జూన్ 2015 లో 36,134 కార్లను విక్రయించిన మహీంద్రా
జూలై 02, 2015 11:42 am akshit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ జూన్ 2014 లో 38,466 యూనిట్లు అమ్మగా గత నెలలో అమ్మకాల శాతం తగ్గి 36,134 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. ఇందులో కంపెనీ దేశీయ అమ్మకాలు జూన్ 2014 లో 36,452 యూనిట్లు కాగా గత నెల అమ్మకాల శాతం తగ్గి 33,282 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉండగా, సంస్థ ఎగుమతులు మాత్రం 2,852 యూనిట్లు వద్ద 42 శాతం వృద్ధి చెందాయి.
ప్రయాణీకుల వాహనాల విభాగం లో, యుటిలిటీ వాహనాలు, కార్లు మరియు వ్యాన్లు గత ఏడాది జూన్ నెలలో 18,635 యూనిట్ల అమ్మకాలతో పొలిస్తే, క్రిందటి నెలలో తక్కువగా అమ్మకాల శాతం 15,880 యూనిట్లు గా నమోదయ్యాయి. అయితే మీడియం మరియు హెవీ కమర్షియల్ వాహనాలు మాత్రం 404 యూనిట్లు వద్ద 45 శాతం వృద్ధిని సాధించాయి.
June | |||
F16 | F15 | % Change | |
Passenger Vehicles | 15880 | 18635 | -15% |
Utility Vehicles | 14433 | 16492 | -12% |
Cars + Vans | 1447 | 2143 | -32% |
Commercial Vehicles | 12737 | 13273 | -4% |
LCV < 3.5T | 11507 | 12283 | -6% |
LCV > 3.5T | 826 | 711 | 16% |
MHCV | 404 | 279 | 45% |
3W | 4665 | 4544 | 3% |
Total Domestic Sales | 33282 | 36452 | -9% |
Total Exports | 2852 | 2014 | 42% |
Total Sales (Domestic + Export) | 36134 | 38466 | -6% |
మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ & చీఫ్ ఎక్జిక్యూటివ్ (ఆటోమోటివ్) అయినటువంటి ప్రవీణ్ షా, ఆటో అమ్మకాల నిర్వహణ గురుంచి మాట్లాడుతూ "ప్రస్తుతం ఉన్న సాధారణ వర్షపాతం మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ప్రారంభాలు రావడం వలన మా వాహనాలకి డిమాండ్ పెరిగి ముందుకు వెళ్తామని బావిస్తున్నాము. అలాగే ఇటీవల మహీంద్రా వద్ద విడుదలైన మా ఉత్పత్తులు న్యూ ఏజ్ ఎక్స్ యూ వి500, మరియు అన్ని కొత్త ఎస్ సివి, జీటో ఇవన్నీ కూడా వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయని తెలిపారు". గత నెల హెవీ కమర్షియల్ వాహనాల ఎగుమతులు వృద్ధిని సాదించినందుకుగాను సంతోషం వ్యక్తం చేశారు.