Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మరుతీ బలెనో అలియాస్ వైఆరే ఇండియా యొక్క విడుదల అక్టోబర్ 26న

మారుతి వైఆరే కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 18, 2015 09:45 am ప్రచురించబడింది

జైపూర్:

ఈమధ్యనే భారతదేశంలో తయారీ మొదలు పెట్టిన తరువాత వైఆరే అక్టోబర్ 26న దేశంలో విడుదలకు సిద్దం అయ్యింది. ఎలీట్ ఐ20 వచ్చే కాలంలోనే ఇది కూడా రావడంతో పోటీ కి ఇది మరింతగా సన్నద్దం అవ్వాలి. ఈ కారు మొన్న జరిగిన ఫ్రాంక్ఫర్ట్ ఆటో షో లో ప్రదర్శితమయ్యింది.

మరుతీ వారి కొత్త హ్యాచ్ బ్యాక్ లో 1.2-లీటర్ వీవీటీ పెట్రోల్ ఇంజిను ఉంటుంది. ఇది 83bhp ని మరియూ 115Nm టార్క్ ని విడుదల చేస్తుంది. భవిష్యత్తులో, కారుకి 1.0-లీటర్ టర్బో చార్జ్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిను అందించవచ్చు. ఇది 92bhp మరియూ 170Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పటికే యూరోపియన్ మోడల్ కారుల్లో అందుబాటులో ఉంది. అన్ని ఇంజిన్లకి సుజూకీ వారి కొత్త SHVS టెక్నాలజీ ని ఇంజిను స్టార్ట్/స్టాప్ విధులకై ఇంకా ఎక్కువ మైలేజీకై అందించబడుతుంది.

ఈ కారు భారతదేశంలో సబ్-4 మీటర్ హ్యాచ్ బ్యాక్ గా సరికొత్త మరుతీ సుజూకీ వేదికను ఆధారంగా చేసుకుని ప్రవేశిస్తుంది. పైగా, దేశంలో హైబ్రీడ్ టెక్నాలజీతో రాబోతున్న మొట్టమొదటి హ్యాచ్ బ్యాక్ ఇదే అవుతుంది. కారులో 355 లీటర్ల బూట్ స్థలం తో పాటుగా ఎస్ క్రాస్ మరియూ సియాజ్ లో ఉన్నటువంటి టచ్ స్క్రీన్ ఏవీఎన్ సిస్టం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. రూపం విషయంలోకి వస్తే, ఈ హ్యాచ్ బ్యాక్ సుజూకీ యొక్క కొత్త డిజైన్ తో వెనక్కి దువ్వినటువంటి హెడ్ ల్యాంప్స్, పెద్ద V ఆకారపు ముందు వైపు గ్రిల్లు తో V ఆకారపు క్రోము లైను క్రింద భాగంలో మరియూ కొంత మేరకు రూఫ్ పై కూడా ఉంటుంది. కారు కి ఎలీట్ ఐ20 కి ఉన్నట్టుగానే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది నెక్సా షోరూంలలోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది రూ. 5.5 లక్షల నుండి రూ.8.5 లక్షల ధరకి ఎలీట్ ఐ20 మరియూ హోండా జాజ్ కి పోటీగా అందించవచ్చు.

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 11 సమీక్షలు
  • 1 Comments

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర