మారుతి జిమ్నీ బేస్-స్పెక్ ఆటోమ్యాటిక్ వేరియంట్ ఫస్ట్ లుక్

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా జనవరి 24, 2023 02:53 pm ప్రచురించబడింది

  • 59 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ వాహనం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, రెండిటిలో మాన్యువల్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక ఉంది.

Maruti Jimny Zeta Automatic Variant

మారుతి సుజుకి జిమ్నీ రానే వచ్చేసింది, ఈ బ్రాండ్ వాహనం ఇప్పటికే దాదాపుగా 10,000 బుకింగ్ؚలను అందుకుంది. ఈ ఐదు-డోర్ؚల జిమ్నీ 105PS 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు నాలుగు-స్పీడ్‌ల ఆటోమాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో అందిస్తున్నారు. తక్కువ రేంజ్ గేర్ బాక్స్ؚతో నాలుగు-చక్రాల డ్రైవ్(4WD) దీనిలో ప్రామాణికం.

జిమ్నీ జిటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించిన టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్ؚను ఇప్పటికే మనం చూశాము, ఇప్పుడు బేస్-స్పెక్ అయిన జెటా వేరియెంట్, లోపల మరియు వెలుపల భాగం ఎలా ఉందో చూద్దాము. 

వెలుపలి భాగం

Maruti Jimny Zeta Automatic Variant

ముందుగా, గ్రిల్‌పై క్రోమ్ ఎలిమెంట్‌లు ప్రామాణికంగా చూడవచ్చు, కానీ టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్ؚలో ఉన్న LED యూనిట్‌లకు బదులుగా ఈ వేరియెంట్ హాలోజెన్ హెడ్ؚల్యాంపులు అందించారు. అంతేకాకుండా హెడ్ؚల్యాంప్ వాషర్, ఫాగ్ ల్యాంప్ؚలు కూడా జెటా వేరియెంట్ؚలో ఉండవు.

ఇది కూడా చదవండి: ఈ 20 చిత్రాలలో మారుతి జిమ్నీని వివరంగా చూడండి

Maruti Jimny Zeta Automatic Variant

ప్రొఫైల్ؚలో, అలాయ్ వీల్స్ؚకు బదులుగా 15 అంగుళాల స్టీల్ వీల్స్‌తో వస్తున్నందున జిమ్నీ బేస్-స్పెక్ వేరియెంట్ؚను తేలికగా గుర్తించవచ్చు. ఈ వేరియెంట్ వెనుక భాగం టాప్-స్పెక్ వేరియెంట్ؚలాగే కనిపిస్తుంది, కానీ వివరంగా చూస్తే కీలెస్ ఎంట్రీ బటన్ ఇందులో లేదని గమనించవచ్చు. 

​​​​​​​లోపలి భాగం

Maruti Jimny Zeta Automatic Variant

దీని పూర్తి నలుపు క్యాబిన్, టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్ క్యాబిన్ؚలాగే కనిపిస్తుంది కానీ కొన్ని ఫీచర్‌లు ఇందులో అందించలేదు. జిమ్నీ జెటా వేరియెంట్ؚలో టాప్-ఎండ్ వేరియెంట్ؚలో ఉన్న తొమ్మిది- అంగుళాల యూనిట్ కంటే చిన్నదైన ఏడు-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ ఉంది. ఈ వేరియెంట్‌లో అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ؚప్లే ఉన్నప్పటికీ వైర్ؚలెస్ కనెక్టివిటీ మాత్రం ఉండదు. 

ఆల్ఫా వేరియెంట్ؚలో ఉన్న క్రూయిజ్ కంట్రోల్ బటన్ స్టార్ట్-స్టాప్, ఆటో AC సౌకర్యాలు బేస్ వేరియెంట్ؚలో ఉండవు. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా, ESP, హిల్ హోల్డ్/డిసెంట్ కంట్రోల్ వంటి భద్రత కిట్ؚలు ఈ వేరియెంట్ జిమ్నీలో ఉన్నాయి. బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ ప్రామాణికంగా ఉంది. 

Maruti Jimny Zeta Automatic Variant

ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ ప్రతి వేరియెంట్ అందిస్తున్న అంశాలను ఇక్కడ ఇవ్వబడ్డాయి.

బుక్ చేసుకునేందుకు రూ.11,0000కు అందుబాటులో ఉన్న ఐదు-డోర్‌ల జిమ్నీని మారుతి సుమారు రూ.10 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తుందని ఆశిస్తున్నాము. ఇది మార్చి నెలలో లాంచ్ అవుతుంది, ఈ SUV భారీ మహింద్రా థార్ వాహనంతో పోటీ పడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి జిమ్ని

Read Full News

explore మరిన్ని on మారుతి జిమ్ని

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience