హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs ఫోర్డ్ ఫిగో డీజిల్-మాన్యువల్: రియల్-వరల్డ్ పనితీరు & మైలేజ్ పోలిక
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023 కోసం dhruv ద్వారా అక్టోబర్ 19, 2019 11:11 am స వరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వాస్తవ ప్రపంచంలో ఫోర్డ్ ఫిగో తో హ్యుందాయ్ యొక్క తాజా హ్యాచ్‌బ్యాక్ ఎలా పోటీ పడుతుందో ఇక్కడ చూద్దాము
గ్రాండ్ i10 నియోస్ ఒక హ్యాచ్‌బ్యాక్, ఇది హ్యుందాయ్ యొక్క ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఫీచర్లు మరియు రోజువారీ వినియోగాన్ని అందించే ఫార్ములాపై మెరుగుపడింది. అలాగే, ఫోర్డ్ ఫిగో డ్రైవర్ కారుగా ఔత్సాహికులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం, వాస్తవ ప్రపంచంలో మెరుగైన పనితీరు మరియు మైలేజ్ ని ఈ రెండు కార్లలో ఏది అందిస్తుంది అనేది చూద్దాము.
ఈ వివరాలలోనికి వెళ్ళే ముందు, పేపర్ మీద పెట్టి రెండు ఇంజిన్ల స్పెక్స్ ను పరిశీలిద్దాం. మేము రెండు కార్ల డీజిల్-మాన్యువల్ వేరియంట్లను స్వతంత్రంగా పరీక్షించి పోల్చాము.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
ఫోర్డ్ ఫిగో |
|
డిస్ప్లేస్మెంట్ |
1.2-లీటర్ |
1.5-లీటర్ |
పవర్ |
75PS |
100PS |
టార్క్ |
190Nm |
215Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT/AMT |
5-స్పీడ్ MT |
క్లెయిమ్ చేసిన FE |
26.2kmpl |
25.5kmpl |
ఎమిషన్ టైప్ |
BS4 |
BS4 |
కాగితంపై, పనితీరు పరంగా ఫిగో కారు గ్రాండ్ i10 నియోస్ ని ఓడించింది. ఫిగో యొక్క పెద్ద డిస్ప్లేస్మెంట్ వలన ఈ పనితీరు అనేది ఫిగో వైపు మొగ్గు చూపుతుంది. ఏదేమైనా, గ్రాండ్ i 10 నియోస్ ఫ్యుయల్ ఎఫీషియన్సీ పరంగా కొంచెం ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, అయితే పనితీరు పరంగా అయితే కొంచెం తక్కువే అని చెప్పవచ్చు.
కాబట్టి కాగితంపై చూస్తే, ఫోర్డ్ ఫిగో మంచి కారు అని చెప్పవచ్చు. వాస్తవ ప్రపంచ పరిస్థితులలో మేము ఈ రెండు కార్లను పరీక్షించినప్పుడు ఏమి జరుగుతుంది? క్రింద చూడండి.
పనితీరు పోలిక
ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్ పరీక్షలు:
0-100kmph |
30-80kmph |
40-100kmph |
|
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
13.13s |
8.84s |
14.06s |
ఫోర్డ్ ఫిగో |
10.69s |
8.74s |
15.35s |
దాని పెద్ద ఇంజిన్ మరియు ఎక్కువ శక్తి మరియు టార్క్ అవుట్పుట్ కారణంగా, ఫిగో 0-100 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్‌ను గెలుచుకుంటుంది. అయితే, రోల్-ఆన్ పరీక్షల విషయానికి వస్తే కథ ఒక్కసారిగా మారుతుంది. మూడవ గేర్‌లో 30-80 కిలోమీటర్ల వేగంతో వేగవంతం చేసేటప్పుడు గ్రాండ్ ఐ 10 నియోస్ ఫిగో కంటే పదవ వంతు మాత్రమే సెకెను లో వెనకాతల ఉంది మరియు నాల్గవ గేర్‌లో 40-100 కిలోమీటర్ల వేగంతో వేగవంతం చేసేటప్పుడు సెకనుకు మించి ఫిగో ని ఓడించగలదు.
ఫిగో ఒక స్టాప్ నుండి సరళ రేఖలో మెరుగైన టాప్ స్పీడ్ మరియు మెరుగైన యాక్సిలరేషన్ కలిగి ఉండగా, గ్రాండ్ i10 నియోస్ రోజువారీ వాస్తవ-ప్రపంచ డ్రైవింగ్ పరిస్థితులలో మెరుగైన పనితీరును అందిస్తుంది. అయితే, ఫిగో అంత వెనుకబడి లేదు.
బ్రేకింగ్ డిస్టెన్స్:
100-0kmph |
80-0kmph |
|
హ్యుందాయి గ్రాండ్i10 నియోస్ |
42.62m |
26.48m |
ఫోర్డ్ ఫిగో |
41.95m |
26.80m |
ఫిగో కారు హ్యుందాయ్ కంటే మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది, కానీ చాలా చిన్న తేడా మాత్రమే. రెండు కార్ల బ్రేకింగ్ దూరాలు చాలా దగ్గరగా ఉన్నాయి, ఈ యుద్ధంలో విజేతను ఎంచుకోవడం అన్యాయం. కాబట్టి, దీనిని టై అని పిలుద్దాం.
ఇది కూడా చదవండి: మారుతి స్విఫ్ట్ vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ vs ఫోర్డ్ ఫిగో vs ఫోర్డ్ ఫ్రీస్టైల్: స్పేస్ పోలిక
ఫ్యుయల్ ఎఫిషియన్సీ పోలిక
క్లెయిమ్ చేసిన (ARAI) |
హైవే (పరీక్షించబడిన) |
సిటీ (పరీక్షించబడిన) |
|
హ్యుందాయి గ్రాండ్i10 నియోస్ |
26.2kmpl |
21.78kmpl |
19.39kmpl |
ఫోర్డ్ ఫిగో |
25.5kmpl |
25.79kmpl |
19.42kmpl |
హ్యుందాయ్ గ్రాండ్ i 10 నియోస్ యొక్క ARAI- ధృవీకరించబడిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ ఫోర్డ్ ఫిగో కంటే మెరుగైనది. అయితే, వాస్తవ ప్రపంచంలో, కథ చాలా భిన్నంగా ఉంటుంది. ఫిగో సిటీలో మరియు హైవేలో లీటరుకు ఎక్కువ కిలోమీటర్లు తిరిగి వస్తుంది. సిటీలో వ్యత్యాసాన్ని అతి తక్కువగా పేర్కొనవచ్చు, హైవే సంఖ్యల పరంగా ఫిగో చాలా మంచి మైలేజ్ ని అందిస్తుంది.
మీ వినియోగాన్ని బట్టి రెండింటి నుండి మీరు ఎలాంటి మైలేజ్ ని ఆశించవచ్చో చూడాలనుకుంటే, దిగువ పట్టికను చూడండి.
50% హైవే, 50% సిటీ |
25% హైవే, 75% సిటీ |
75% హైవే, 25% సిటీ |
|
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
20.52kmpl |
19.93kmpl |
21.13kmpl |
ఫోర్డ్ ఫిగో |
22.16kmpl |
20.7kmpl |
23.84kmpl |
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ vs మారుతి సుజుకి స్విఫ్ట్ vs ఫోర్డ్ ఫిగో: డీజిల్ మాన్యువల్ పోలిక
తీర్పు
కంపెనీ ఇచ్చిన గణాంకాలు బట్టి హ్యుందాయి గ్రాండ్ ఐ 10 నియోస్ మెరుగైన మైలేజ్ ని అందిస్తుండగా, ఫోర్డ్ ఫిగో మెరుగైన పనితీరును అందిస్తుండగా, కథ వాస్తవ ప్రపంచంలో రివర్స్ చేయబడింది. అవును, ఫిగో స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది, అయితే ఇది మూడవ మరియు నాల్గవ గేర్‌లలోని ఇన్-గేర్ ఆక్సిలరేషన్ చాలా ముఖ్యమైనది మరియు ఇక్కడ గ్రాండ్ ఐ 10 నియోస్ ఫోర్డ్ కంటే కొంచెం మెరుగ్గా పనిచేస్తుంది. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క తక్కువ గేరింగ్ శక్తి వలన, ఫోర్డ్ కంటే మెరుగైన సమయాన్ని పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఫ్యుయల్ ఎఫిషియన్సీగురించి మాట్లాడితే, ఫోర్డ్ యొక్క ARAI- సర్టిఫైడ్ ఎఫిషియెన్సీ ఫిగర్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కంటే తక్కువగా ఉంటుంది, కానీ వాస్తవ ప్రపంచంలో, ఫిగో ఎక్కువ మైలేజ్ ని ఇస్తుంది. ఈ వ్యత్యాసం, ముఖ్యంగా హైవేపై మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది.
సిటీ డ్రైవింగ్ కోసం మీకు ప్రధానంగా కారు కావాలంటే, ఈ సందర్భంలో హ్యుందాయ్ గ్రాండ్ i 10 నియోస్‌ను మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే, మీరు హైవే పై మరింత తరుచుగా తిరుగుతున్నట్లయితే, అప్పుడు మీరు ఫిగోను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము.
మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i 10 నియోస్ AMT
0 out of 0 found this helpful