• English
  • Login / Register

2015 లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ పోస్ట్స్ రికార్డ్ అమ్మకాలు

జనవరి 12, 2016 03:50 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా మోటార్స్ సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, 2015 లో సాదించిన దాని ఉత్తమ వార్షిక అమ్మకాలు ప్రదర్శన ను పోస్ట్ చేసింది మరియు గత సంవత్సరం కంటే 5% పెంపుతో 4,87,065 యూనిట్ల వాహనాలను అమ్మింది. 2009 వ సంవత్సరం లో సాధించిన అమ్మకాలు కన్నా రెండింతలు ఎక్కువగా 2015 లో అమ్మకాలు జరిపిపింది మరియు కార్ల అమ్మకాలలలో వరుసగా ఆరవ వ సంవత్సరం విజయాన్ని సాదించింది.

జాగ్వార్ సంస్థ ద్వారా జరుపబడిన అమ్మకాల మొత్తం 83,986 - ఒక దశాబ్ద కాలానికి ఈ బ్రాండ్, ఒక బలమైన ప్రదర్శన ను కలిగి ఉంది. దీనితో పాటు ల్యాండ్ రోవర్, మొదటి సారి 4,00,000 మార్క్ ను దాటింది. అంతేకాకుండా, ఈ సంస్థ, 2014 వ సంవత్సరానికి వ్యతిరేకంగా 6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్ సేల్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ అయిన ఆండీ గాస్ వార్షిక నటన గురించి వ్యాఖ్యానిస్తూ, "అనేక నవీకరించబడిన నమూనాలు, కొత్త జాగ్వార్ ఎక్స్ ఈ మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాహనాలను ఈ సంస్థ యొక్క పోర్ట్ఫోలియో పరిధిలో పరిచయం చేయడం జరిగింది దీని వలన ఈ సంవత్సరం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం ఒక ముఖ్యమైన సంవత్సరం అని చెప్పవచ్చు" అని వ్యాఖ్యానించారు.

"కస్టమర్ స్పందన యుకె, ఉత్తర అమెరికా మరియు యూరోప్ అంతటా అమ్మకాల రికార్డు ఫలితంగా, చాలా అనుకూలంగా ఉంది. 15 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కొరకు మరియు 19 జాగ్వార్ ఎక్స్ ఈ కోసం మాత్రమే సాదించింది మరియు 2015 వ సంవత్సరంలో 95 ప్రపంచ అవార్డుల ద్వారా జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ గుర్తింపును పొందాయి. అన్ని కొత్త మరియు నవీకరించబడిన వాహనాలతో పాటు రేంజ్ రోవర్ ఈవోక్యూ కన్వర్టబుల్ అలాగే జాగ్వార్ ఎఫ్ పేస్ వంటి వాహనాలతో 2016 వ సంవత్సరం ఈ సంస్థ కు మరొక ఉత్తేజకరమైన సంవత్సరం అని చెప్పవచ్చు. 

చైనా లో అమ్మకాలు మందగించి ఉన్నప్పటికీ, ఈ సంస్థ బ్రిటన్, బైజ్లింగ్ అలాగే విలాసవంతమైన కార్లతో ఈ లగ్జరీ కార్ల మార్కెట్ లో అమ్మకాలు పరంగా రికార్డు బద్దలు కొట్టింది.

యూరప్ దేశం, 2015 వ సంవత్సరంలో 28 శాతం వృద్ది రేటుతో 1,10,298 యూనిట్ల అమ్మకాలను జరిపి జె ఎల్ ఆర్ యొక్క అత్యధికంగా అమ్ముడు పోయో ప్రాంతాలలో ఒకటిగా ఉంది. 2014 వ సంవత్సరం తో పోలిస్తే 21 శాతం వృద్దిని సాదించింది. యునైటెడ్ కింగ్డం లో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ వినియోగదారులకు మొత్తం 1,00,636 యూనిట్ల వాహనాలను పంపిణీ చేసింది.

గత ఐదు సంవత్సరాలలో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ టర్నోవర్ లో మూడింతలు కంటే ఎక్కువ, దాని అమ్మకాలలో రెట్టింపు మరియు కొత్త ఉత్పత్తి సృష్టి మూలధన వ్యయం £ 11 బిలియన్ పెట్టుబడి ని ఈ సంస్థ పెట్టింది.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience