• English
  • Login / Register

రూ.33.41 లక్షల ప్రారంభ ధరతో, 2 కొత్త మెరిడియన్ ప్రత్యేక ఎడిషన్‌లను తీసుకువస్తున్న జీప్

జీప్ మెరిడియన్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 12, 2023 06:43 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

లుక్ పరంగా మార్పులతో మరియు కొన్ని కొత్త ఫీచర్‌లతో మెరిడియన్ అప్ؚల్యాండ్ మరియు మెరిడియన్ X త్వరలోనే రానున్నాయి

Jeep Rolls Out 2 New Special Editions For Meridian, Prices Start At Rs 33.41 Lakh

  • అప్ؚల్యాండ్ ఎడిషన్ؚలో సన్ؚషేడ్ؚలు, కార్గో మ్యాట్ؚలు, టైర్ ఇన్ؚఫ్లేటర్ؚతో పాటు రూఫ్ క్యారియర్ మరియు సైడ్ స్టెప్ؚలు ఉన్నాయి. 

  • మెరిడియన్ Xలో బూడిద రంగు రూఫ్, బూడిద రంగు పాకెట్స్ؚతో అలాయ్ వీల్స్ మరియు ఆంబియెంట్ లైటింగ్ؚను అందిస్తుంది. 

  • ఈ ప్రత్యేకమైన ఎడిషన్‌లు రెండు కొత్త రంగు ఎంపికలలో అందిస్తున్నారు: సిల్వరీ మూన్ మరియు గ్యాలక్సీ బ్లూ. 

  • మెరిడియన్ ధరలు రూ.32.95 లక్షల నుండి ప్రారంభం అవుతాయి (ఎక్స్-షోరూమ్). 

మెరిడియన్ SUV రెండు ప్రత్యేక ఎడిషన్‌లను జీప్ ప్రవేశపెట్టింది, ఇవి “అప్‌ల్యాండ్” మరియు “X”. ఈ ప్రత్యేక ఎడిషన్‌లు లుక్ పరంగా తేలికపాటి మార్పులు, కొత్త రంగు ఎంపికలు మరియు అదనపు ఫీచర్‌లతో వస్తున్నాయి. ఈ ఎడిషన్‌ల వేరియెంట్-వారీ ధరలు ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ వీటి బుకింగ్ؚలు ప్రారంభం అయ్యాయి. 

ధరలు

Jeep Meridian

ఎంచుకున్న వేరియెంట్‌లపై ఆధారపడి, ఈ ప్రత్యేక ఎడిషన్‌ల ధర రూ.33.41 లక్షల నుండి రూ.38.46 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ల ధరలు ఎంచుకునే యాక్సెసరీల ఆధారంగా మారతాయి. 

కొత్తగా ఏం అందిస్తున్నారు

Jeep Meridian X Special Edition

మెరిడియన్ X ప్రత్యేక ఎడిషన్ నగర జీవన శైలికి అనుగుణంగా ఉండేలా మరియు కొత్త సిల్వరీ బూడిద రంగు ఎంపికలో బూడిద రంగు రూఫ్, బూడిద రంగు పాకెట్స్ؚతో అలాయ్ వీల్స్, సైడ్ మౌల్డింగ్ؚలు మరియు పుడ్డిల్ ల్యాంప్ؚలతో అందిస్తున్నారు. 

Jeep Meridian Upland Special Edition

మెరిడియన్ అప్‌ల్యాండ్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు అనుకూలంగా ఉండేలా గ్యాలక్సీ బ్లూ రంగులో వస్తుంది. ఇందులో రూఫ్ క్యారియర్, స్ప్లాష్ గార్డ్ؚలు, బూట్ ఆర్గనైజర్, సన్‌షేడ్ؚలు, కార్గో మ్యాట్ؚలు మరియు టైర్ ఇన్‌ఫ్లేటర్ ఉంటాయి. అప్‌ల్యాండ్ ఎడిషన్ కవర్‌పై స్టికర్‌ను కూడా పొందింది. ఈ రెండు ప్రత్యేక ఎడిషన్ؚలలో సైడ్ స్టెప్ؚలు, యంబియంట్ లైటింగ్ మరియు విభిన్నంగా రూపొందించిన ఫ్లోర్ మ్యాట్ؚలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: తమ ఆఫ్-రోడ్ సాహసాలలో మరింత సాంకేతికతను కోరుకునే వారికి ఈ నవీకరించబడిన జీప్ రాంగ్లర్ సరైన వాహనం

ఈ ప్రత్యేక ఎడిషన్ؚల కొనుగోలుదారుల కోసం కారు తయారీదారు 11.6-అంగుళాల వెనుక స్క్రీన్ؚను సగం ధరకే అందిస్తున్నారు. 

ప్రస్తుత ఫీచర్‌లు

Jeep Meridian Cabin

ప్రామాణిక మెరిడియన్ 10.1-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బహుళ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ؚరూఫ్, రిక్లైనబుల్ రెండవ మరియు మూడవ వరుస సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, మరియు తొమ్మిది-స్పీకర్‌ల ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ؚతో వస్తుంది. 

భద్రత పరంగా ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది. 

పవర్‌ట్రెయిన్ 

Jeep Meridian Engine

170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను అందించే బి‌ఎస్6 ఫేజ్ 2కు అనుగుణంగా ఉండే 2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఈ SUVలో ఉంది. ఈ యూనిట్ 6-స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 9-స్పీడ్‌ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది. ఈ మెరిడియన్ 4X2 మరియు 4X4 డ్రైవ్ ట్రెయిన్ؚలను పొందుతుంది. 

ధర & పోటీదారులు

Jeep Meridian

ఈ ప్రత్యేక ఎడిషన్ ధరల ప్రస్తుతం వెల్లడించకపోయిన, ప్రామాణిక మెరిడియన్ కంటే వీటి ధర అధికంగా ఉంటాయని భావిస్తున్నాము. ప్రామాణిక మెరిడియన్ ధర రూ.32.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. జీప్ మెరిడియన్ టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్ మరియు MG గ్లోస్టర్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: జీప్ మెరిడియన్ డీజిల్ 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Jeep మెరిడియన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience