మారుతి జిమ్నీ, మారుతి జిప్సీ మధ్య కీలకమైన తేడాలు
మారుతి జిమ్ని కోసం ansh ద్వారా జనవరి 30, 2023 11:04 am ప్రచురించబడింది
- 73 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిలిపివేసిన మారుతి జిప్సీతో పోలిస్తే జిమ్నీ ఎలా ఉంటుందో పరిశీలిద్దాము
ఆటో ఎక్స్ؚపో 2023లో మారుతి తన నాలుగవ-తరం జిమ్నీని భారతదేశంలో ప్రవేశపెట్టింది, జిమ్నీతో ఈ కారు తయారీదారు దేశానికి ఒక కొత్త వాహనాన్ని అందించింది. ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న మహీంద్ర థార్, ఫోర్ గూర్ఖాలతో దీన్ని పోలుస్తున్నప్పటికీ దీన్ని రెండవ-తరం వాహనం అయిన మారుతి జిప్సీతో కూడా పోల్చిచూడటాని మేము పరిగణించాము. ఈ విషయంలో అవగాహన లేని వారి కోసం ఇది తెలియచేస్తున్నాం, జిప్సీ అనేది ప్రధానంగా రెండవ తరం గ్లోబల్ జిమ్నీ యొక్క పేరు మార్చి పొడిగించిన వర్షన్.
ఇది కూడా చూడండి: మారుతి జిమ్నీ బేస్-స్పెక్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ మొదటి లుక్
కొలతలతో మొదలుపెట్టి, రెండు వాహనాల మధ్య ఐదు ముఖ్యమైన తేడాలు ఇక్కడ అందించబడింది:
కొలతలు
కొలతలు |
మారుతి జిమ్నీ |
మారుతి జిప్సీ |
తేడా |
పొడవు |
3.98మిమీ |
4.010మిమీ |
25మిమీ |
వెడల్పు |
1.64మిమీ |
1.540మిమీ |
-105మిమీ |
ఎత్తు |
1.720మిమీ |
1.845మిమీ/1.875మిమీ |
-155మిమీ |
వీల్ؚబేస్ |
2.590మిమీ |
2.375మిమీ |
215మిమీ |
జిమ్నీ ఐదు-డోర్‌ల SUV అయినప్పటికీ జిప్సీ కంటే కొద్దిగా చిన్నది, కానీ పొడవైన వీల్ؚబేస్ؚను కలిగి ఉంది. జిమ్నీ, జిప్సీ కంటే 155మిమీ వరకు చిన్నగా ఉంటుంది కానీ లోపలి భాగంలో మరింత సౌకర్యవంతమైన స్థలాన్ని అందిస్తూ 105మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉంది.
డిజైన్
కొత్త జిమ్నీ ఆధునిక లుక్‌లో, జిప్సీతో సహా దాని మునపటి వర్షన్ؚల లుక్‌ను కొంత మేరకు కలిగి ఉంది. ఉదాహరణకు- జిమ్నీ గ్రిల్, జిప్సీలో(రెండవ-తరం జిమ్నీ) ఉన్న నిలువు చీలికలతో ప్రేరణ పొందింది. అంతేకాకుండా, ప్రారంభం నుండే జిమ్నీ డిజైన్ؚలో గుండ్రని హెడ్ؚల్యాంప్ؚలు కూడా భాగంగా ఉన్నాయి, కానీ హాలోజెన్ నుండి LED ప్రొజెక్టర్‌లుగా ఆధునీకరించబడ్డాయి.
పక్క వైపున, జిప్సీలో ఉండే విధంగా బొనేట్‌పై అడ్డంగా ఉన్న చీలికలను చూడవచ్చు. కానీ పక్క వైపు కనిపించే పెద్ద తేడా ఏమిటంటే, చరిత్రలోనే మొదటిసారిగా అదనపు డోర్ సెట్ؚను కలిగి ఉండటం. వెనుక వైపున టెయిల్ ల్యాంప్ؚలను వెనుక బంపర్ؚలో అమర్చబడ్డాయి, ఇవి కూడా జిప్సీ నుంచి ప్రేరణ పొందినవే. ఇక్కడ ప్రధాన తేడాలు చూస్తే అదనపు వీల్ అమరిక, రెండు వాహనాల మధ్య ఎత్తులో స్పష్టంగా కనిపించే తేడా ఇది జిమ్నీ కంటే జిప్సీని ఎత్తైనదిగా నిలుపుతుంది.
రెండిటి మధ్య మరొక ముఖ్యమైన తేడా ఏమిటంటే జిప్సీ మృదువైన టాప్‌తో, హార్డ్ ప్లాస్టిక్ టాప్ రూఫ్ ఎంపికతో వస్తుంది, కానీ జిమ్నీ దృడమైన లోహపు టాప్ రూఫ్ؚతో మాత్రమే వస్తుంది.
పవర్ؚట్రెయిన్
స్పెసిఫికేషన్ؚలు |
మారుతి జిమ్నీ |
మారుతి జిప్సీ |
ఇంజన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
1.3-లీటర్ పెట్రోల్ |
పవర్ |
105PS |
81PS |
టార్క్ |
134.2Nm |
103Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ MT/4-స్పీడ్ల AT |
5-స్పీడ్ MT |
డ్రైవ్ؚట్రెయిన్ |
నాలుగు-వీల్-డ్రైవ్ |
నాలుగు-వీల్-డ్రైవ్ |
వాహన బరువు |
1210కిలోల వరకు |
1020కిలోల వరకు |
స్పెసిఫికేషన్ؚల విషయంలో జిమ్నీ- జిప్సీ కంటే చాలా మెరుగ్గా ఉంది. అధిక అవుట్ؚపుట్ గణాంకాలతో మెరుగైన పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంది. జిమ్నీ మాన్యువల్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ రెండిటి ఎంపిక కలిగి ఉంది, కానీ జిప్సీ కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో అందుబాటులో ఉండేది. రెండు వాహనాలు తక్కువ నిష్పత్తి గల గేర్ బాక్స్ؚతో ఫోర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚను అందిస్తాయి.
ప్రాథమిక ఫీచర్ؚలు
జిప్సీ 2018లో నిలిపివేయబడింది, కాబట్టి ఫీచర్‌ల విషయంలో జిమ్నీ జిప్సీని ఓడిస్తుంది అనడంలో సందేహం లేదు. చెప్పాలంటే జిమ్నీ తొమ్మిది-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ARKAMYS-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ؚగా సవరించగలిగే, ఫోల్డబుల్ ORVMలు, క్రూయిజ్ కంట్రోల్ؚ మరికొన్నిటితో వస్తుంది. ఇంకో వైపు, జిప్సీలో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యాబ్రిక్ అప్ؚహోల్ؚస్ట్రీ, సవరించగలిగిన హెడ్ రిస్ట్రెయింట్ؚలు మరియు ఫోల్డబుల్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉన్నాయి.
వెనుక సీట్‌లు మరియు డోర్‌లు
రెండు SUVలు వెనుక భాగంలో బెంచ్ సీట్‌లను కలిగి ఉన్నాయి, కానీ భిన్నమైన లేఅవుట్ؚతో ఉంటాయి. జిమ్నీ వెనుక బెంచ్ؚ ముందు వైపు కూర్చునే విధంగా ఉంటాయి, ఇందులో ఇద్దరు ప్రయాణీకులు కూర్చోవచ్చు. జిప్సీ వెనుక బెంచ్ ఎదురు ఎదురుగా కూర్చునే విధంగా ఉంటుంది, ప్రతి సీట్ؚలో కనీసం ఇద్దరు ప్రయాణీకులు కూర్చోవచ్చు, అందువలన జిప్సీ ఆరుగురు ప్రయాణీకులు తేలికగా కూర్చోగలిగే సామర్ధ్యం ఉంటుంది.
జిప్సీతో పోలిస్తే జిమ్నీలో ఉన్న ప్రధానమైన ప్రయోజనం వాటి వెనుక డోర్‌లు. ఈ డోర్‌లు ప్రయాణీకులకు వెనుక సీట్లలో ప్రవేశించడానికి మరితంత సులభంగా ఉంటాయి.
సంబంధించినవి: మారుతి, ఒక వారం కంటే తక్కువ వ్యవధిలో జిమ్నీ కోసం 5000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకుంది
రెండు మారుతి వాహనాల మధ్య ప్రధానమైన తేడాలు ఇవి. జిమ్నీ రంగప్రవేశంతో, ఈ కారు తయారీదారు, మహీంద్ర వాహనాలు ఆధిపత్యం వహిస్తున్న విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. మారుతి జిమ్నీని త్వరలోనే మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుంది, రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి దీని ధర ప్రారంభం కావచ్చు, ఇది మహీంద్ర థార్ؚతో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful