గ్లోబల్ NCAP క్రాష్ ట్రెస్ట్‌లో స్విఫ్ట్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనపరచిన మారుతి ఆల్టో K10
మారుతి ఆల్టో కె కోసం ansh ద్వారా ఏప్రిల్ 05, 2023 03:00 pm ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది కేవలం రెండు స్టార్ రెంటింగ్‌ను మాత్రమే పొందినా, స్విఫ్ట్ ఇగ్నిస్ మరియు S-ప్రెస్సోల విధంగా కాకుండా దీని బాడీషెల్ ఇంటిగ్రిటీ స్టేబుల్‌గా ఉన్నట్లు పేర్కొనబడింది.
-
ఈ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ వయోజనుల ఆక్యుపెంట్ భద్రత పరంగా రెండు స్టార్‌లను, పిల్లల ఆక్యుపెంట్ భద్రత పరంగా సున్నా స్టార్‌లను పొందింది.
-
వయోజనుల భద్రతలో 34 పాయింట్‌లకు గాను 21.67 పాయింట్‌లను మరియు పిల్ల భద్రతలో 49 పాయింట్‌లకు 3.52 పాయింట్‌లను పొందింది.
-
దీని ప్రామాణిక భద్రత కిట్ؚలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, EBDటో ABS, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లు ఉన్నాయి.
-
ఆల్టో K10 ధర రూ.3.99 లక్షల నుండి రూ.5.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.
#SafeCarsForIndia ప్రచారంలో భాగంగా, గ్లోబల్ NCAP భారతదేశంలో అమ్ముడయ్యే కొన్ని కొత్త మోడల్‌ల క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది, ఇందులో ఆల్టో K10 ఫలితాలు ఉన్నాయి. ఈ హ్యాచ్ؚబ్యాక్ సమగ్ర భద్రత రేటింగ్ؚల గురించి చెప్పడానికి ఏమీ లేకపోయినా, ఆశ్చర్యకరంగా స్విఫ్ట్ ఎస్-ప్రెస్సో మరియు ఇగ్నిస్ వంటి స్థిరమైన పెద్ద వాహనాల కంటే, ఆల్టో K10తో పాటు పరీక్షించిన వ్యాగన్ R కంటే దీని రేటింగ్ మెరుగ్గా ఉంది.
ఇది కూడా చదవండి: గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ؚలలో 5 స్టార్ రేటింగ్ సాధించిన మహీంద్రా స్కార్పియో N
భారతదేశంలో అత్యంత చవకైన కారు ప్రదర్శన ఈ టెస్ట్ؚలలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం:
వయోజనుల ఆక్యుపెంట్ భద్రత
ఈ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ వయోజనుల ఆక్యుపెంట్ భద్రత రేటింగ్‌లో 34 పాయింట్‌లకు గాను 21.67 పాయింట్‌ల స్కోర్ؚతో రెండు స్టార్‌ను సాధించింది.
ఫ్రంట్ ఇంపాక్ట్
ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, డ్రైవర్ మరియు సహ-ప్రయాణీకుల ఇద్దరి తల, మెడకు “తగినంత” భద్రత లభించింది మరియు వారి ఛాతీకి “మోస్తరు” భద్రత లభించింది. డ్రైవర్ కుడి తొడ, మోకాలుకు భద్రత “పేలవంగా” ఉంది మరియు కుడి కాలి ఎముకకి లభించిన భద్రత “మోస్తరుగా” రేట్ చేయబడింది. డ్రైవర్ ఎడమ తొడ, మోకాలు మరియు కాలి ఎముకకి కూడా “మోస్తరు” భద్రత మాత్రమే లభించింది.
సహ-ప్రయాణీకుడి తొడలు మరియు మోకాళ్ళకు “మోస్తరు” భద్రత మాత్రమే లభిస్తే, సహ-ప్రయాణీకుల కాలి ఎముకలకు అందిన భద్రత “తగినంత” అని రేట్ చేయబడింది.
సైడ్ ఇంపాక్ట్
సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో, డ్రైవర్ తల మరియు పెల్విస్ؚకు “తగినంత” భద్రత లభించింది. ఛాతీకి లభించిన భద్రత “పేలవంగా” రేట్ చేయబడింది, కడుపు భాగంలో “తగినంత” భద్రత లభించింది. ఆల్టో K10లో కర్టెన్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగ్ؚలు లేకపోవడం వలన, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ؚను నిర్వహించలేదు.
బాడీషెల్ ఇంటిగ్రిటీ
ఈ ఇంపాక్ట్‌ల తరువాత, ఆల్టో K10 బాడీషెల్ ఇంటిగ్రిటీ స్టేబుల్ అని రేట్ చేయబడింది, దీని అర్ధం గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ వేగం 64kmph కంటే ఎక్కువ లోడింగ్ؚను తట్టుకునే సామర్ధ్యం దీనికి ఉంది.
పిల్లల ఆక్యుపెంట్ భద్రత
పిల్లల ఆక్యుపెంట్ భద్రత విషయానికి వస్తే, ఆల్టో K10 49 పాయింట్‌లకు 3.52 పాయింట్‌ల స్కోర్ మాత్రమే సాధించి జీరో స్టార్‌ను అందుకుంది.
ఇది కూడా చదవండి: నిలిపివేయబడిన అత్యంత చవకైన మారుతి సుజుకి
18 నెలల వయసు పిల్లల కోసం, వయోజనుల సీట్ బెల్ట్‌ను ఉపయోగించి, వెనుకకు చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ (CRS)ను ఏర్పాటు చేశారు. ఇది తలకు “తగినంత” భద్రతను, ఛాతీ ప్రాంతంలో “పేలవమైన” భద్రతను అందించింది. మూడు సంవత్సరాల పిలల్ల కోసం, వయోజనుల సీట్ బెల్ట్‌ను ఉపయోగించి ముందు వైపుకు చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ (CRS)ను అమర్చారు. దీని వలన తలపై ఇంపాక్ట్ ప్రభావం ఎక్కువగా ఉంది, గాయాలకు అధిక ఆస్కారం ఉంది.
మారుతి, ఆల్టో K10లో ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లను అందించనందున, చైల్డ్ రక్షణ కోసం సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ؚను నిర్వహించలేదు.
భద్రత ఫీచర్‌లు
ఆల్టో K10లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు రేర్ పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ హయ్యర్ వేరియెంట్ؚలు కూడా ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్ؚలాక్, సెంట్రల్ డోర్ లాకింగ్ మరియు స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్‌లను పొందాయి.
ధర & పోటీదారులు
ఆల్టో K10 ధర రూ.3.99 లక్షల నుండి రూ.5.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది, ఇది రెనాల్ట్ క్విడ్ؚతో పోటీ పడుతుంది, కానీ ధర పరంగా మారుతి ఎస్-ప్రెస్సోకు ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని పరిగణించవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: ఆల్టో K10 ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful