టాటా-పంచ్ؚకు పోటీగా నిలిచే SUV ఎక్స్టర్ؚను ఆవిష్కరించి, బుకింగ్ؚలను ప్రారంభించిన హ్యుందాయ్
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం tarun ద్వారా మే 09, 2023 02:59 pm ప్రచురించబడింది
- 67 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సరికొత్త మైక్రో SUV ఇంజన్ ఎంపికలను ప్రకటించారు మరియు దీని విక్రయాలు జూన్ చివరిలో ప్రారంభం అవుతాయని అంచనా
-
హ్యుందాయ్ ఎక్స్టర్ వెన్యూ కంటే క్రింది స్థానంలో నిలుస్తుంది.
-
ఐదు వేరియెంట్ؚలలో లభిస్తుంది - EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్.
-
6 సింగిల్-టోన్ మరియు 3 డ్యూయల్-టోన్ ఎక్స్ؚటీరియర్ రంగులు ఎంపికలో అందుబాటులో ఉంటాయి.
-
ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు AMT ట్రాన్స్ؚమిషన్‌తో 83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ పవర్‌ను అందిస్తుంది.
-
ధరలు సుమారు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.
హ్యుందాయ్ తన రాబోయే మైక్రో SUV ఎక్స్టర్ ఎక్స్ؚటీరియర్ ప్రొఫైల్ؚను అధికారికంగా విడుదల చేసింది. దీనితో, రూ.11,000 ముందస్తు ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని ధరలు జూన్ؚలో వెల్లడి అవుతాయని అంచనా.
హ్యుందాయ్ ఎక్స్టర్ దృఢమైన మరియు స్ఫుటంగా కనిపించే తీరును కలిగి ఉంటుంది. మందమైన బోనెట్, నిటారైన ఫ్రంట్ ఫేసియా మరియు స్కిడ్ ప్లేట్ؚలతో బలమైన ముద్రని వేస్తుంది. ముందు గ్రిల్ విలక్షణంగా ఉంటుంది మరియు భారతదేశంలోని మరే ఇతర హ్యుందాయ్ కార్ؚలలో లేని విధంగా ఉంటుంది. బంపర్ దిగువన ప్రొజెక్టర్ హెడ్ؚల్యాంప్ؚలతో స్క్వేర్ హెడ్ؚల్యాంప్ కవరింగ్ మరియు H-ఆకారపు Led DRLలు వంటి కొన్ని జియోమెట్రిక్ డిజైన్ؚలను కూడా చూడవచ్చు.
దీని ముందు వైపు SUVలా దృఢంగా కనిపించకపోతే, సైడ్ ప్రొఫైల్‌ను చూడండి. ముందుకు వచ్చిన వీల్ ఆర్చ్ؚలు, బాడీ క్లాడింగ్, దృఢమైన షోల్డర్ లైన్ؚలు, రూఫ్ రెయిల్ؚలు SUVలా కనిపించేలా చేస్తాయి. వెనుక ప్రొఫైల్ؚను వెల్లడించలేదు కానీ మునపటి H-ఆకారపు అంశాలు మరియు బాడీ క్లాడింగ్-ఇంటిగ్రేటెడ్ బంపర్ؚతో నిటారైన వైఖరిని కలిగి ఉంటుందని అంచనా.
ఇది కూడా చదవండి: చిన్నదైన ఒక ముఖ్యమైన భద్రత నవీకరణను అన్ని కార్‌లలో అందించిన హ్యుందాయ్
హ్యుందాయ్ ఎక్స్టర్ؚను 6 మోనోటోన్ మరియు 3 డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ రంగులతో అందిస్తుంది. కాస్మిక్ బ్లూ మరియు రేంజర్ ఖాకీ ఎంపికలను (డ్యూయల్-టోన్ షేడ్) పొందుతుంది, ఈ బ్రాండ్ లైనప్ؚకు ఇది పూర్తిగా కొత్తది.
ఇంటీరియర్ మరియు ఫీచర్‌ల జాబితాను ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ ప్రీమియం మరియు అనేక ఫీచర్‌లు కలిగి ఉన్న క్యాబిన్‌ను ఆశించవచ్చు. ఈ జాబితాలో భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ సౌకర్యం, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్ పవర్ؚట్రెయిన్ ఎంపికలను కూడా వెల్లడించారు. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది, ఇది 83PS మరియు 114PS పవర్‌ను అందిస్తుంది. ట్రాన్స్ؚమిషన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMTలు నిర్వహిస్తాయి. 5-స్పీడ్‌ల మాన్యువల్‌తో CNG ఎంపికను కూడా పొందుతుంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నా టర్బో DCT Vs స్కోడా స్లేవియా మరియు వోక్స్ؚవ్యాగన్ వర్చుస్ 1.5 DGS: వాస్తవ ఇంధన సామర్ధ్య పోలిక
హ్యుందాయ్ ఎక్స్టర్ ఐదు వేరియెంట్‌లలో లభిస్తుంది - EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. ధరలు సుమారు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతాయని అంచనా. ఇది టాటా పంచ్, సిట్రియోన్ C3లతో పోటీ పడుతుంది మరియు నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మరియు మారుతి ఫ్రాంక్స్ కూడా దీనికి పోటీదారులుగా ఉంటాయి.