తమ ఆఫ్-రోడ్ సాహసాలలో మరింత సాంకేతికతను కోరుకునే వారికి ఈ నవీకరించబడిన జీప్ రాంగ్లర్ సరైన వాహనం
జీప్ రాంగ్లర్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 07, 2023 04:22 pm ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ నవీకరణతో, రాంగ్లర్ 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు 12-వే పవర్డ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్‌లతో సహా లుక్ మరియు ఫంక్షనల్ పరంగా అనేక ఫీచర్‌లను పొందింది
సరికొత్త నవీకరణాలతో జీప్ రాంగ్లర్ؚను అమెరికన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ మార్పులు అధికంగా లుక్ పరంగా ఉన్నాయని చెప్పవచ్చు, క్యాబిన్ మరియు ఫీచర్ జాబితాకు తేలికపాటి మార్పులను చూడవచ్చు.
దాన్ని చూస్తూ ఉండిపోతారు
జీప్, రాంగ్లర్ రూబికన్ 20వ వార్షిక ఎడిషన్ؚతో మొదటి సారిగా పరిచయం చేసిన అప్‌డేట్ చేసిన ఏడు-స్లాట్‌ల గ్రిల్ؚను (సన్నని మరియు నలుపు రంగు-టెక్స్ؚచర్ స్లాట్‌లు) నవీకరించబడిన రాంగ్లర్‌కు అందించింది. ఆఫ్-రోడ్ ఆధారిత రూబికన్ వేరియెంట్‌లలో, ఈ గ్రిల్ ముందు బంపర్‌పై ఫ్యాక్టరీలో అమర్చగల వించ్ؚను (సుమారు 3.650 కిలోల టోయింగ్ సామర్ధ్యంతో) జోడించే వీలు కల్పిస్తుంది. వాహనం నడిపే సమయంలో చెట్లలో చిక్కుకోవడాన్ని నివారించడానికి ముందు విండ్ షీల్డ్ؚతో అమర్చిన యాంటెనా కూడా ఉంది.
ఈ సరికొత్త అప్ؚడేట్ؚతో, ప్రామాణిక రాంగ్లర్‌లో 17 నుండి 20 అంగుళాల వరకు మరియు రూబికన్ వెర్షన్‌లో 32 నుండి 35 అంగుళాల వరకు కొత్త టైర్ సైజులను కూడా తీసుకువచ్చింది. కొత్త సాఫ్ట్-టాప్ (ప్రామాణికంగా) రెండు హార్డ్ టాప్ؚలు మరియు విడదీయగలిగే రెండు డోర్‌ల గ్రూప్ؚతో సహా ఎంచుకునేందుకు అనేక టాప్, డోర్ మరియు విండ్ షీల్డ్ కాంబినేషన్‌లను జీప్ అందిస్తోంది.
మరింత ఆధునిక క్యాబిన్
ఈ నవీకరణతో, రాంగ్లర్ క్యాబిన్ؚలో ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ చుట్టూ కాంట్రాస్ట్ స్టిచింగ్ؚతో మెత్తని మెటీరియల్స్ؚను, నప్ప లెదర్ సీట్‌లను పొందింది. డ్యాష్ؚబోర్డ్ కూడా అప్ؚగ్రేడ్ؚను పొందింది, భారీ టచ్ؚస్క్రీన్‌ను అమర్చడానికి వీలు కల్పించేందుకు, ఇంతకు ముందు ఉన్న గుండ్రని సెంట్రల్ AC వెంట్‌లకు బదులుగా ప్రస్తుతం నాజూకైన సమాంతర యూనిట్‌లను అమర్చారు. క్యాబిన్ చుట్టూ మరిన్ని సౌండ్-ప్రూఫింగ్ మెటీరియల్స్ؚను ఉపయోగించి ఈ SUV రైడ్ మరింత నిశ్శబ్దంగా ఉండేలా జీప్ నిర్ధారించింది.
ఏడు USB టైప్-A మరియు టైప్-C ఛార్జింగ్ పోర్ట్ؚలు (రెండు టైప్-C అప్ ؚఫ్రంట్), క్యాబిన్‌లో బహుళ 12V సాకెట్‌లు మరియు గృహ ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్ ఇన్ చేయడానికి 115V AC పవర్ సాకెట్ؚలను అందించి ప్రాక్టికాలిటీ విషయంలో రాంగ్లర్ మంచి మార్కులను సంపాదించుకునేలా జీప్ జాగ్రత్త పడింది.
ఇది కూడా చదవండి: BS6 ఫేజ్ 2కు అప్‌డేట్ చేసిన కార్‌లు మరియు యజమానులకు ఒక కొత్త ప్రోగ్రాంను పరిచయం చేసిన జీప్
ఆశించిన ఫీచర్ నవీకరణలు
అయితే, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో సరికొత్త స్టెల్లాంటిస్ తాజా యుకనెక్ట్ 5 ఆపరేటింగ్ సిస్టమ్ؚతో నడిచే 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ (ఈ బ్రాండ్ؚలో ఇప్పటి వరకు అతి పెద్దది) చెప్పుకోదగిన నవీకరణలో ఒకటి. మరిన్ని కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, ఐదు యూజర్ ప్రొఫైల్ؚలు మరియు వాలెట్ మోడ్, వాయిస్ రికగ్నిషన్ మరియు అలెక్సా “హోమ్-టు-కార్” కనెక్టివిటీ వంటివి కూడా పొందింది.
USలో సాహసం పై ఆసక్తి ఉన్నవారి కోసం, జీప్, ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ؚలో “ట్రైల్స్ ఆఫ్ؚరోడ్” సాఫ్ట్ؚవేర్ؚను జోడించింది, ఇటువంటి 3,000 కంటే ఎక్కువ మార్గాల ప్రాప్యతను పొందడానికి సబ్ؚస్క్రిప్షన్ ద్వారా దీన్ని అప్ؚగ్రేడ్ చేసుకోవచ్చు. దేశమంతటా జీప్ “62 బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్” మార్గాలతో సహా అనేక ప్రఖ్యాత ఆఫ్-రోడ్ మార్గాలను ఇది చూపుతుంది.
జీప్, నవీకరించబడిన రాంగ్లర్‌లో 12-వే పవర్-అడ్జస్టబుల్ మరియు హీటెడ్ ముందు సీట్‌లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, ముందు కెమెరా మరియు తొమ్మిది-స్పీకర్‌ల అల్పైన్ మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా అమర్చింది. భద్రత విషయానికి వస్తే, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగ్ؚలు, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, వెనుక క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ؚతో సహా 85+ ఫీచర్‌లను పొందింది.
ఆఫ్-రోడ్ మరియు పవర్‌ట్రెయిన్ వివరాలు
జీప్ 2024 రాంగ్లర్‌లో, నవీకరించిన ముందు మరియు వెనుక ఆక్సీల్స్‌తో పాటు క్రాల్ నిష్పత్తిని మెరుగుపరిచింది. ఈ ఆఫ్-రోడర్ సవరించిన గ్రౌండ్ క్లియరెన్స్ మరియు నీటిలో నడిచే సామర్ధ్యంతో పాటు మెరుగైన అప్రోచ్, బ్రేక్ ఓవర్ మరియు డిపార్చర్ యాంగిల్స్ؚను కూడా పొందింది.
ఎలక్ట్రిఫైడ్ 4xe వెర్షన్‌తో సహా - అందుబాటులో ఉన్న బహుళ పవర్‌ట్రెయిన్ؚల నుండి – నవీకరించిన రాంగ్లర్ 270PS పవర్, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (ఎనిమిది-స్పీడ్ ల ATతో) మరియు 285PS పవర్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ؚతో (ఆరు-స్పీడ్‌ల MT లేదా ఎనిమిది-స్పీడ్‌ల ATతో జోడించబడుతుంది) 3.6-లీటర్ V6 పెట్రోల్ యూనిట్ؚను పొందుతుంది.
ఇది కూడా చదవండి: ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన అన్ని కార్‌ల వివరాలు
భారతదేశంలో విడుదల మరియు ధర
జీప్, నవీకరించబడిన రాంగ్లర్‌ను 2024లో భారతదేశానికి తీసుకువస్తుందని ఆశిస్తున్నాము, దీని ప్రారంభ ధర రూ.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్ؚకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ప్రస్తుత రాంగ్లర్, స్థానికంగా అసెంబుల్ చేసి మన మార్కెట్ؚలో అందించబడుతోంది.
ఇక్కడ మరింత చదవండి: జీప్ రాంగ్లర్ ఆటోమ్యాటిక్