• English
  • Login / Register

స్లొవేకియాలో తమ జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఉత్పత్తి ప్లాంటును స్పష్టం చేసిన టాటా సంస్థ

డిసెంబర్ 16, 2015 12:28 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 22 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ: టాటా వారి జాగ్వార్ ల్యాండ్‌రోవర్ యొక్క అధికారిక ప్రకటన ప్రకారం వారు ఒక కొత్త వాహనాల ఉత్పత్తి ప్లాంటును స్లువేకియాలో స్థాపించనున్నట్టు తెలిపారు. ఈ ప్రతిపాదన అక్కడి అధికారులతో అనేక నెలల దౌత్య రాయభారాల తరువాత వెల్లడయ్యింది. ఈ ప్లాంటు పడమటి నగరమైన నిత్రా లో స్థాపితమవుతుంది మరియు ఇందుకు సంబందించిన కీలక ఆపరేషన్లు 2018 లో ప్రారంభించేందుకు యోచిస్తుంది.

దాదపు 2,800 ఉద్యోగులను మరియు ఒక 1.5 బిలియన్ యు.ఎస్ డాలర్ పెట్టుబడితో ఈ ప్లాంటు ను ప్రారంభించబోతున్నారు. ఇక ఈ ప్లాంటు సామర్ధ్యానికి వస్తే ఇది 1,50,000 యూనిట్ల మొదటి దశలో కలిగి ఉంటుంది. అయితే, ఈ బ్రిటీష్ కారు తయారీదారులు ఈ సంఖ్య 3,00000 లకు పెంచే ప్రణాళికను ఆశిస్తున్నారు. ప్రస్తుతం జె.ఎల్.ఆర్ బ్రెజిల్,చైనా,ఇండియా మరియు యునైటెడ్ కింగ్‌డం లో తమ వాహనాలను తయారు చేస్తున్నారు.

డాక్టర్ రాల్ఫ్ స్పెథ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఈ విధంగా అన్నారు " జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఈ రోజు స్లొవేకియా ను తమ ఉత్పాదక కుటుంబంలోనికి ఆహ్వానించడానికి ఉత్సాహంగా ఉంది. ఈ కొత్త ఫ్యాక్టరీ ఇంతకు ముందు ఉన్న యు.కె,చైనా,ఇండియా మరియు బ్రెజిల్ కు మద్దతును అందించే విధంగా ఉండబోతోంది మరియు ఇది సంస్థ యొక్క వ్యూహాత్మక ప్రపంచ విస్తరణ అభివృద్ధిలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు." అని ఆయన వివరించారు.

జాగ్వార్ ల్యాండ్‌రోవర్ తమ యొక్క కొత్త అల్యూమియం ఆధారిత వాహన శ్రేణి ని తయారుచేసే ప్లాంటును నెలకొల్పారు కానీ, ఈ వాహనాలకు సంబంధించిన ఎటువంటి విశేషాలు తెలియరాలేదు. అయితే అంచనాల ప్రకారం, 2018 తరువాతి తరం ల్యాండ్‌రోవర్ కుటుంబానికి సంబందించిన శ్రేణి వివరాలు ఈ సమయంలో ఆశించలేకపోవచ్చనే చెప్పాలి.

రాబర్ట్ ఫికో ప్రధాన మంత్రి స్లువేకియా ఈ విధంగా అన్నారు " జాగ్వార్ ల్యాండ్‌రోవర్ వారు స్లువేకియాను తమ కొత్త ప్రపంచ శ్రేణి వాహన తయారీ కి ఎంచుకోవడం ఆనందకరం. ఒక సంగ్రమైన పెట్టుబడి మరియు బలమైన బిజినెస్ పరిసరాలు కలిగి ఉండడం ద్వారా స్లువేకియా పెట్టుబడిదారులకు ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇంకా, స్లువేకియా వారి కళాత్మ సామర్ధ్యం మరియు బ్రిటీష్ వారి ఇంజినీరింగ్ సమర్ధత కలగలిపి ఎన్నో అద్భుతమైన ఉత్పాదకాలను ముందుకు తీసుకురాగలవు."

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience