లిమిటెడ్ ఎడిషన్ ఫియట్ పుంటో ఈవో యాక్టివ్ స్పోర్టివో వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం
ఫియట్ గ్రాండే పుంటో కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 28, 2015 02:53 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫియట్ వారు పుంటో ఈవో యాఖ్తివ్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ని స్పోర్టివో పేరిట విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ వాహనం పుంటో దిగువ శ్రేణి కి కొద్దిగా మార్పులు చేర్చి అందించడం జరుగుతుంది. ఇది పండుగ కాలంలో కస్టమర్లను ఆకర్షించేందుకై 10 రోజులలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
కంటపడిన చిత్రాలలో రెడ్ కలర్ తో తెలుపు రంగు పై కప్పు కనపడుతోంది. 15 అంగుళాల అల్లోయ్ వీల్స్, సైడ్-ముందు మరియూ వెనుక వైపు స్పాయిలర్స్, స్పోర్టివో డీకాల్స్, క్రోము ట్రింస్ బాహ్యపు అద్దాలపై కనపడతాయి. లోపలి వైపుఒక 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ తో నావిగేషన్ కి బ్లూటూత్ స్ట్రీమింగ్ జత చేయబడి ఉంటుంది. పైగా, కొత్త సీటు కవర్లు, రేర్ పార్కింగ్ సెన్సర్లు మరియూ ఫియట్ బ్యాడ్జింగ్ డోర్ సిల్స్ ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ పై ఉంటాయి.
ధర విషయంలో ఎటువంటి సమాచారం లేదు కానీ పండుగ కాలం దృష్టిలో పెట్టుకుని అందిస్తారు అని అంచనా.
అబార్త్ పుంటోని రూ.9.95 లక్షల ధరకి అందించినప్పటి నుండి ఫియట్ అందిరి నోటా వినపడుతోంది. ఇది 145 శక్తి విడుదల చేసి, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గుండా ముందు వీల్స్ కి సరఫరా అవుతుంది. ఇంకా 0-100 మార్క్ ని 8.8 సెకనుల్లో చేరుకుంటుంది. ముందు వైపు గ్రిల్లుకి, ముందు బంపర్ ఇంకా వెనుక బంపర్లపై రెడ్ హైలైట్స్ ఉండి, రేస్ స్ట్రిప్పులు బానెట్ పై, రూఫ్ పై, పక్క వైపున కనపడతాయి. కారు అంతటా అబార్త్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.
0 out of 0 found this helpful