ఈ అర్థరాత్రి నుండి ప్రారంభం కానున్న కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ యొక్క బుకింగ్‌లు. మీ k-కోడ్ ను తయారుగా ఉంచుకోండి.
కియా సెల్తోస్ కోసం sonny ద్వారా జూలై 17, 2023 02:19 pm ప్రచురించబడింది
- 5K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అధిక-ప్రాధాన్యతతో డెలివరీ కోసం ఉపయోగపడే k-కోడ్, జూలై 14 న బుకింగ్‌లు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.
-
ఇండియా-స్పెక్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ జూలై 4న విడుదలైంది.
-
25,000 రూపాయల టోకెన్ తో దీని బుకింగ్‌లు జూలై 14 నుండి ప్రారంభం కానున్నాయి.
-
సవరించబడిన స్టైలింగ్ ద్వారా దీనికి మరింత నాజూకైన మరియు ధృడమైన బాహ్య రూపం లభించింది.
-
ఎప్పటికన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లతో, ఇప్పుడు పనోరమిక్ సన్రూఫ్ మరియు ADAS తో లోడ్ చేయబడింది.
-
సరికొత్త సెల్టోస్ ఆగస్టు మధ్య నాటికి ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది, దీని ధరలు రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు జూలై 14 అర్థరాత్రి 12 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. దీనికి భారీ డిమాండ్ ఉంటుందని ఆశిస్తూ, కియా దాని ప్రస్తుత సెల్టోస్ యజమానులకి k-కోడ్ ఆధారంగా వాళ్ళ బుకింగ్‌కు అధిక-ప్రాధాన్యతతో డెలివరీ దక్కించుకునే అవకాశం కల్పించింది. వాళ్ళ డీలర్ల ప్రకారం, 2023 సెల్టోస్ యొక్క బుకింగ్ ధర 25,000 రూపాయలు.
కియా యొక్క k-కోడ్ అంటే ఏమిటి?
అవుట్‌గోయింగ్ సెల్టోస్ ఓనర్‌లు మై కియా యాప్ లేదా కియా ఇండియా వెబ్‌సైట్ ద్వారా K-కోడ్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ కోడ్ ను వారు ఫేస్ లిఫ్టెడ్ సెల్టోస్ ను బుక్ చేసుకునే సమయంలో వాడుకోవచ్చు. ఈ కోడ్ ఒక బుకింగ్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే సరికొత్త సెల్టోస్ యొక్క అధిక-ప్రాధాన్యతతో డెలివరీ కోరుకుంటున్నస్నేహితులు, కుటుంబీకులతో ఈ కోడ్ ను పంచుకోవచ్చు.
గమనిక: ఈ k -కోడ్ జూలై 14 న చేసుకున్న బుకింగ్లకు మాత్రమే వర్తిస్తుంది.
2023 కియా సెల్టోస్ లోని ముఖ్యమైన మార్పులు
2019 లో విడుదలైనప్పటి నుండి సెల్టోస్ కాంపాక్ట్ SUV కి దాని మొదటి ఫేస్లిఫ్ట్ తో కూడిన సంపూర్ణ నవీకరణను ఇప్పుడు పొందుతుంది. దీని యొక్క బాహ్య రూపకల్పనలో పెద్ద గ్రిల్, పొడవైన LED DRLలు, సంబంధిత LED టెయిల్‌ల్యాంప్‌లు మరియు ధృడమైన బంపర్లతో పాటు సమర్థవంతమైన ఇతర చిన్న చిన్న మార్పులు వచ్చాయి.


కియా ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ ఇంటీరియర్‌కి సంబంధించిన అప్‌డేట్ల కారణంగా కియా మరింత పటిష్టంగా మారింది. ఇది రెండు 10.25-అంగుళాల డిస్ప్లేలతో (ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం ఒకటి)కూడిన సరికొత్త ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో సరికొత్త డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ పానెల్ మరియు పనోరమిక్ సన్రూఫ్ కూడా ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి ఫీచర్లకి అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ (ADAS)ను అమర్చడం వలన ఈ కాంపాక్ట్ SUV భద్రత విషయంలో మరింత పటిష్టం అయ్యింది.
ఇదీ చదవండి: బహిర్గతం అయిన కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ యొక్క వేరియంట్ల వారీ ఫీచర్లు
సుపరిచితమైన పవర్ ట్రైన్స్
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ మూడు 1.5 లీటర్ల ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ ఇప్పటికీ డీజిల్ ఇంజిన్ ఎంపికను అందిస్తున్న రెండు కాంపాక్ట్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇది ఔట్గోయింగ్ మోడల్ యొక్క పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా కొనసాగిస్తోంది. ఈ బ్రాండ్ యొక్క 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కేరెన్స్ MPV నుండి 2023 సెల్టోస్ అందిపుచ్చుకుంది. అయితే ప్రతి ఇంజిన్ కు దాని యొక్క ప్రత్యేకమైన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక లభిస్తుంది. అలాగే పెట్రోల్ ఇంజిన్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్ ఎంపికను అందిస్తుంది, కాగా మిగితా రెండు మాత్రం కియా యొక్క IMT తో అందుబాటులోకి వస్తాయి. (మాన్యువల్ క్లచ్ పెడల్ లేకుండా).
ప్రారంభ తేదీ అంచనా మరియు ధరలు:
సరికొత్త కియా సెల్టోస్ 11 లక్షల ఎక్స్ షోరూం ధరతో మొదలుకుని ఆగస్టు నెలలో విడుదల కానుందని అంచనా. సరికొత్త డిజైన్ తో మరియు మునుపటికన్నా ఎక్కువ ఫీచర్లతో వచ్చిన కియా సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా,మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, టయోటాహైరైడర్, MG ఆస్టర్ మరియు రానున్న SUV లైన హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ లకు గట్టి పోటీదారు.
ఇక్కడ మరింత చదవండి: సెల్టోస్ డీజిల్