హ్యుందాయ్ వెన్యూ vs హ్యుందాయ్ క్రెటా డీజిల్-మాన్యువల్: రియల్-వరల్డ్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్ పోలిక
అక్టోబర్ 24, 2019 02:01 pm dhruv ద్వారా ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండు హ్యుందాయ్ SUV లు వాస్తవ ప్రపంచంలో ఎలా పనితీరుని అందిస్తాయి?
హ్యుందాయ్ యొక్క వెన్యూ మరియు క్రెటా ఒకే విభాగంలో పోటీపడకపోవచ్చు, అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి మరియు ఒక SUV ని కొనాలని చూస్తున్న వారికి ఏది మంచి కారు అని నిర్ణయం తీసుకోడంలో తికమక పడతారు. మీ కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేయడానికి, మేము రెండు హ్యుందాయ్ SUV ల వాస్తవ ప్రపంచ పనితీరు మరియు మైలేజ్ ని పోల్చాము.
ఈ పోలికలో, మేము వెన్యూ 1.4-లీటర్ డీజిల్-మాన్యువల్ మరియు క్రెటా 1.6-లీటర్ డీజిల్-మాన్యువల్ ని ఎంచుకున్నాము, ఎందుకంటే ఇవి మనకు పరీక్షించాల్సిన కార్లు. మేము వాస్తవ ప్రపంచ పరీక్షలకు వెళ్లేముందు, ఈ రెండు SUV ల స్పెసిఫికేషన్స్ ని పరిశీలిద్దాం.
హ్యుందాయి వెన్యూ |
హ్యుందాయి క్రెటా |
|
డిస్ప్లేస్మెంట్ |
1.4-లీటర్ |
1.6-లీటర్ |
పవర్ |
90PS |
128PS |
టార్క్ |
220Nm |
260Nm |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ MT |
6-స్పీడ్ MT |
క్లెయిమ్ చేసిన FE |
23.7kmpl |
20.5kmpl |
ఎమిషన్ టైప్ |
BS4 |
BS4 |
పేపర్ మీద చూస్తే గనుక, హ్యుందాయ్ క్రెటా మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉండగా, వెన్యూ మంచి మైలేజ్ ని అందిస్తుంది. అయితే, వాస్తవ ప్రపంచంలో కథ ఎలా ఉంది?
పనితీరు పోలిక
ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్ పరీక్షలు:
0-100kmph |
30-80kmph |
40-100kmph |
|
హ్యుందాయ్ వెన్యూ |
12.49s |
8.26s |
14.04s |
హ్యుందాయ్ క్రెటా |
10.83s |
7.93s |
13.58s |
క్రెటా యొక్క పెద్ద మరియు శక్తివంతమైన ఇంజిన్ ఆక్సిలరేషన్ పరీక్షల విషయానికి వస్తే తనదైన ధీటైన పనితీరుని అందిస్తుంది. ఇది హ్యుందాయ్ వెన్యూ ని ఖచ్చితంగా ఓడిస్తుంది, ఎందుకంటే ఈ చిన్న SUV నాలుగవ గేర్ లోని 40-100 కిలోమీటర్ల స్ప్రింట్‌లో మాత్రమే క్రెటా లాంటి పనితీరుని అందిస్తుంది.
బ్రేకింగ్ డిస్టెన్స్:
100-0kmph |
80-0kmph |
|
హ్యుందాయి వెన్యూ |
45.96m (wet) |
28.53m (wet) |
హ్యుందాయి క్రెటా |
43.43m |
26.75m |
వెన్యూ కి వచ్చిన బ్రేకింగ్ ఫిగర్స్ మనకి తడిగా ఉన్న పరిస్థితులలో రావడం జరిగింది మరియు దాని వలన పొడిగా ఉన్నప్పుడు పరీక్ష చేసిన క్రెటాతో దీనిని పోల్చడం అనేది భావ్యం కాదు, కానీ గ్యాప్ అనేది 2-3 మీటర్స్ ఉండడం మరియు ఈ రెండు పరిస్థితులలో క్రెటా ముందుండడం వలన బ్రేకింగ్ కండిషన్ అనేది స్థిరమైన ప్రాంతాలలో కొద్దిగా ఒకేలా ఉంటుందని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: పాపులర్ SUV లపై వెయిటింగ్ పీరియడ్ - దీపావళికి మీరు దేనిని ఇంటికి తీసుకురాగలరు?
ఫ్యుయల్ ఎఫిషియన్సీ పోలిక
క్లైమెడ్ (ARAI) |
హైవే (పరీక్షించిన) |
సిటీ (పరీక్షించిన) |
|
హ్యుందాయ్ వెన్యూ |
23.7kmpl |
19.91kmpl |
18.95kmpl |
హ్యుందాయ్ క్రెటా |
20.5kmpl |
21.84kmpl |
13.99kmpl |
పెద్ద ఇంజిన్ ఉన్నప్పటికీ, క్రెటా హైవేపై మంచి మైలేజ్ ని అందిస్తుంది. ఏదేమైనా, సిటీ విషయానికి వస్తే దాని సామర్థ్యం కొంచెం పడిపోతుంది మరియు ఈ సందర్భంలో వెన్యూ కొంచెం ముందంజలో ఉంది అని చెప్పవచ్చు.
మీ వాడకం ప్రకారం మీరు ఎటువంటి మైలేజ్ ని ఆశించవచ్చో తెలుసుకోవడానికి క్రింది పట్టికను చూడండి.
50% హైవే, 50% సిటీ |
25% హైవే, 75% సిటీ |
75% హైవే, 25% సిటీ |
|
హ్యుందాయి వెన్యూ |
19.42kmpl |
19.66kmpl |
19.18kmpl |
హ్యుందాయి క్రెటా |
17.06kmpl |
15.37kmpl |
19.15kmpl |
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs ఫోర్డ్ ఫిగో డీజిల్ మాన్యువల్: రియల్-వరల్డ్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్ పోలిస్తే
తీర్పు
డబ్బు గనుక మీకు అంత మ్యాటర్ కాకపోతే మరియు మీకు హైవే మీద ప్రయాణించేటప్పుడు స్ట్రైట్ లైన్ వేగం, బ్రేకింగ్ సామర్ధ్యాలు మరియు మైలేజ్ వంటివి మీ దృష్టిలో ఉంటే, మీరు క్రెటాను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. ఏదేమైనా, మీరు సిటీ చుట్టూ చాలా డ్రైవ్ చేస్తే మరియు మైలేజ్ కోసం అదనపు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటే, సిటీలో అద్భుతమైన మైలేజ్ ని అందించే వెన్యూ ని ఎంచుకోండి.
మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా డీజిల్
0 out of 0 found this helpful