ఐయోనీక్ ను పరిచయం చేసిన హ్యుందాయ్ - ఎలక్ట్రిక్,ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఫీచర్ లను కలిగిన ప్రపంచపు మొదటి కారు.
డిసెంబర్ 10, 2015 06:14 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
విశ్వ వ్యాప్త ప్రయోగం లో భాగంగా స్వదేశీ మార్కెట్ అయిన కొరియాలో జనవరి 2016లో, తరువాత జెనీవా మరియు న్యూయార్క్ ఆటో షో లలో లాంచ్ కు అన్ని సిద్దంగా ఉన్నాయి.
హ్యుందాయ్ మోటార్స్ దాని కొత్త ప్రత్యామ్నాయ ఇంధన వాహనం యొక్క పేరును మొదటిసారి బయటకు వెల్లడించింది. ఈ కారు పేరు ను ఐయనీక్ గా నిర్ణయించారు. ఈ కారు ప్రపంచంలో మూడు ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలతో అందుబాటులో ఉన్న మొదటి వాహనం. అనగా, విద్యుత్, ప్లగ్-ఇన్ గాసోలిన్ / ఎలక్ట్రిక్ హైబ్రిడ్, లేదా గాసోలిన్ / ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పవర్ ట్రేన్ లతో ఉంటుంది. హ్యుందాయ్ ఐయనీక్ మొదటిసారి కొరియన్ మార్కెట్ లో వచ్చే నెల ప్రారంభించబడుతుంది. దానితో పాటు అట్లాంటిక్ సముద్రపు రెండు చివరలను అనగా, అమెరికా మరియు యూరోప్ లలో 2016 లలో జరిగే జెనీవా మరియు న్యూయార్క్ ఆటో షో లలో మొదటిసారి ప్రజలు అందరికి చూడడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ కారు యొక్క పేరును దానిని తయారు చేసేందుకు ఉపయోగించిన మూలకాల పేర్ల నుండి తీసుకొని పెట్టారు. ఒక 'అయాన్' అనేది విద్యుత్ తో చార్జ్ చేయబడిన అణువు. ఈ అణువు కారు యొక్క తెలివైన ఎలెక్ట్రిఫైడ్ పవర్ ట్రేన్ తో లింక్ చేయబడి ఉంటుంది. పేరు యొక్క రెండవ భాగం హ్యుందాయ్ పరిధి ఏకైక సమర్పణ గురించి ప్రస్తావిస్తుంది. చివరగా కారు లోగో లో ప్రస్తావించినట్లుగా "క్యూ" ఒక దృశ్య పురోగతిని, తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక, తక్కువ ఉద్గార మోడల్ ని తెలియజేస్తూ చేర్చబడినది.
హ్యుందాయ్ ఐయనీక్ ప్రపంచంలో అత్యుత్తమ అమ్మకాలు కలిగిన హైబ్రిడ్ కారు 2016 టయోటా ప్రీయస్లో ( టయోటా ప్రీయస్లో గురించి పూర్తిగా చదవండి http://telugu.cardekho.com/car-news/More%20Efficient%20Toyota%20Prius%20Unveiled!-16571) ను ప్రధాన ప్రత్యర్ధిగా కలిగి ఉంది. కొత్త ప్రీయస్లో లాగానే హ్యుందాయ్ ఐయనీక్ కూడా కారులా టీజర్ చిత్రం లో చూపిన విధంగా అదే పోలికలతో అన్వయించారు. ఐయనీక్ ప్లాట్-ఫాం ఒక కొత్త బ్రాండ్ లా మరియు మూడు పవర్ ట్రైన్లను హ్యాండల్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేశామని ఈ కారు యొక్క కొరియన్ ఆటొమేకర్ తెలిపింది.
ఇది చూడండి: