• English
    • Login / Register

    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ؚను పొందనున్న నవీకరించబడిన కియా సెల్టోస్

    మే 14, 2023 03:22 pm ansh ద్వారా సవరించబడింది

    • 28 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ కారు తయారీదారు ఎట్టకేలకు కాంపాక్ట్ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించాలని నిర్ణయించారు

    Kia Seltos Facelift Spied

    • టెస్ట్ మోడల్ సన్‌రూఫ్‌తో కనిపించింది, ఈ ఫీచర్ ఉంటుందని నిర్ధారణ అయ్యింది.
    • మునపటి 115PS పవర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో వస్తుందని అంచనా.
    • క్యారెన్స్ కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా రావచ్చు.
    • డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు, హీటెడ్ ఫ్రంట్ సీట్‌లు మరియు ADAS వంటి ఫీచర్‌లను పొందవచ్చు.
    • దీని ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. 

    నవీకరించబడిన కియా సెల్టోస్ టెస్ట్ మోడల్ ఇటీవల కనిపించింది మరియు ఎంతోమంది కియా కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న ఫీచర్ జోడింపు – పనోరమిక్ సన్ؚరూఫ్ؚను ప్రదర్శించింది. ఇది హ్యుందాయ్ క్రెటాలో మొదట పరిచయం చేయబడింది, ప్రస్తుతం మారుతి గ్రాండ్ విటారా వంటి పోటీదారులలో కూడా ఉంది. ప్రస్తుతం, నవీకరించబడిన సెల్టోస్ కూడా భారీ గ్లాస్‌ను అందిస్తుంది.

    ఇతర ఫీచర్‌లు

    2023 Kia Seltos cabin

    నవీకరించబడిన SUVలో ఉండే కొత్త ఫీచర్‌లలో ఒకటి పనోరమిక్ సన్ؚరూఫ్ కావచ్చు, వీటిలో కొన్ని ఫీచర్‌లు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న కియా సెల్టోస్ؚలో అందిస్తున్నారు. ఇండియా-స్పెక్ మోడల్ؚలో  కొద్దిగా సవరించిన డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలతో (డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు టచ్ؚస్క్రీన్ ఇన్ఫోؚటైన్మెంట్), స్లీకర్ AC వెంట్ؚలు మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్‌లను కూడా పొందవచ్చు.

    ఇది కూడా చదవండి: కొత్త ‘ఆరోక్స్’ ఎడిషన్ؚను పొందిన కియా సోనెట్; ధర రూ.11.85 లక్షల నుండి ఉంటుంది

    భద్రత విషయంలో, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా వస్తుందని అంచనా వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ؚలు ఉంటాయి. కాంపాక్ట్ SUVలో మరొక అదనపు ఫీచర్ ADAS ఫంక్షనాలిటీలు, దీని ఫీచర్‌లలో లేన్-కీప్ అసిస్ట్, ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.  

    పవర్ؚట్రెయిన్

    నవీకరించబడిన సెల్టోస్ తన ప్రస్తుత ఇంజన్ ఎంపికలను కొనసాగిస్తుందని అంచనా, ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ (115PS/144Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (115PS/250Nm) ఉన్నాయి. మొదటికి 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్ؚతో జోడించబడుతుంది, రెండవది 6-స్పీడ్‌ల iMTతో లేదా 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది.

    ఇది కూడా చూడండి: నవీకరించబడిన కియా సెల్టోస్ؚలో ఈ కొత్త స్టైలింగ్ ఎలిమెంట్ؚను చూడండి 

    మరొకవైపు, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.5-లీటర్ యూనిట్ (160PS/253Nm) వస్తుంది, దీన్ని నవీకరించబడిన కియా క్యారెన్స్ؚ మరియు కొత్త-జెన్ హ్యుందాయ్ వెర్నాలో కూడా చూడవచ్చు.

    ఆవిష్కరణ, ధర & పోటీదారులు

    2023 Kia Seltos

    నవీకరించబడిన కియా సెల్టోస్ 2023-మధ్య కాలంలో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు, దీని ప్రారంభ ధర రూ.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.

    చిత్రం మూలం

    ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్

    was this article helpful ?

    Write your Comment on Kia సెల్తోస్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience