• English
  • Login / Register

కియా కె-కోడ్ؚతో కొత్త కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚను వేగంగా ఇలా పొందవచ్చు

కియా సెల్తోస్ కోసం ansh ద్వారా జూలై 12, 2023 11:12 pm ప్రచురించబడింది

  • 141 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పటికే కియా సెల్టోస్ؚను కొనుగోలు చేసిన వారి నుండి కూడా మీరు కె-కోడ్ؚను పొందవచ్చు

2023 Kia Seltos

నవీకరించిన కియా సెల్టోస్ ఇండియా-స్పెక్ డిజైన్ మరియు ఫీచర్‌ల జాబితాలో అనేక అప్ؚగ్రేడ్ؚలతో ఇటీవల విడుదల అయ్యింది. ఈ కారు తయారీదారు జూలై 14 నుండి ఆర్డర్ؚలను తీసుకోవడం ప్రారంభించనున్నాను, డిమాండ్ అధికంగా ఉండవచ్చన్న అంచనాతో, మునపటి మోడల్ సెల్టోస్ؚను కలిగి ఉన్న వారికి బహుమతిగా కియా కె-కోడ్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

కె-కోడ్ అంటే ఏమిటి?

2023 Kia Seltos

కె-కోడ్ అనేది కియా వెబ్‌సైట్‌లో జనరేట్ చేయగలిగే ఒక ప్రత్యేకమైన కోడ్. ప్రస్తుతం మీరు సెల్టోస్ యజమాని అయినా లేదా ఈ కాంపాక్ట్ SUV యజమాని ఎవరైనా మీకు తెలిసిన, ఈ కె-కోడ్ؚను పొందగలరు. సెకండ్-హ్యాండ్ కియా సెల్టోస్ యజమానులు కూడా ఈ కె-కోడ్ ప్రయోజనాలను పొందగలరు. కె-కోడ్ పొందిన తరువాత మీరు దాన్ని ఉపయోగించి జూలై 14వ తేదీన బుకింగ్ చేసుకోవాలి. 

ప్రయోజనాలు 

2023 Kia Seltos

మీరు కె-కోడ్‌తో బుకింగ్ చేస్తే, ఈ వాహనాన్ని అధిక-ప్రాధాన్యతతో డెలివరీ పొందవచ్చు. అంటే, నవీకరించిన సెల్టోస్ؚను కె-కోడ్ లేకుండా బుక్ చేసుకున్న వారి కంటే మీరు వాహనాన్ని త్వరగా పొందవచ్చు; మీరు నివసించే నగరాన్ని బట్టి వేచి ఉండే సమయం 3 నుండి 4 నెలలను సులభంగా మించవచ్చు. ఈ కార్యక్రమం, ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ కియా సెల్టోస్ؚను కలిగి ఉన్న యజమానులు, నవీకరించిన వాహనానికి వేగంగా అప్ؚగ్రేడ్ అవడంలో లేదా వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కియా బ్రాండ్ؚలోؚ భాగం అవ్వడంలో సహాయపడుతుంది. 

2023 సెల్టోస్ ఏం అందిస్తుంది

డిజైన్

2023 Kia Seltos Rear
2023 Kia Seltos Side

నవీకరించిన కియా సెల్టోస్ చిన్నవే అయినా ముఖ్యమైన డిజైన్ మార్పులను పొందింది, ఈ మార్పులు పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఉండేలా ఉంచుతుంది. రీడిజైన్ చేసిన ముందు గ్రిల్, సవరించిన బంపర్ మరియు కొత్త LED DRLల సెట్ ఇందులో వస్తాయి. సైడ్ ప్రొఫైల్ దాదాపుగా ఇంతకు ముందులాగే ఉంటుంది, 18-అంగుళాల అలాయ్ వీల్స్ X-లైన్ వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం కాకుండా అన్నీ వేరియంట్‌లలో అందిస్తున్నారు. వెనుక భాగంలో, 2023 సెల్టోస్ LED టెయిల్ ల్యాంపుల సెట్ؚను పొందింది మరియు GT లైన్ మరియు X-లైన్ వేరియెంట్ؚలలో బంపర్ కొత్త డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ సెట్ؚఅప్ డిజైన్‌తో వస్తుంది. 

పవర్ؚట్రెయిన్

2023 Kia Seltos Engine

నవీకరించిన కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది; 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమ్యాటిక్ؚతో జోడించిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (115PS/144Nm), iMT లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ؚతో జోడించబడిన 1.5-లీటర్ డీజిల్ (116PS/250Nm) ఇంజన్.

ఇది కూడా చూడండి: చిత్రాల పోలిక: కొత్త కియా సెల్టోస్ Vs పాతది

ఈ కారు తయారీదారు క్యారెన్స్ నుండి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (160PS/253Nm) పెట్రోల్ ఇంజన్ؚను కూడా జోడించారు, ఇది 5-స్పీడ్ iMT (క్లచ్ؚరహిత మాన్యువల్) లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్ؚతో (DCT) వస్తుంది.

ఫీచర్ లు & భద్రత

2023 Kia Seltos Cabin

2023 సెల్టోస్ؚ డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల స్క్రీన్ؚలు (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ఆంబియెంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లతో వస్తుంది.

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ ఫీచర్‌ల వెల్లడి 

భద్రత ఫీచర్‌ల పరంగా ఇది భారీ మార్పులను పొందింది. నవీకరించిన సెల్టోస్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్-కొలిజన్ వార్నింగ్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్‌లతో వస్తుంది. ఇతర ఫీచర్‌లలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి.

ధర & పోటీదారులు

2023 Kia Seltos X-Line

2023 కియా సెల్టోస్ ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా, దీని విడుదల ఆగస్ట్ మధ్యలో ఉండవచ్చు. ఇది హ్యుందాయ్ క్రెటా, వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా మరియు MG ఆస్టర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది మరియు రాబోయే హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚతో కూడా దీనికి పోటీ ఉంటుంది. 

ఇక్కడ మరింత చదవండి : సెల్టోస్ డీజిల్ 

was this article helpful ?

Write your Comment on Kia సెల్తోస్

explore మరిన్ని on కియా సెల్తోస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience