మహింద్రా వారు 'సుప్రో వ్యాన్' ని రూ. 4.38 లక్షల వద్ద మారుతి ఓమ్నీ కి పోటీగా విడుదల చేశారు
అక్టోబర్ 19, 2015 10:38 am sumit ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- 17 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మహింద్రా & మహింద్రా వారు డీజిల్ ఎంపీవీ ని 'సుప్రో వ్యాన్ పేరిట రూ. 4.38 లక్షల (ఎక్స్-షోరూం,థానే) ధర వద్ద విడుదల చ్ఝేశారు. ఇది బీఎస్-III ఎమిషన్ ప్రమాణాలను పాటిస్తుంది మరియూ ఎక్కువగా సెమీ-అర్బన్ కుటుంబాల వారికి ఉపయోగపడుతుంది.
దీనికి 909cc ఇంకా 45.6bhp శక్తి విడుదల చేసే ఇంజిను కలిగి ఉంటుంది. 5-సీట్ గా అయినా లేదా 8 సీటర్ గా అయినా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చును. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మారుతీ ఓమ్ని ఇంకా ఈకో లతో ఇది పోటీ పడనుంది.
సుప్రో వ్యాన్ మూడు వేరియంట్స్ - వీఎక్స్ ట్రిం, ఎల్ఎక్స్ ట్రిం ఇంకా జెడ్ఎక్స్ ట్రిం గా అందుబాటులో ఉంది. ఉన్నత శ్రేణి కి పవర్ స్టీరింగ్, ఎయిర్-కండిషనర్ ఉండగా మధ్య వేరియంట్ కి కేవలం పవర్ స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. దిగువ శ్రేణికి ఇవేవీ ఉండవు. అన్నిటీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది.
ఇవి కాకుండా, 'సుప్రో మ్యాక్సీ ట్రక్' పేరిట రూ. 4.25 లక్షల (ఎక్స్-షోరూం,థానే) ధరకి ఇంకో వాహనం విడుదల చేశారు. ఇది ఒక టన్ను లోడు కమర్షియల్ వాహనం మరియూ బీఎస్-III ఎమిషన్ ప్రమాణికలను అనుసరిస్తుంది. రెండు వాహనాలు కంపెనీ వారి పూణే దగ్గరి చకన్ సదుపాయంలో తయారు చేశారు. ఇవి మూడు రంగులలో లభ్యం అవుతున్నాయి.