనది మరియు అన్ని లక్షణాలను కలిగి ఉంది.  

     

     

    was this article helpful ?

    Write your Comment on Maruti సియాజ్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience