వారం కంటే తక్కువ రోజులలో, జిమ్నీ కోసం 5,000కు పైగా బుకింగ్ؚలను అందుకున్న మారుతి
మారుతి జిమ్ని కోసం sonny ద్వారా జనవరి 23, 2023 12:37 pm సవరించబడింది
- 46 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
4WD ప్రమాణంతో, ఆటో ఎక్స్ؚపో 2023లో జిమ్నీ మొదటిసారిగా ప్రదర్శించబడింది.
-
జిమ్నీ భారతదేశంలో ఐదు-డోర్‌ల వేరియంట్‌తో వస్తుంది.
-
ప్రవేశపెట్టినప్పటి నుంచి INR.25,000కు బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
-
డెబ్యూ-స్పెసిఫికేషన్ కేవలం రెండు ఫీచర్‌లు కలిగిన వేరియంట్ؚలలోనే అందించబడుతుంది.
-
జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ వేరియెంట్ؚ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚ ఎంపికలతో వస్తుంది.
-
Rs.10 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) ఏప్రిల్ 2023 నాటికి మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.
ఆటో ఎక్స్‌పో 2023లో, ఐదు-డోర్‌ల వర్షన్ గల మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా ప్రదర్శించబడి, అదే రోజు నుండి బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. బుకింగ్‌లు తెరుచుకున్న వారంలోపే 5000 కంటే ఎక్కువ మంది జిమ్నీ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
4X4 డ్రైవ్ؚట్రైన్ ప్రమాణంతో, తక్కువ రేంజ్ గల ట్రాన్స్ؚఫర్ కేస్ؚతో జిమ్నీ డెబ్యూ-స్పెసిఫికేషన్ కేవలం రెండు వేరియెంట్‌లలో మాత్రమే అందించబడుతుంది. ఐదు-స్పీడ్‌ల మాన్యువల్, నాలుగు-స్పీడ్‌ల ఆటోమాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚ ఎంపికలతో, జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంది. ఇంజన్ ఔట్ؚపుట్ 105PS మరియు 134Nmగా రేట్ చేయబడింది, ఇది 1,200 కిలోల బరువు గల వాహనానికి సరిపోతుంది.
సంబంధించినది: ఈ 20 చిత్రాలలో మారుతి జిమ్నీని వివరంగా చూడండి
మారుతి జిమ్నీ ఇప్పుడు ఐదు డోర్‌లతో వస్తుంది, కానీ నాలుగు మీటర్‌ల కంటే తక్కువ ఎత్తు గల వాహనం గానే మిగిలింది. జిమ్నీ ఇప్పటికీ నాలుగు-సీట్‌లు కలిగిన వాహనమే కానీ పొడగించగల దాని పొడవు, వీల్ؚబేస్ వెనుక భాగంలో ఎక్కువ లెగ్ రూమ్ؚ, 208 లీటర్ల లగేజ్ సామర్ధ్యం కలిగిన ఉపయోగకరమైన బూట్ స్పేస్‌ను ఇస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే, జిమ్నీ తన డెబ్యూ స్పెసిఫికేషన్‌తో వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగులు, రేర్ వ్యూ కెమెరా, పవర్ విండోలు, గేజ్ క్లస్టర్ؚలో TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటి అనేక ప్రమాణలతో వస్తుంది. టాప్ వేరియంట్ మారుతి ఆధునిక తొమ్మిది-అంగుళాల ఇన్ఫోؚటైన్ؚమెంట్ టచ్ స్క్రీన్ యూనిట్, ఆటో ఏసి, క్రూయిజ్ కంట్రోల్, వాషర్‌లతో ఆటో LED హెడ్ ల్యాంప్ؚలు మరియు అలాయ్ వీల్స్ؚతో వస్తుంది.
ఇది కూడా చదవండి: మారుతి జీమ్నీ ప్రతి వేరియంట్‌లో అందిస్తున్న అంశాలను ఇక్కడ ఇవ్వబడ్డాయి
మారుతి జీమ్నీ మూడు-డోర్‌ల మహీంద్ర థార్ؚతో భిన్నమైన రీతిలో పోటీ పడుతుంది. జీమ్నీ బుకింగ్ؚలు ప్రస్తుతం Rs.25,000 డిపాజిట్ؚతో నెక్సా ప్రారంభించింది. Rs.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో జీమ్నీ మార్చి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.
0 out of 0 found this helpful