• English
  • Login / Register

మహీంద్ర కే యు వి 100 రూ.4.42 లక్షల ధరతో ప్రారంభం అయ్యింది .

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం arun ద్వారా జనవరి 18, 2016 01:29 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

KUV100

మహీంద్రా దాని మైక్రో SUV అయిన KUV100 ని 4.42 లక్షల ధరతో ప్రారంభించింది(ఎక్స్-షోరూమ్, పూనే). KUV100 కోసం బుకింగ్స్ ఇప్పటికే కొన్ని వారాల ముందు నుండి ప్రారంభించారు మరియు ఈ అద్భుతమైన ధర ని ప్రకటించిన తర్వాత దీని బుకింగ్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ KUV100 భారత ఆటో మార్కెట్ లో ప్రత్యక్ష పోటీదారు గా ఉంది. ఇది ప్రధానంగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో తో, B-సెగ్మెంట్ హాచేస్ వంటి వాహనాలకి పోటీగా ఉండే అవకాశం ఉంది. దీని తరువాత మారుతి కూడా ఇగ్నిస్ ని అదే విభాగంలో ఈ సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నారు.

KUV100 Price

యాంత్రిక భాగాల గురించి మాట్లాడుతూ మహీంద్రా KUV100 బ్రాండ్ కొత్త మూడు సిలిండర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఆధారంగా వచ్చింది. పెట్రోల్ mFalcon G80 1.2 లీటర్ యూనిట్ తో ఉంటుంది. ఈ ఇంజిన్ 5,500 ఆర్పిఎమ్ వద్ద 82 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు 3500-3600 rpm మధ్య 114 Nmటార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

KUV100 Variants

KUV100 వాహనం 6 సీట్లు కలిగి ఉంటుంది. మొదటి వరుస మధ్యలో మూడవ సీటును వయోజనుల కోసం ఏర్పాటు చేసారు. ఇది కూడా అత్యధిక వేరియంట్స్ లో ఒకటిగా 5 సీటర్ తోరాబోతుంది. భద్రత పరంగా చూస్తే మహీంద్రా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ తో అన్ని వేరియంట్లలో ప్రామాణిక ABS తో వస్తుంది అని ప్రకటించింది.

KUV100 Interiors

KUV100డిజైనర్ గ్రే, పెర్ల్ వైట్, ఎరుపు, మిరుమిట్లు గొలిపే యాక్వమరిన్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఆరెంజ్ అనే ఏడు రకాల బాడీ కలర్స్ తో వస్తుంది. KUV100 గేర్ ఇండికేటర్, పాడ్డిల్ ల్యాంప్, మరియు ఇల్ల్యుమినేటేడ్ కీ రింగ్ ని కలిగి ఉంది. దీని యొక్క సమాచార వినోద వ్యవస్థ బ్లూటూత్, హాండ్స్ ఫ్రీ , USB, DIS మరియు ఆక్స్ కనెక్టివిటీ మరియు 6-స్పీకర్ యూనిట్ తో ప్రారంభం అయ్యింది.

మహీంద్ర కే యు వి 100 ప్రారంభ వీడియో ని వీక్షించండి ;

was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience