జాగ్వార్ ఎఫ్-టైప్ SVR బహిర్గతం
జనవరి 27, 2016 06:50 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాగ్వార్ త్వరలో F-Type స్పోర్ట్స్ కారు ఒక ప్రత్యేక ఎడిషన్ ప్రారంభించనున్నది. ఈ కారు F-Type SVR గా నామకరణం చేయబడింది, అయితే SV అనగా ప్రత్యేక వాహన ఆపరేషన్స్. పేరు సూచించినట్లుగా, వాహనం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రత్యేక వాహన నిర్వాహక శాఖ సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఈ జాగ్వార్ SV బ్యాడ్జ్ తో పరిచయం చేయబడడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం, రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR పేరుతో అందజేయబడింది.
ఈ కారు ప్రాజెక్టు 7 ఎడిషన్ నుండి దాని ఇంజన్ ట్యూన్ స్వీకరించింది. బహిర్గతమైన బ్రోచర్ ప్రకారం 5.0 లీటరు V8 ఇంజిన్ తో అమర్చబడి 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడుతుంది. ఫలితంగా 680 ఎన్ఎమ్ తో 542 బిహెచ్పి నుంచి 700Nm తో 567bhp కి పనితీరు పెరిగింది. ఈ కారుని తేలికగా ఉంచేందుకు కార్బన్ సిరామిక్ బ్రేక్స్ వంటివి అందించడం జరిగింది. ఈ సిరామిక్ బ్రేక్స్ 21 కిలోలు తేలికైనదిగా ఉంటుంది మరియు అదనపు 12kgs ఆదా చేస్తుంది. వీటన్నిటి ఫలితంగా ఈ వాహనం 0 నుండి 100kmph 3.7 సెకన్లలో చేరుకుంటుంది మరియు ఇది AWD F-Type R కంటే 0.4 సెకన్లు వేగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 321.86kph చేరుకోగలదు.
బాడీ కి ఒక విస్తృత టైర్లు సమితి అందించడం వలన మంచి మలుపు పట్టును మరియు అధిక వేగం స్థిరత్వం కలిగి ఉంటుంది. అలానే కారు పెద్ద వెనుక డిఫ్యూజర్, వెనుక వింగ్, ముందు పెద్ద స్పాయిలర్, పెద్ద గాలి సంగ్రహణ మరియు నకిలీ అల్యూమినియం మిశ్రమాలను పొంది ఉంటుంది. ఈ కారు మార్చిలో జరుగనున్న జెనీవా మోటార్ షోలో పరిచయం చేయబడుతుంది. ఈ కొత్త F- టైప్ SVR జాగ్వార్ ప్రత్యేక వాహన ఆపరేషన్స్ మరియు ప్రెసిషన్ ఇంజనీరింగ్, పనితీరు మరియు రూపకల్పన ప్రయోజనాల నుండి చేయబడిన మొదటి సిరీస్ ఉత్పత్తి. దాని ఫలితంగా 200mph అన్ని వాతావరణాలకు సరిపోయేటటువంటి ఈ కారు ప్రతి రోజు డ్రైవ్ చేసే విధంగా ఉంటుంది. దీనిలో కన్వర్టిబుల్ వెర్షన్ కూడా ఇవ్వడం వలన ఔత్సాహికులు కొత్త టైటానియం ఎగ్సాస్ట్ వ్యవస్థ నుండి ధ్వనిని అత్యధికంగా ఆనందించగలరు.
ఈ కారు £100,000 ధరని కలిగి ఉంటుంది, భారత ధరలో 97 లక్షలు. అదే ఈ కారు భరతదేశంలో ప్రారంభిస్తే గనుక రూ.2.5 - 3 కోట్లు ఉంటుంది.
ఇంకా చదవండి జాగ్వార్ ఎఫ్-టైప్ కోసం బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ని ప్రారంభించనున్నది