• English
  • Login / Register

మహీంద్రా పొందిన ఇటాలియన్ డిజైన్ పినిన్ఫారిన

డిసెంబర్ 16, 2015 01:26 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:మహీంద్రా & మహీంద్రా(M&M) మరియు టెక్ మహీంద్రా వారు సమ్యుక్తంగా ఇటాలియన్ డిజైన్ హౌస్ వారి పినిన్ఫారిన ను ముందుకు తీసుకొచ్చారు. వీరిరువురి యొక్క ప్రపంచ విలువ 16.9 బిలియన్ డాలర్స్ మహీంద్రా గ్రూప్ కి చెందబడి ఉంది. మహీంద్రా వారు ఇప్పుడు ఈ అందుబాటు ద్వారా 85 యేళ్ళ పేరున్న ఫెరారీ కారుని, ఆల్ఫా రోమియో, మసెరాటి మరియు ప్యోగెట్ వాహనాల డిజైన్ సంస్థలో భాగం పొందగలిగారు.

ఇందుకు అధనంగా, టెక్ మహీంద్రా వారు మహీంద్రా & మహీంద్రా వారితో కలిసి 76.06% పినిన్ఫారిన వారి షేర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి పిన్‌కార్ ఎస్.ఆర్.ఐ. వారి అజమాయిషీలో ఉన్నాయి మరియు వీటి ప్రస్తుత విలువ యూరో 1.1/షేర్ గా కలిగి ఉన్నాయి. టెక్ మహీంద్రా మరియు మహీంద్రా & మహీంద్రా వారి ఈ పెట్టుబడి ఒక జాయింట్ వెంచర్ సంస్థ ( JVCo) గా చేయబడుతుంది. ఇంకా ఈ సంస్థ యొక్క అధికారాలు 60% టెక్ మహీంద్రా వారికి మరియు 40% మాహీంద్రా & మహీంద్రా వారికి విభజించబడ్డాయి. ఇంకా ఒక ఓపెన్ ఆఫర్ ద్వారా పినిన్ఫారిన మిగిలియున్న షేర్లను అందించబోతున్నారు. ఇది పిన్‌కార్ వారి షేర్ల ఖరీదు ధర తో కలిగి ఉంటాయి. అధనంగా ఈ కారు యొక్క డిజైన్ మరియు స్టయిలింగ్ కి సంబందించిన హక్కులు మరియు వాటికి సంబంధించిన నిధులు వచ్చే సంవత్సరం 2016 చివరి నాటికి వినియోగించబోతున్నారు. అయితే, పినిన్ఫారిన వారు ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగానే కొనసాగబోతున్నారు. ఈ సంస్థ మిలాన్ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో ఉంది. ఇంకా మిస్టర్.పాలో పినిన్ఫారిన ఈ సంస్థ బోర్డ్ లో చైర్మెన్ గా కొనసాగుతారు.

మిస్టర్. ఆనంద్ మహీంద్రా, చైర్మెన్ మహీంద్రా వారి ప్రకటన ప్రకారం "పినిన్ఫారిన మహీంద్రా కుటుంబంలో కలవబోతోంది. ఇది టెక్ మహీంద్రా వారి ఇంజినీరింగ్ సేవలకు అధికమైన విలువలను చేకూర్చబోతోంది. అధనంగా,ఈ అద్భుతమైన ఉత్తమ శ్రేణి డిజైన్ శ్రేణి కలిగిన పినిన్ఫారిన వారి యొక్క సామర్ధ్య ప్రతిభను మరియు డిజైన్ సమర్ధతను అందించడం ద్వారా మహీంద్రా గ్రూప్ ను ఎంతగానో మెరుగుపరచబోతోంది. ఇంకా, ప్రస్తుత కాలం నాటి వినియోగదారుల యొక్క డిజైన్ పట్ల ఆశక్తి మరియు వారి ఎంపిక ఇంకా అనుభవాలను ఇది మెరుగుపరచడం ద్వారా సంస్థ విజయాలలో దోహదపడబోతోంది. అని ఆయన వివరించారు."

" మన వినియోగదారులు ఎప్పుడూ ఉత్తమ విలువలను కోరుకుంటారు. పినిన్ఫారిన వారి వారసత్వపు డిజైన్ మెళకువలు మన ఇంజినీరింగ్ సామర్ధ్యంతో మేళవించడం ద్వారా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో స్టయింగ్, డిజైన్ మరియు అభివృద్ధి కోణాలలో ఈ సంస్థ బలోపేతం అవ్వబోతోంది. ఇంకా, పినిన్ఫారిన వారు తమ 25 సంవత్సరాల డిజైన్ అనుభవాలు కలిగి ఆటోమొబైల్ రంగంలోనే మా సంస్థకు ఇప్పుడు కొత్త అభివృద్ధి కోణాలని చవి చూపించబోతున్నారు. ఇవి ఏరోస్పేస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్స్ ఇంకా వారి ప్రాధమిక రంగం అయిన ట్రాన్స్పోర్ట్ విభాగాలలో వారి పనితీరు ప్రఖ్యాతమైనది." అని సి.పి. గురాని, సి.ఇ.ఒ మానేజింగ్ డైరెక్టర్, టెక్ మహీంద్రా వివరించారు.

పాలో పినిన్ఫారిన, చైర్మెన్,పినిన్ఫారిన ఎస్.పి.ఎ అదనంగా ఇలా చెప్పారు " ఈ ప్రపంచీకర మార్కెట్ లో పెట్టుబడిదారులు మరియు బిజినెస్ వ్యాపారులకు ప్రత్యేకమైన పాస్‌పోర్ట్ అవసరం లేదేమో. ఇప్పుడు మేము ఒక 3.9 బిలియన్ డాలర్ టెక్నాలజీ మరియు ప్రాపంచిక పార్ట్నర్ ద్వారా చేతులు కలుపుతున్నాము. ఇంకా ఇది 16.9 బిలియన్ డాలర్ ప్రపంచీయ మహీంద్రా గ్రూప్ యొక్క పెట్టుబడిలో భాగం. కనుక, ఇది మా యొక్క ఇటాలియన్ గుర్తింపును ఎంతో బలోపేతం చేస్తుందని నమ్ముతున్నాము. టెక్ మహీంద్రా వారి ప్రాపంచిక పేరు మరియు సామర్ధ్యం ద్వారా మా సంస్థ మరింత ఎక్కువ మార్కెట్ లను మరియు బిజినెస్ ని చేరుకోగలమని భావిస్తున్నాము."

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience