• English
  • Login / Register

మహీంద్రా XUV300 ఎలక్ట్రిక్ టెస్టింగ్ చేయబడుతూ మొదటిసారి మా కంటపడింది

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం sonny ద్వారా మార్చి 04, 2020 01:52 pm ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కనీసం 350 కిలోమీటర్ల రేంజ్ కలిగిన నెక్సాన్ EV-ప్రత్యర్థి 2021 లో ప్రారంభించబడుతుంది

  •  XUV300 ఎలక్ట్రిక్ మొత్తం కవరింగ్ తో కప్పబడి టెస్టింగ్ కి గురవుతూ మా కంటపడింది.
  •  ఆటో ఎక్స్‌పో 2020 లో మోడల్‌ లో కనిపించే డిజైన్ క్యూలు ఏవీ టెస్ట్ మ్యూల్‌లో లేవు.
  •  టెస్ట్ ప్రోటోటైప్ రెగ్యులర్ XUV300 యొక్క టాప్-హ్యాట్ ని ధరించే అవకాశం ఉంది, కనుక ఇది సరిగ్గా అదే విధంగా కనిపిస్తుంది. 
  •  XUV300 ఎలక్ట్రిక్ బ్రాండ్ యొక్క కొత్త EV పవర్ట్రెయిన్, MESMA 350 ద్వారా ఆధారపడుతుంది.
  •  ఇది కనీసం 350 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది మరియు టాటా నెక్సాన్ EV వంటి కారుతో పోటీ పడుతుంది.  

Mahindra XUV300 Electric Spied Testing For The First Time

మహీంద్రా XUV 300 ఎలక్ట్రిక్ భారతీయ కార్ల తయారీ సంస్థ నుండి మొదటి ధీర్ఘ-శ్రేణి EV. రెగ్యులర్ XUV300 ను ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రకటించబడింది, ఇది  ఆటో ఎక్స్‌పో 2020 లో బహిరంగంగా ప్రవేశించింది మరియు ఇప్పుడు రోడ్డు మీద టెస్టింగ్ అవుతూ మా కంటపడింది.    

ఇక్కడ మా కంటపడిన XUV300 ఎలక్ట్రిక్ పూర్తిగా కవరింగ్ తో ఉంది, అయితే దాని నిష్పత్తి మరియు ఫ్యుయల్ ఫిల్లింగ్ క్యాప్ XUV300 యొక్క ప్రస్తుత IC (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్‌ తో సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, మా కంటపడిన ప్రోటోటైప్ టెస్ట్ మ్యూల్ ప్రస్తుత XUV300 మాదిరిగానే టాప్-హ్యాట్ ని ధరించే అవకాశం ఉంది. కనిపించే టెయిల్ పైప్ లేకపోవడం వల్ల ఇది EV వెర్షన్‌గా గుర్తించబడింది. అలాగే, చిత్రాల యజమాని అది నిశ్శబ్దంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. నీలి-రంగు అలాయ్స్ మరొక ముఖ్యమైన గుర్తు అని చెప్పవచ్చు.

Mahindra XUV300 Electric Spied Testing For The First Time

XUV300 ఎలక్ట్రిక్ యొక్క సాంకేతిక లక్షణాలు వెల్లడించబడనప్పటికీ, ఇది బ్రాండ్ యొక్క కొత్త EV ఆర్కిటెక్చర్, MESMA350 (మహీంద్రా ఎలక్ట్రిక్ స్కేలబుల్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్) పై ఆధారపడి ఉంటుంది. పేరు సూచించినట్లుగా, XUV300 ఎలక్ట్రిక్ ఒకే ఛార్జ్ నుండి కనీసం 350 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఇది వేగంగా ఛార్జింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

Mahindra XUV300 Electric Spied Testing For The First Time

XUV300 ఎలక్ట్రిక్ యొక్క తుది ప్రొడక్షన్-స్పెక్ మోడల్ ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించినట్లుగా కొన్ని డిజైన్ క్యూలను కలిగి ఉంటుంది. ఇవి తరువాత XUV300 ఫేస్‌లిఫ్ట్‌లో నెక్సాన్ తరహాలోనే ప్రవేశించనున్నాయి. ఇది 2021 రెండవ భాగంలో సుమారు 15 లక్షల రూపాయల ధరతో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. XUV300 ఎలక్ట్రిక్ టాటా నెక్సాన్ EV కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది.

చిత్ర మూలం

దీనిపై మరింత చదవండి: XUV300 AMT

was this article helpful ?

Write your Comment on Mahindra ఎక్స్యువి400 ఈవి

1 వ్యాఖ్య
1
A
anuj dubey
Feb 27, 2021, 10:55:35 AM

चार्जिंग सुविधा घर पे भी हो सकती है मतलब घर पे चार्ज कर सकते है कहीं लेे लिए और चार्ज कराने गए तो पेट्रोल से भी मंहगी इसकी चार्जिंग फीस निकली तो भाई जान निकल जाएगी उस समय । खेत बारी बेच कर लेंगे तो ऐसा

Read More...
    సమాధానం
    Write a Reply

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience