కొత్త ‘ఆరోక్స్’ ఎడిషన్ؚను పొందిన కియా సోనెట్; ధర రూ.11.85 లక్షలు
కియా సోనేట్ 2020-2024 కోసం tarun ద్వారా మే 14, 2023 03:01 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
లుక్ పరంగా-మెరుగుదలను పొందిన ఈ కొత్త ఎడిషన్ HTX యానివర్సరీ ఎడిషన్ వేరియెంట్‌పై ఆధారాపడింది
-
వంపు గల ముందు భాగం, రేర్ స్కిడ్ ప్లేట్ؚలు మరియు ట్యాంజరిన్ యాక్సెంట్ؚలతో సైడ్ డోర్ క్లాడింగ్‌తో వస్తుంది.
-
ఇంటీరియర్ మరియు ఫీచర్‌ల జాబితాలో ఎటువంటి మార్పులు లేవు.
-
iMT మరియు ఆటోమ్యాటిక్ ఎంపికతో, మునపటి 1-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚలతో కొనసాగుతుంది.
-
ధర HTX వేరియెంట్‌తో పోలిస్తే రూ.40,000 అధికంగా ఉంటుంది.
కియా తన సోనెట్ లైన్అప్ؚలో కొత్త ‘ఆరోక్స్’ ఎడిషన్ؚను హడావుడి లేకుండా ప్రవేశపెట్టింది. ఈ లిమిటెడ్-రన్ ఎడిషన్ ప్రస్తుతం ఉన్న HTX యానివర్సరీ ఎడిషన్ వేరియెంట్‌పై ఆధారపడింది మరియు ధర రూ.11.85 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్).
HTX AE ఆరోక్స్ ఎడిషన్ |
ధర |
టర్బో-iMT |
రూ. 11.85 లక్షలు |
టర్బో-DCT |
రూ. 12.39 లక్షలు |
డీజిల్-iMT |
రూ. 12.65 లక్షలు |
డీజిల్-AT |
రూ. 13.45 లక్షలు |
ఆరోక్స్ ఎడిషన్ యానివర్సరీ ఎడిషన్‌ను ఖచ్చితంగా రీప్లేస్ చేయదు, కానీ ఈ ప్యాకేజీతో రెండవ దాన్ని మాత్రమే పొందగలరు. ఫలితంగా, యానివర్సరీ ఎడిషన్‌తో పోలిస్తే దీని ధర ఎక్కువగా ఉండదు మరియు రూ.11.85 లక్షల నుండి రూ.13.45 లక్షల వరకు ఉంటుంది. HTX వేరియెంట్ؚతో పోలిస్తే దీని ఖరీదు రూ.40,000 ఎక్కువ.
కొత్తగా ఏమి ఉన్నాయి?
ఆరోక్స్ ఎడిషన్ؚలో కేవలం లుక్ పరంగా మార్పులను చూడవచ్చు. ముందు భాగంలో, ట్యాంజరిన్ యాక్సెంట్ؚతో వంపు కలిగిన స్కిడ్ ప్లేట్ డిజైన్ؚను పొందుతుంది. గ్రిల్‌పై ఇతర మోడల్‌లలో ఉన్న ఫినిషిను ఇందులో కూడా చూడవచ్చు అలాగే ప్రత్యేకమైన ‘ఆరోక్స్’ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మునపటి 16-అంగుళాల అలాయ్ వీల్స్ؚతో కానీ ట్యాంజరిన్ వీల్ క్యాప్ సరౌండ్ؚతో వస్తుంది. ట్యాంజరిన్ డోర్ గార్నిష్ؚతో కొత్త స్కిడ్ ప్లేట్ؚతో సైడ్ ప్రొఫైల్ؚను మెరుగుపరిచారు. వెనుక స్కిడ్ ప్లే కూడా రీడిజైన్ؚతో ట్వీక్ చేయబడింది, ఇది ట్యాంజరిన్ యాక్సెంట్ؚను పొందుతుంది.
HTX వేరియెంట్‌ను ఆరు రంగులలో పొందవచ్చు, అయితే ఈ ఎడిషన్ కేవలం నాలుగు ఎంపికలలోనే అందుబాటులో ఉంటుంది– గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, మరియు గ్లేసియర్ వైట్ పర్ల్.
ఇది కూడా చదవండి: స్పై డెబ్యూ చేసిన నవీకరించబడిన కియా సోనెట్; 2024లో భారతదేశంలో విడుదల కానుంది
దీని ఇంటీరియర్ థీమ్ؚకు ఎటువంటి మార్పులూ చేయలేదు, ఇది అదే నలుపు మరియు గోధమ రంగు ఇంటీరియర్ؚను లెదర్ సీట్‌లతో కొనసాగిస్తుంది.
ఫీచర్‌లలో ఏవైనా నవీకరణలు ఉన్నాయా?
(సోనెట్ GTX+ చిత్రం రిఫరెన్స్ కోసం ఉపయోగించబడింది)
సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ؚకు అదనంగా ఎటువంటి ఫీచర్‌లను జోడించలేదు. ఇది LED హెడ్ؚల్యాంప్ؚలు, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటోతో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు యాపిల్ కార్ ప్లే, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, ఆటోమ్యాటిక్ AC, ప్యాడిల్ షిఫ్టర్ؚలు (ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలకు మాత్రమే) ఉంటాయి.
భద్రత విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రేర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
పవర్ؚట్రెయిన్ ఎంపికలు
ఇది కూడా చదవండి: 2022లో అమ్ముడైన కియా సోనెట్ؚలు ప్రతి మూడిటిలో ఒకటి iMT కలిగినవి
సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ 120PS 1-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 115PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ల ఎంపికతో లభిస్తుంది. టర్బో–పెట్రోల్ యూనిట్ؚను 6-స్పీడ్‌ల iMT (మాన్యువల్ లేకుండా క్లచ్) మరియు 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్)తో పొందవచ్చు. డీజిల్ యూనిట్ 6-స్పీడ్‌ల iMT మరియు 6-స్పీడ్‌ల ATతో జత చేయబడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: కియా సోనెట్ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful